సర్వైవల్ థ్రిల్లర్ : 'సొర్గవాసల్' OTT మూవీ రివ్యూ!
ఓటీటీలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ తో కూడిన కథా కథనాలు తమిళ,మళయాళ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తున్నాయి.
ఓటీటీలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ తో కూడిన కథా కథనాలు తమిళ,మళయాళ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తున్నాయి. థియేటర్ లో యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా ఓటీటీలో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. దాంతో ఓ మాదిరి స్టార్ కాస్ట్ , తెలుసున్న నటులు ఉంటే చాలు ఓటిటి లో ఇలాంటి సినిమాలకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించిన సొర్గవాసల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుని విడుదల చేసింది. ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
చెన్నైలోని పార్తీబన్ (ఆర్జే బాలాజీ) తోపుడు బండిపై టిఫిన్స్ అమ్ముకుని జీవితం గడుపుతుంటాడు. తన తల్లితో కలిసి ఉండే అతను తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న రేవతి తో ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తన వ్యాపారం పెంచి జీవితంలో సెటిలవ్వాలనుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాల ఫిక్స్ అవుతాడు. అతనికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ షణ్ముగం తో స్నేహం ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో ఆ అధికారి హత్య జరుగుతుంది. దీంతో హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు.అయితే ఊహంచని విధంగా ఓ హత్య కేసులో పార్ధీవన్ జైలుకి వెళ్తాడు.
ఇక అదే జైల్లో గ్యాంగ్ స్టర్ గా 'సిగా' (సెల్వ రాఘవన్) ఉంటాడు. అతను అంటే అక్కడి ఖైదీలతో పాటు పోలీసులకు కూడా భయం. 'సిగా' అనుచరులు టైగర్ మణి - శీలన్ . ఆ ఇద్దరినీ దాటి సిగాను కలవడం అంత తేలికైన విషయం కాదు. పార్తీబన్ వచ్చి వాళ్ళ మధ్యలో పడతాడు. సిగా గురించి అప్పుడే అతనికి తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరగా జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. అప్పుడే అతనికో ఆఫర్ వస్తుంది. 'సిగా'ను లేపేస్తే, విడుదల చేస్తానని పార్తీబన్ కి ఎస్పీ సునీల్ కుమార్ ఆశపెడతాడు. ఆ క్రమంలో పార్తీబన్ ఏం చేస్తాడు? షణ్ముగాన్ని ఎవరు చంపారు? జైలు నుంచి పార్తీబన్ బయటపడతాడా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది
నటుడుగా ఆర్జే బాలాజీ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన అతను ఇప్పుడు హీరోగా, డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో చేసాడు. తమిళనాట మంచి రివ్యూలు వచ్చాయి. బాగానే కలెక్షన్స్ రాబట్టింది. క్రైమ్ లో నిత్యం మునిగి తేలే ఒక గ్యాంగ్ స్టర్ .. నేరం చేయకుండా జైలుకు వచ్చిన ఒక యువకుడు .. ఖైదీలను తన ఎదుగుదలకు పావులుగా వాడుకునే ఒక రాజకీయ నాయకుడు వాళ్ల మధ్య జరుగుతుంది కథ. చేయని తప్పుకు జైలుకెళ్లిన కొడుకు కోసం తపించే ఒక తల్లితో ఎమోషన్ పండించారు. చాలా వరకు సీన్స్ ఇంటెన్స్ తో సాగుతాయి. కథను నిదానంగా మొదటి నుంచి మొదలెట్టకుండా ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఓపెన్ చేయడం వలన ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను మలచిన తీరు .. వాటిని నడిపించిన విధానం మెప్పిస్తుంది.
ఎవరెలా చేసారు
ఆర్జే బాలాజీ - సెల్వరాఘవన్ వీళ్లిద్దరి చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇద్దరూ పరిణితితో నిండిన నటనను కనపరిచారు. . స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ప్రిన్స్ ఫొటోగ్రఫీ, క్రిస్టో సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సెల్వ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్ చూసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే ఎక్కడా అసభ్యత అనేది లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసే చూడవచ్చు.
ఎక్కడ చూడవచ్చు
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది సినిమా