
‘రేఖాచిత్రం’ మూవీ రివ్యూ
కేరళలలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం మనవాళ్లకు బాగానే నచ్చుతుంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, కథలో మమ్ముట్టి పాత్రేంటో చూద్దాం.
మలయాళంలో మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కొత్తేమీ కాదు. ఓ చిన్న పాయింట్ తీసుకుని దానికి క్రైమ్ అద్ది చక్కటి స్క్రీన్ ప్లేతో వర్కవుట్ చేస్తూంటారు. ఇది కూడా అదే కోవలోకి చెందిన సినిమా. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే 1985లో నిజంగా మమ్ముట్టి చేసిన కాతోడు కాథోరమ్ సినిమా రిఫరెన్స్ తీసుకొని AIతో మమ్ముట్టిని తీసుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ లో అప్పటి వాతావరణం ని తీసుకురావడం గమనార్హం. నిజ జీవిత సంఘటనకు కొంత కల్పితం కలిపి రాసుకున్న కథ ఇది. కేరళలలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం మనవాళ్లకు బాగానే నచ్చుతుంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, కథలో మమ్ముట్టి పాత్రేంటో చూద్దాం.
స్టోరీ లైన్
సస్పెండ్ అయ్యి జాబ్ లో జాబ్ లో జాయిన్ అవుతాడు వివేక్(అసిఫ్ అలీ) . మారుమూల మలక్కపారా అనే ఓ విలేజ్ లో అతనికి పోస్టింగ్ ఇస్తారు. జాయిన్ అయిన రోజే ఆ ఊరి శివార్లలో రాజేంద్రన్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు ఫేస్ బుక్ లైవ్ లో.. తను, ఇంకో నలుగురు కలిసి 1985 లో ఓ అమ్మాయిని ఇక్కడే పూడ్చిపెట్టాం అని చెప్పి షాక్ షాక్ ఇస్తాడు. అంతేకాదు ఆ హత్యలో తనతో పాటు ఫ్రాన్సిస్, విన్సెంట్ ఉన్నారు అని చెప్తాడు కానీ మరొకరి పేరు చెప్పడు. దీంతో ఈ లైవ్ సంచలనంగా మారడంతో కేసు వివేక్ చేతికి వస్తుంది.
దీంతో ఆ చనిపోయిన వ్యక్తి చెప్పిన చోటే తవ్వితే ఓ అమ్మాయి అస్థిపంజరం బయటపడుతుంది. అక్కడ నుంచి ఇన్విస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. వివేక్ ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అస్థిపంజరం రేఖ అనే అమ్మాయిది అని, 1985 మమ్ముట్టి కాతోడు కాథోరమ్ షూటింగ్ నుంచి మిస్ అయిన జూనియర్ ఆర్టిస్ట్ అని కనిపెడతాడు. అయితే చంపింది ఎవరెవరు, ఎందుకు చంపారు అనేది క్లారిటీ రాదు.
అయితే ఈ ఇన్విస్టిగేషన్ జరుగుతుండగానే సాక్షాలు అనుకున్న వాళ్ళు, విచారణకు సహకరిస్తున్న వాళ్ళు చనిపోతున్నారు. అంతేకాదు రాజకీయ పలుకుబడి ఉపయోగించి వివేక్ ని ఈ కేసు నుంచి తప్పించడం చేస్తారు. ఈ క్రమంలో వివేక్ ఎలా ఈ కేసును సాల్వ్ చేసాడు? అసలు రేఖ ఎవరు? ఆమెని ఎవరు ఎందుకు చంపారు? మమ్ముట్టి షూటింగ్ నుంచి రేఖ ఎందుకు మిస్ అయింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమాలో కొత్తదనం ఏమిటి అంటే చంపిన వ్యక్తి( విలన్) ఎవరో ముందే చెప్పేస్తారు. కానీ అతనే ఆ చంపిన వ్యక్తి అని ప్రూవ్ చేయడం ఎలా, ఎందుకు చంపారు అనేది థ్రిల్లింగ్ గా ఇన్విస్టిగేషన్ డ్రామాగా రాసుకున్నారు. మరో ప్రక్క ప్లాష్ కట్స్ వాడుతూ, ప్లాష్ బ్యాక్ లు విప్పుతూ కథను ప్రస్తుతం విచారణ తో పాటు, ఫ్లాష్ బ్యాక్ లో రేఖ గురించి సమాంతరంగా చూపించారు.
ఇది చూసేవారికి మంచి స్క్రీన్ ప్లే తో కథ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఆ అస్తిపంజరం ఎవరిది,రేఖదేనా? అసలు రేఖ ఎవరు? అని ఎలా కనిపెడతారు, అదీ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం సాగే డ్రామా సస్పెన్స్ గా ఉంటుంది. కథలో ట్విస్ట్ లు బాగుంటాయి. సినిమా చివరి దాకా ఆ అమ్మాయిని ఎవరు? ఎందుకు చంపారు అనేది ముందే ఎవరూ ఊహించలేరు.అలాగే మమ్ముట్టి సినిమా షూటింగ్ ని మధ్యలో కథకు బ్యాక్ గ్రౌండ్ గా వాడి కొత్తగా అనిపించేలా చేసారు. ఇది రైటింగ్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా.
టెక్నికల్ గా
ఈ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ఆనాటి ఘటనలో కనిపించిన వ్యక్తుల మేకప్, డ్రెస్సింగ్ గుర్తుకు తెచ్చేలా ఈ పాత్రల కాస్ట్యూమ్ డిజైన్ చేయడం,మేకప్ చేయడం బాగుంది. వాస్తవ పరిస్థితులతో రిలేట్ అయ్యేలా చేసింది. నేపధ్య సంగీతం, కెమరాపనితనం డీసెంట్ వున్నాయి. ఎంగేజింగ్ గా ఎడిట్ చేశారు. కాకపోతే అన్ని మలయాళం సినిమాల్లాగే కాస్త స్లో నేరేషన్ ఉంటుంది.
పూర్తిగా కేరళ బ్యాక్ డ్రాప్ సినిమా ఉన్న సినిమా అయినా చూస్తున్నంతసేపు ఆ తేడా అనిపించదు. తెలుగు డబ్బింగ్ బాగానే చేసారు. కథలో ఆధారాలని మాయం చేయడానికి, బలమైన నిందితులని తప్పించడానికి సిస్టంలోని వ్యక్తులే సాయం చేశారనే విషయాన్ని మరింత స్ట్రాంగ్ గా చెప్పాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆర్టిస్ట్ లు అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్విస్టిగేషన్ డ్రామాలు చూడటం ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.క్రైమ్ అయినా రక్తపాతం, హింస లేవు ఫ్యామిలీలతో చూడచ్చు
ఎక్కడ చూడచ్చు
సోనీ లివ్ లో తెలుగులో ఉంది.