సికందర్‌  రివ్యూ
x

'సికందర్‌' రివ్యూ

సల్మాన్ ఖాన్ కు అచ్చివచ్చిన రంజాన్ కానుకగా రిలీజ్ చేసినా ఈ సినిమా తను అనుకున్న హిట్ కొట్టగలిగాడా..సినిమా కథేంటి, చూడదగ్గా సినిమానేనా చూద్దాం.

సల్మాన్ ఖాన్ హిట్ కొట్టి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. టైగర్ జిందా హై (2017) తర్వాత ఆయన నుంచి సరైన సినిమా రాలేదు. ఆడలేదు. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలని ఇప్పుడు సౌత్ సినిమాలు ట్రెండింగ్ లో ఉండటంతో ఇక్కడ డైరెక్టర్ మురగదాస్ తో ఆయన ఈ సినిమా చేశారు. అలాగే సూపర్ ఫామ్ లో ఉన్న రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. తనకు అచ్చివచ్చిన రంజాన్ కానుకగా రిలీజ్ చేశారు. మరి తను అనుకున్న హిట్ కొట్టగలిగాడా..సినిమా కథేంటి, చూడదగ్గా సినిమానేనా చూద్దాం.

స్టోరీ లైన్

సంజయ్ రాజ్ కోట్ ని అందరూ సికిందర్ (సల్మాన్ ఖాన్) అని పిలుస్తూంటారు.అతను గుజరాత్ లోని పెద్ద భవంతిలో తన భార్య సాయి శ్రీ రాజ్ కోట్ (రష్మిక)తో కలిసి ఉంటూంటాడు. అతను చాలా మంచి వాడు, జనాల హక్కులు కోసమే నిరంతరం పోరాడుతూంటాడు. అయితే ఓ సారి ముంబైకి చెందిన పొలిటీషన్ కొడుకు అర్జున్ ప్రధాన్ (ప్రతీక్ బర్బర్) అమ్మాయితో అసభ్యంతో ప్రవర్తిస్తే గొడవ పడతాడు. అతను స్టేట్ మినిస్టర్ ప్రధాన్ (సత్యరాజ్)కుమారుడు. దాంతో ప్రధాన్ అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు.

వెంటనే ఇనిస్పెక్టర్ ప్రకాష్ (కిషోర్) ని సంజయ్ ఇంటికి పంపుతాడు. అక్కడ ప్రకాష్ కు అసలు సంజయ్ ఎవరో, రాజ్ కోట్ లో అతనికి ఉన్న ఫాలోయింగ్ ఏమిటో తెలుస్తోంది. అంతేకాదు అతనికి భార్య సాయి శ్రీ రాజ్ కోట్ (రష్మిక) సపోర్ట్ ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుంది.

మధ్యలో ప్రమాదవశాత్తూ సాయిశ్రీ ప్రాణాలు కోల్పోతుంది. అయితే సంజయ్ ఆమె చనిపోయాక..ఓ విషయం తెలుసుకుంటాడు. సాయి శ్రీ బ్రతికి ఉండగానే ఆర్గాన్ డొనేట్ చేసింది. డాక్టర్ సహాయంతో ఆమె ఆర్గాన్స్ ఎవరికి డొనేట్ చేయబడ్డాయో వారి వివరాలు తెలుసుకుంటాడు. వారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటాడు. అప్పుడు వారిని కొంతమంది చంపాలనుకుంటున్నారని తెలుసుకుంటాడు. అప్పుడు సికిందర్ ఏం చేశారు. వాళ్లను ఎలా రక్షించాడు. అసలు ఎవ రా ముగ్గురు , సంజయ్ పై ప్రధాన్ పగ తీర్చుకున్నాడా. చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

ఎలా ఉంది

ఆర్గాన్ డొనేషన్ ద్వారా మీరు చనిపోయాక కూడా బ్రతికుంటారు అని ఈ కథతో చెప్పాలనే ది దర్శక,రచయిత మురుగదాస్ తాపత్రయం. ఈ విషయం చెప్పటానికి సల్మాన్ ఖాన్ వంటి హీరో అక్కర్లేదు. అంత భారీ బడ్జెట్ పెద్ద సినిమా అక్కర్లేదు అనిపిస్తుంది చూస్తుంటే. చిన్న యాడ్ సల్మాన్ తో చేసినా సరిపోతుంది కదా అనిపించడమే ఈ సినిమా చూస్తున్నప్పుడు నీరసం రావడానికి కారణం.

యాక్షన్ టీజర్, ట్రైలర్ చూసి థియేటర్ కు వెళ్లిన వాళ్లు తామొక మాస్ ఫిల్మ్ చూడబోతున్నాము అని ఫీలైతే అలాంటిదేమీ లేదని తేల్చేసాడు మురుగదాస్. సినిమాని ఎమోషనల్ కంటెంట్ తో నింపేసి షాక్ ఇస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాకు కొద్దిపాటి యాక్షన్ కలిపిన సినిమా సికిందర్. ఇలా ప్రీ రిలీజ్ ప్రమోషన్ మెటీరియల్ తో మిస్ లీడ్ చేసి ప్రేక్షకులను చీట్ చేయడం మురుగదాస్ కు కొత్తేమీ కాదు. గతంలో మహేష్ బాబు స్పైడర్ కు అలాగే చేశారు. ఇదిగో ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాకు ఇలాంటి పనేచేసాడు.

సికిందర్ సినిమా పూర్తిగా చనిపోయిన తన భార్య కు, ఓ భర్తకు మధ్య ఎమోషనల్ డ్రామా. భార్య చనిపోయాక వచ్చే ఛాలెంజ్ లను ఎదుర్కోవటం మీదే కథనం పూర్తిగా నడుస్తుంది. ఇలాంటి ఎమోషనల్ డ్రామా ని ఊహించని మాస్ ప్రేక్షకుడు సీట్ లో కుదురుగా కూర్చోవటం కష్టమే. పోనీ అదైనా సరిగ్గా చేశారా అంటే పూర్తిగా అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ లతో నిండిపోయి ఉంటుంది. చాలా సార్లు సౌత్ జనం చూసేసిన సీన్స్ తో నింపేసారు. Déjà vu ఫీల్ వస్తుంది సినిమా చూస్తున్నంతసేపూ. ఎందుకంటే తెలుగు,తమిళంలో వచ్చిన సీన్స్ ని తీసుకుని అల్లారు కథను. వీక్ స్క్రిప్టుని సల్మాన్ ఖాన్ మొయ్యలేడు. టాప్ టెక్నీషియన్స్ కూడా లేపలేరు.

టెక్నికల్ గా...

దర్శకుడుగా ఏ ఆర్ మురగదాస్ ..హిందీలో గజినీ, హాలిడే సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సికిందర్ తో ఆ గుడ్ విల్ మొత్తం గంగలో కలిసింది. మిగతా విభాగాలకు వస్తే... ఫొటో గ్రఫీ స్టన్నింగ్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ ఇలాంటి భారీ ప్రాజెక్టులకు తగినట్లే ఉనంది. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ చేయాల్సింది.

ఇక ఈ సినిమాకు స్క్రిప్ట్, మురగదాస్ లేజీ డైరెక్షన్ తర్వాత సల్మాన్ ఖాన్ ని బ్లేమ్ చేయాలి.ఎందుకంటే ఇన్ని ప్లాఫ్ ల తర్వాత కూడా సరైన స్క్రిప్ట్ ఎంచుకునేందుకు. అలాగే ఈ సినిమాలో నటన దారుణగా ఉంది. ట్రోలింగ్ మెటీరియల్ పనిగట్టుకుని ఇస్తున్నందుకు. ఈ సినిమా కన్నా బిగ్ బాస్ లో సల్మాన్ నటన బాగుందనే స్థాయిలో జనం మాట్లాడుకుంటున్నారని ఇంకా ఏమని చెప్పగలం.

రష్మిక విషయానికి వస్తే...ఆమె పాత్ర అర్దాంతరంగా ముగియటం బాగుందనిపిస్తుంది. లేకపోతే ఆ పాత్ర సల్మాన్ తో మరో తలనొప్పిగా మారేది. ఇక కాజల్ అగర్వాల్ చూడటానికి బాగుంది . అయితే చేయడానికి ఏమీ లేదు. సత్యరాజ్ ఉన్నంతసేపూ ఏదో తమిళ సినిమా చూస్తున్నట్లు అనిపించింది. మిగతా పాత్రలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

చూడచ్చా

స్టోరీ లైన్ గా బాగున్నట్లు అనిపించే ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కు సూట్ కాలేదనిపిస్తుంది. ఆయన అభిమానులకు కూడా చూడటానికి కష్టమనిపిస్తుంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అయితే ఓ సారి ట్రై చేయచ్చు.

Read More
Next Story