భారీ టార్గెట్: ‘గేమ్ ఛేంజర్’బ్రేక్ ఈవెన్ కి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?
x

భారీ టార్గెట్: ‘గేమ్ ఛేంజర్’బ్రేక్ ఈవెన్ కి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఉంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాకు బజ్ మెల్లిమెల్లిగా క్రియేట్ అవుతుంది.

ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఉంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాకు బజ్ మెల్లిమెల్లిగా క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి స్లో గానే ఉంది. అందులోనూ భారతీయుడు 2 డిజాస్టర్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ట్రైలర్ వచ్చాక ఈ చిత్రం బజ్ రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. మెగాభిమానులు అంతా ఈ సినిమా రిలీజ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ట్రేడ్ మాత్రం అనుమానంగా చూస్తోంది.ఓవర్ బడ్జెట్ అయ్యిందని చెప్పబడుతున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలనే లెక్కలు వేస్తున్నారు.

రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. ఈ మధ్యలో ఆయన ఎన్టీఆర్‌తో కలిసి 'ఆర్ఆర్‌ఆర్‌', చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలతో వచ్చారు. గేమ్ ఛేంజర్‌తో సోలో హీరోగా చాలా కాలం తర్వాత చరణ్ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయనడం లో సందేహం లేదు. దానికి తోడు ఈ సినిమాపై దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టారని వినికిడి. ఈ క్రమంలో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. బిజినెస్ కూడా గట్టిగా జరిగినట్లు తెలుస్తోంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ చిత్రం 300 కోట్లు థియేటర్ షేర్ కలెక్ట్ చేయాల్సిందని అంచనా. 200 కోట్లు దాకా తెలుగు వెర్షన్ కు వరల్డ్ వైడ్ గా షేర్ ఖచ్చితంగా వస్తుందంటున్నారు. ఈ సినిమా పై తమిళం లోనూ ఆసక్తి నెలకొంది. తమిళ సినిమా ప్రేక్షకులు స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల్ని ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చారు. దాంతో అక్కడ శంకర్ బ్రాండ్ పనిచేస్తుందంటున్నారు.

తమిళంలో 50 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంక 300 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వాలంటే నార్త్ ఇండియాలోనూ గట్టిగా ఆడాలి. అక్కడ గ్రాస్ 100 కోట్లు రావాలి. అంటే అక్కడ 50 కోట్ల షేర్ వస్తుంది. అప్పుడు తెలుగు, తమిళ, హిందీ కలిపి 300 కోట్లు వస్తాయి. అంతకు మించి వస్తే కనుక దిల్ రాజుకు లాభాలు పంట పండుతుంది. అంటే సలార్ వరల్డ్ వైడ్ గ్రాస్ 600 కోట్లు మొత్తం మీద రావాలి. అప్పుడే మూడు వందలు రికవరీ ఉంటుంది.

అయితే, ఇక్కడో మెలిక ఉంది. రామ్ చరణ్ కి తమిళ ప్రేక్షకుల్లో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అనేది సినిమాకు కీలకం. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి తెలుగు హీరోలు తమిళనాట మంచి మార్కెట్‌ను సంపాదించారు. ‘బాహుబలి’ (Baahubali) సిరీస్, ‘పుష్ప’ (Pushpa) వంటి సినిమాలతో వీరిద్దరూ తమిళ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ హిట్ ఇచ్చిన రామ్ చరణ్ కి తమిళ మార్కెట్ లో సోలోగా నిలదొక్కుకోవడం పెద్ద ఛాలెంజ్ గా మారింది.

అయితే శంకర్ సినిమా కావడంతో తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పట్ల ఆసక్తి చూపిస్తారనే నమ్మకంతో అందరూ ఉన్నారు. అయితే తమిళ ప్రేక్షకులు రీజనల్ ఫీలింగ్స్ ఎక్కువే. వాటిని అధిగమించి చరణ్ నటనను స్వాగతిస్తే, ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ ఈ సినిమాకి కథ అందించిన నేపథ్యంలో శంకర్‌ గత చిత్రాలతో ఈ సినిమాకి పోలిక లేదు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ ఎప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూఎస్‌ఏలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ ట్రైలర్‌ విడుదల చేయక పోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ ని డిసెంబర్ 30న విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించిందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంకర్ అండ్ టీమ్ ఇప్పటికే ట్రైలర్‌ ఫైనల్‌ కట్‌, మ్యూజిక్ మిక్సింగ్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా రాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ మెగా ఫ్యాన్స్‌కి భారీ గిప్ట్ గా నిలువబోతుంది.

ఇక ఈ చిత్రానికి పోటీ విషయానికి వస్తే... బాలయ్య డాకు మహారాజ్ సైతం సంక్రాంతికే వస్తుంది. అలాగే తమిళనాడు అజిత్ తో క్లాష్ అయ్యే రిస్క్ చరణ్ కు తప్పేలా లేదు. ఆయన విడాముయార్చి చిత్రాన్ని జనవరి 10కే ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు థియేటర్ల పరంగా చిక్కులు తప్పవంటున్నారు. అజిత్ క్రేజ్ తో తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు ఆయనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మరో ప్రక్క సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ కూడా ఈ సంక్రాంతి రేసులోనే ఉన్నారు.

Read More
Next Story