
సౌత్‌లో ఎందుకు సౌండ్ లేదు?
ఆమిర్ ఖాన్ ‘సితారే ’ హిట్టేనా...
అప్పట్లో వచ్చిన ఆమిర్‌ఖాన్ ‘తారే జమీన్ పర్’ అమ్మా,నాన్నలకే కాదు అందరికీ గుండెలు పిండేసింది. డిస్లెక్సియాతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల మనో వేదనను ఆ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘సితారే జమీన్ పర్’ అంటూ ఆమిర్ ఈ సారి మళ్లీ అలాంటి సబ్జెక్టుతోనే మన ముందుకు వచ్చాడు. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది.
కానీ ఆ స్దాయిలో క్రేజ్, బజ్ క్రేయేట్ కాలేదు. దాంతో రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో సినిమాపై అందరి దృష్టీ పడుతుందనుకున్నారు. అది నిజమైందా అంటే బ్లాక్ బస్టర్ స్దాయి కాదు కానీ మల్టిప్లెక్స్ లు అదీ నార్త్ లో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. కానీ సౌత్ లో మాత్రం సందడి లేదు. ప్యాన్ ఇండియా సినిమా అనేది అలవాటైన ఈ రోజుల్లో అమీర్ ఖాన్ సినిమా స్దాయికి ఇది కాస్త ఆశ్చర్యమే.
మొదటి నుంచీ ‘సితారే జమీన్ పర్’ అనేది ఓ ప్రత్యేకమైన ప్రాజెక్టుగావనే చూస్తూ వచ్చాడు అమీర్ ఖాన్. ఓటీటీ ఆఫర్లకు చేతులు దూరంగా ఉంచుతూ, థియేటర్లే ప్రధానం అన్నాడు అమీర్ ఖాన్. ‘సితారే జమీన్ పర్’ ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తూ – ‘‘సినిమా అనేది తెరపైనే నిజంగా ఆవిష్కారం అవుతుంది’’ అన్న నమ్మకంతో నడిచాడు.
అనుకున్నట్లుగానే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్ గా రూ.60 కోట్లు వసూలు చేసింది. అమీర్ ఖాన్ సినిమా టాప్ 10 లోకి ఎక్కింది. అలాగే ఈ సినిమాకు ఓవర్సీస్లో కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లాంగ్ రన్లో 4 మిలియన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జోష్ కొనసాగితే ఈ చిత్రం మొదటి వారంలో 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశం ఉంది.
ఇది ఖచ్చితంగా సక్సెస్! కానీ అమీర్ ఖాన్ స్దాయి సక్సెస్ మాత్రం కాదు.
ఈ రోజుల్లో ఒక బాలీవుడ్ స్టార్ హీరో సినిమా రూ.60 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు అనిపించొచ్చు. కానీ ‘సితారే..’ బడ్జెట్ కేవలం ₹50 కోట్లు మాత్రమే కావటం కలిసొచ్చే విషయం. అమీర్ ఖాన్ ఇక్కడ నిర్మాత. దాంతో ఆయన రెమ్యునరేషన్ ప్రక్కన పెట్టి చూస్తే మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రికవరీ కి దగ్గరకు వచ్చారు. ఎంతలేదన్నా ఈ వారం పూర్తయ్యే సరికి వంద కోట్లు మార్క్ కు చేరే అవకాసం ఉందంటున్నారు. అంటే ఇకపై వచ్చేదంతా లాభమే.
Box Office Beyond – What Next?
Satellite హక్కులు ఇప్పటికే క్రేజీలో ఉన్నాయి.
YouTube Pay-per-view కు 8 వారాల తర్వాత అవకాశం. అప్పుడు మళ్లీ రెవిన్యూ ప్రారంభం అవుతుంది.
OTT Rights విలువ ఇప్పుడు రెట్టింపు అవుతోంది. అంటే ఎటు వైపు చూసినా – ‘సితారే’కు ఫ్యూచర్ క్లియర్ కట్.
అయితే... సౌత్ లో ఎందుకు సౌండ్ లేదు?
ఒకప్పుడు త్రీ ఈడియట్స్, పీకే లాంటి సినిమాలు సైతం సూపర్ హిట్ అయినా సౌత్ లో రిలీజ్ లు లేవు. అయితే ఇక్కడ ఆయన డబ్బింగ్ కాకపోయినా ఆయన సినిమాలు డైరక్ట్ హిందీ వెర్షన్స్ సైతం రిలీజ్ అయ్యి వర్కవుట్ అవుతూంటాయి. కానీ ఆయన గత కొన్నేళ్లుగా వరస ఫెయిల్యూర్స్ ఇస్తూ ఉన్నారు. దాంతో ఆమీర్ ఖాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అదీ ఏదన్నా యాక్షన్ సినిమా అయితే తప్పించి ఇక్కడ పట్టించుకునే పరిస్దితి లేదు.
దానికి తోడు అమీర్, ఈసారి మాత్రం పూర్తిగా నార్త్ ఫోకస్ చేశాడు. ప్రమోషన్స్ పూర్తిగా హిందీ బెల్ట్‌కే పరిమితమైంది. మల్టీప్లెక్స్ సిటీల్లో కూడా పర్ఫార్మెన్స్ పెద్దగా లేవు. సౌత్ ప్రేక్షకులపై ధ్యాస పెట్టి ఉంటే – వసూళ్లు ఇక్కడా బాగానే ఉండేవి. కానీ, "సినిమా దేశమంతటికి. కానీ పబ్లిసిటీ మాత్రం ఢిల్లీ హద్దులకే?" అన్నట్లు అయ్యిపోయింది.
సినిమా బిజినెస్ అంటే శాస్త్రం కాదు… శ్రద్ధ!
సౌత్‌లో ఉన్న తన ఫ్యాన్‌బేస్‌ని మరిచిన అమీర్ ఖాన్, ఇప్పుడు తాను చేసిన ఈ రీజనల్ ఇగ్నోరెన్స్ కారణంగా కొన్ని కోట్లను కోల్పోయాడని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. మల్టీలాంగ్వేజ్ ప్రమోషన్ వల్ల ఈ సినిమాకు మరింత వైడ్ బజ్ వచ్చేదని వాళ్లు భావిస్తున్నారు. అన్నట్టు, హిందీ బెల్ట్‌లో సినిమా దూకుడు కొనసాగుతోంది. కానీ నేషనల్ విజన్ ఉన్న సినిమాకు రీజనల్ ప్రెజెన్స్ కూడా అవసరం.
ఇది Comeback కాదు... Commercial Comeback!
వరుస ఫ్లాపులతో వెనకబడ్డ అమీర్‌కి ఇది ఓ బిజినెస్ లెవెల్ బ్రేక్. హిట్ టైటిల్‌తో బాక్సాఫీస్ రిలీఫ్ దక్కింది. కానీ పాన్ ఇండియా స్థాయిలో మళ్లీ తిరుగులేని బ్రాండ్ అవ్వాలంటే – తన ప్రమోషన్ స్ట్రాటజీలో ‘సౌత్’ అనే చాప్టర్‌ను కలుపుకోవాల్సిందే!
మార్కెటింగ్ టర్మ్‌లో చెప్పాలంటే:
"If you sell a Rolls-Royce at the price of a Maruti, and say it's sold out – it's not marketing genius; it's pricing confusion."
“సితారే జమీన్ పర్” భాక్సాఫీస్ పరంగా విజయంగా కనిపించినా… అంతర్లీనంగా చూస్తే ఇది ఓ పరిమిత విజయం మాత్రమే. దీన్ని ఇండస్ట్రీలో "Region Locked Thinking" అంటారు –ఒక పెద్ద నటుడు ఒకే మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేస్తే అది విజన్ లోపం కిందకు వస్తుంది. ఈ సినిమా విజయానికి కారణం అమీర్ తక్కువ బడ్జెట్, అధిక బాధ్యతతో ప్లాన్ చేశాడన్నది. కానీ పరిమిత మార్కెట్, కరువైన ప్రచారం – ఇవి సినిమా స్వరాన్ని సౌత్‌లో తగ్గించేశాయి.
ఏదైమైనా సితారే సినిమా సూపర్ హిట్ అనిపించాలి అనుకుంటే... మిగతా ఇండియా కూడా దాని విజయాన్ని విని మాట్లాడాలి. కానీ ఇప్పుడు విని మౌనంగా ఉన్నారు.