
'రాబిన్ హుడ్' రివ్యూ
మరి చిత్రంతో నితిన్ హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం.
నితిన్ కి హిట్ కావాలి. ఏ సినిమా చేసినా వచ్చినంత స్పీడుగా వెళ్ళిపోతోంది. దాంతో తనతో ఐదేళ్ల క్రితం భీష్మ(2020) తో హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములనే మరోసారి నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’(Robinhood Review) అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ :
అనాధాశ్రమంలో పెరిగిన రామ్ (నితిన్) అక్కడ పరిస్దితులు చూసి డబ్బు కోసం దొంగగా మారతాడు. ‘రాబిన్‌హుడ్’ పేరుతో డబ్బున్న వాళ్ల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసు ఆఫీసర్ విక్టర్(షైన్ చాం టాకో) రంగంలోకి దూకుతాడు. దాంతో ఇక దొంగతనాలకు స్వస్తి చెప్పి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review).
సరిగ్గా అప్పుడే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్త నాగే) మనుషులు బంధిస్తారు. ఆ తర్వాత ఆమెను రుద్ర కొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు?
సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? ఎవరీ నీరా వాసుదేవ్?(Robinhood Review Telugu) ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
బాగా నలిగిపోయిన పాత కథను తీసి విస్త్రీ చేసి, నాలుగు కామెడీ డైలాగులు, సీన్స్ కలిపి నడుపుదామనేది దర్శకుడు ఆలోచన. అయితే కామెడీ సీన్స్ పండితేనే కదా చూసేవారికి అర్థం,పరమార్థం దక్కేది. అదే ఈ సినిమాలో మిస్సైంది. ఫస్టాఫ్ లో మాత్రమే కామెడీ వర్కవుట్ అయ్యింది. నీరసమైన ఇంటర్వెల్ నుంచి మరింత నీరసంతో సెకండాఫ్ డ్రాప్ అవుతూ వెళ్ళిపోయింది. పాత కథనే స్టైలిష్ గా చూపిస్తే కొత్త సినిమా అయిపోదు కదా. అయితే ఉన్నంతలో మ్యానిపులేటర్‌గా మారిన హీరో... విలన్‌ని బ్రెయిన్ గేమ్ ఆడుకునే సన్నివేశాలు కాస్త ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి.ఈ సినిమాకు నేపధ్యంగా తీసుకున్న గంజాయి మాఫియా పెద్దగా సింక్ కాలేదనే చెప్పాలి.
అయితే సినిమాని చాలా వరకూ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ కాపాడింది. అయితే అది సరిపోలేదు. అదిదా సర్పైజ్ కిక్ ఇవ్వలేదు. ఆ సర్పైజ్ ని ట్రిమ్ చేయటంతో. శ్రీ లీలకు సరైన పాత్ర ఇవ్వలేదు. ఏదో అలా వచ్చి కాస్తంత గ్లామర్ ప్రదర్శన చేసేసింది. పోనీ నితిన్ కు ఇలాంటి పాత్రలు కొత్తా అంటే చాలా సినిమాల్లో చేసేసిందే. కొత్తగా చేయడానికి పెద్దగా లేదు. డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలు సినిమాకి ఎంతవరకూ ప్లస్ అయ్యిందనేది చూడాల్సి ఉంది. వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. కథలో డ్రామా పండి, ఎమోషన్స్ వర్కవుట్ అయితే మరో భీష్మ సినిమా అయ్యేది.
టెక్నికల్ గా
సినిమాకు జీవి ప్రకాశ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్సైంది. అయితే పాటలు వినడానికి బాగున్నాయి. చిత్రీకరణ ఆ స్థాయిలో లేవు. అలాగే ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో నితిన్ కామెడీ టైమింగ్ బాగుంది. శ్రీ లీల పాత్ర పరిమితం. గ్లామర్ గా కనిపించింది. విలన్ గా దేవదత్త పాత్ర మొదట్లో బాగున్నా రాను రాను పడిపోయింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగానే వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించారు.
చూడచ్చా
అక్కడక్కడా నవ్వించే ఈ సినిమా ప్రేక్షకులకు కొంతమేరకు కాలక్షేపాన్నిస్తుంది. మరీ ఎక్కువ అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.