షణ్ముఖ మూవీ రివ్యూ
x

'షణ్ముఖ' మూవీ రివ్యూ

ఈ సినిమాకు ఈ డివోషనల్ ట్రెండ్ ఏ మేరకు పనికి వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం

హిట్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్టులు ఎంచుకుంటున్నారు ఆది సాయి కుమార్. ఆ క్రమంలోనే ఈ సారి ఒక డివోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అది తమ సినిమాకు పనికొస్తుందని ఆలోచన కూడా ఉండవచ్చు. అయితే ఏ ట్రెండ్ అయినా దాన్ని సరిగ్గా పట్టుకున్నప్పుడు కలిసి వస్తుంది. ఈ సినిమాకు ఈ డివోషనల్ ట్రెండ్ ఏ మేరకు పనికి వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం

స్టోరీ లైన్

సినిమా ప్రారంభమే కొంతమంది అమ్మాయిలు మిస్టీరియస్ మిస్సవ్వటంతో మొదలవుతుంది. అలాగే ఆ అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ కూడా చిత్రమైన పరిస్దితుల్లో చంపబడుతూంటారు. సారా (అవికా గోర్)ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ..ఈ కేసు వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తూంటాడు. కొంత దూరం వెళ్లాక ఆమె ఇన్విస్టిగేషన్ లో కార్తీక్ వల్లభన్(ఆది సాయి కుమార్) జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. అమ్మాయిల కిడ్నాప్ ల వెనుక ఆరు తలలు ఉన్న ఓ వికృతమైన వ్యక్తి ఉన్నాడని రివీల్ అవుతుంది. అక్కడ నుంచి సారా, సాయి కలిసి ఆ చిక్కు ముడిని ఎలా విప్పారు. ఆ కిడ్నాప్ లు ఎలా ఆపారు, అసలు ఆ వికృత కారుడు ఎవరు,అతని వెనుక ఉన్న అసలైన క్రిమినల్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లైన్ గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆరు తలలు ఉన్న వ్యక్తి, అతని బ్యాక్‌స్టోరీ, క్రైమ్ యాంగిల్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ , కీలక టైమ్ లో ముడివిప్పటం బాగానే ఉన్నాయి. అయితే అవి మాత్రమే బాగున్నాయి. మిగతా కథనం అంతా బోర్ కొట్టించేసారు. సినిమా యొక్క అతిపెద్ద లోపం స్క్రీన్ ప్లే. దర్శకుడు షణ్ముగం కథను సంక్లిష్టత చేయటం కోసం ఎంచుకున్న సబ్‌ప్లాట్‌లు, చూసేవారిని తప్పుదారి పట్టించే సన్నివేశాలతో జోడించటం వర్కవుట్ కాలేదు. అవన్ని ఇంట్రెస్టింగ్ గా కథనాన్ని నడపటానికి బదులుగా, గందరగోళానికి గురిచేసాయి.

ఈ టెక్నిక్ కాగితంపై చమత్కారంగా అనిపించినప్పటికీ, దానిని తెరకెక్కించడంలో తేలిపోయింది. స్క్రీన్‌ప్లే ఇన్ని మెలికలు తిప్పి చెప్పి ఉండాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఇలాంటి కథలను సూచినా, సరళంగా చెప్తేనే బుర్రకు ఎక్కుతుంది. దురదృష్టవశాత్తు, అది జరగలేదు.ఆది సాయి కుమార్‌ ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగా ఎగ్జిక్యూటివ్ చేశారు. అయితే అదే విధంగా సినిమా మొత్తం చూసుకుంటే థ్రిల్ ఫ్యాక్టర్‌ వర్కవుట్ అయ్యేది.

టెక్నికల్ గా చూస్తే...

పైన చెప్పుకున్నట్లు నోవల్టీ కాన్సెప్ట్ అయినా దాన్ని స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకుని తెరపైకి తీసుకురావటంలో తడబడ్డారు దర్శకుడు. ఇంకాస్త డ్రామా ఈ కథకు అవసరం. విలన్ పై పెట్టిన దృష్టి మిగతా పాత్రలపై పెట్టలేదు. ఇక డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ లో ఉండాల్సింది. చాలా చోట్ల స్లో అయ్యినట్లు, డ్రాగ్ అయినట్టు అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంప్రెసివ్ గా లేదు. టెన్షన్ ని, ఎక్సైట్మెంట్ ని కావాల్సినంత గా తీసుకురాలేకపోయింది స్కోర్. సినిమాటోగ్రఫీ బాగుంది. మూడ్ ని ఫెరఫెక్ట్ గా పట్టుకుంది.

నటీనటుల్లో ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో ఫెరఫెక్ట్. ఇక అవిక గోర్ గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్‌ ని అందించింది. చిరాగ్ జానీ, ఆదిత్య ఓం, పండు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకే పరిమితమయ్యారు.

చూడచ్చా

థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఎంజాయ్ చేయచ్చు! అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తేనే సుమా.

Read More
Next Story