సల్మాన్ తప్పించుకున్నందుకే బాబా సిద్ధిఖీని చంపేశారు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ మర్డర్ వెనక కారణాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ మర్డర్ వెనక కారణాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. NDTV కథనం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మొదట సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించింది. ఏప్రిల్ 14న తన బాంద్రా నివాసంలో ఆయనను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అయితే అది వర్కవుట్ కాకపోవడంతో 10 రోజుల తర్వాత సల్మాన్ మిత్రుడు, 66 ఏళ్ల బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశారు.
‘‘డబ్బా కాలింగ్’’..
"డబ్బా కాలింగ్" అని పిలిచే కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ మాట్లాడుకునేవారు. ద్వితీయ ఫోన్ (డబ్బా) ద్వారా ప్రముఖులను బెదిరింపులకు గురిచేస్తారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కూడా ఈ డబ్బా కాలింగ్ ద్వారానే తన అనుచరులకు సూచనలిస్తారు.
సిద్ధిఖీ హత్య..
బాబా సిద్ధిఖీని హత్య చేసిన రోజున (అక్టోబర్ 12) ఘటనా స్థలంలో మెయిన్ షూటర్ శివ కుమార్ గౌతమ్ దాదాపు 20 నిమిషాల పాటు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లి హత్యకువాడిన పిస్టల్, తాను ధరించిన చొక్కాను ఒక బ్యాగ్‌లో పెట్టేసి ఘటనా స్థలానికి కొంత దూరంలో విసిరేశాడు. అనంతరం బట్టలు మార్చుకుని తిరిగి హత్య జరిగిన చోటికి వచ్చాడు. అనంతరం లీలావతి ఆసుపత్రిని వెళ్లి సిద్ధిఖీ చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. తర్వాత కుర్లా రైల్వే స్టేషన్‌కు వెళ్లి తన మొబైల్ ఎక్కడో పడేశాడు. ఆ మొబైల్ ఫోన్ కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.
ఈ హత్య కేసులో మరో అనుమానితుడు శుభమ్ లోంకర్. ఇతను జూలైలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలోని అడవుల్లో ఆయుధాల వాడకంలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మావోల దగ్గర AK-47 వాడకం గురించి శిక్షణ పొందినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అనుమానిస్తున్నారు.