రజనీ ‘వేట్టైయాన్’: తెలుగులో బజ్ లేకపోవటానికి కారణం స్వయంకృతాపరాధమే?
x

రజనీ ‘వేట్టైయాన్’: తెలుగులో బజ్ లేకపోవటానికి కారణం స్వయంకృతాపరాధమే?

ఆల్రెడీ దసరా హాలిడేస్ సగంలోకి వచ్చేసాయి. దేవర చక్కగా దసరా హాలీడేస్ ని క్యాష్ చేసుకుంటోంది. ఇక దసరా హాలిడేస్ మొదలవ్వగానే ఇటీవలే శ్రీవిష్ణు స్వాగ్ సినిమాతో వచ్చాడు.

ఆల్రెడీ దసరా హాలిడేస్ సగంలోకి వచ్చేసాయి. దేవర చక్కగా దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకుంటోంది. ఇక దసరా హాలిడేస్ మొదలవ్వగానే ఇటీవలే శ్రీవిష్ణు స్వాగ్ సినిమాతో వచ్చాడు. అయితే మార్నింగ్ షోకే తేడా టాక్ రావటంతో ఈ సినిమా వర్కవుట్ కాదు అని తేలిపోయింది. ఈ క్రమంలో దసరా రోజున రిలీజ్ కు ఈ సారి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా చేసారు. దసరా 12వ తేదీ కావడంతో రెండు రోజుల ముందు నుంచే సినిమాల పండగ మొదలవుతుంది. వాటిల్లో ముఖ్యమైంది అక్టోబర్ 10న వస్తున్న రజినీకాంత్ ‘వేట్టైయాన్’.

పేరుకి డబ్బింగ్ సినిమా అయినా ఈ సినిమాకే ఉన్న సినిమాల్లో కాస్తంత ఎక్కువ క్రేజ్ ఉంది. తెలుగులో రజినీకాంత్ కి మంచి ఫాలోయింగే ఉంది, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాగానే వర్కౌట్ అవ్వొచ్చు తెలుగులో అని డిస్ట్రిబ్యూటర్స్ అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ‘వేట్టైయాన్’భాక్సాఫీస్ వేట ఏ మేరకు తెలుగులో కలిసి రానుంది. ఎందుకుని ‘వేట్టైయాన్’అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారో చూద్దాం.

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ లో తెలుగు వాళ్లను భాదిస్తున్న అంశం...

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్న మూవీ వేట్టయన్. టి.జె. జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌,రానా, మంజు వారియర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ పతాకం పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ’ క్రైమ్ క్యాన్సర్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు”, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండడం కంటే న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదు.’ అనే డైలాగ్స్ తో వచ్చిన ట్రైలర్ సైతం బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక ఎలిమెంట్ మాత్రం తెలుగువాళ్లను బాధిస్తోంది. అదే ఈ సినిమా టైటిల్.

గతంలో రజనీకాంత్ సినిమాలు అయినా మరో తమిళ స్టార్ హీరో సినిమా అయినా టైటిల్ ని తెలుగులోకి మార్చి ఇక్కడ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ పెట్టేవారు. అలాగే ఆ టైటిల్స్ లో తెలుగుదనం ఉండేలా చూసేవారు. అయితే ఇప్పుడు తమిళ టైటిల్స్ అలాగే ఉంచేస్తున్నారు. మాస్ లోకి వెళ్లే రజనీ సినిమాలకు కూడా ఇలాగే ఉంచేయటం అన్యాయమే మరి. ఇక్కడ మార్కెట్ తమిళ వాళ్లకు కావాలి కానీ ఇక్కడ మన తెలుగుదనం మాత్రం వాళ్లకు అక్కర్లేదు అంటున్నారు. పోనీ తెలుగుదనం ప్రక్కన పెట్టినా ఈ టైటిల్ బి,సి సెంటర్లను రీచ్ కావటం కష్టం. మల్టిప్లెక్స్ ల్లో జనం అంటే రజనీ సినిమా టైటిల్ అలాగే ఉంచేసారు అని అర్దం చేసుకుంటారు. కానీ క్రింద స్దాయిలో ఉండేవాళ్లు ఈ టైటిల్ ని చూసి కన్ఫూజ్ అవుతారనేది ట్రేడ్ లో చర్చ జరుగుతోంది.

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’కి బుక్కింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ఇక బుక్కింగ్ లలో ఆ ఎఫెక్ట్ కనపడుతోంది. తమిళనాడులో ‘వేట్టైయాన్’ బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం సగం బజ్ కూడా కనపడటం లేదు. రజనీకాంత్ గత చిత్రం జైలర్ కు తగిన స్దాయిలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ కనపడక పోవటం బుక్కింగ్స్ లేకపోవటం గమనించాల్సిన అంశం. అందుకు ట్రైలర్ ఎగ్జైటింగ్ గా కట్ చేయకపోవటం కూడా ఓ కారణం అంటున్నారు. మరో ప్రక్క తెలుగు టైటిల్ కాకపోవటం , ఇంగ్లీష్ టైటిల్ పెట్టినా జైలర్ లాగ ఎడ్జెస్ట్ అవుదుము కదా అంటున్నారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నా ఆ మార్కిటింగ్ లేదు. రానా ఇక్కడ ప్రమోషన్ చేయటం లేదు. పోనీ ఇక్కడ రజనీతో ప్రీ రిలీజ్ పంక్షన్ చేసే పరిస్దితి ఆయన హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా చేసేలా లేదు. ఏమీ లేకుండా డైరక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయితే పెద్దగా కలిసి వచ్చేదేముంది అనేది సగటు ఎగ్డిబిటర్ ప్రశ్న.

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ story line

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.... ఈ సినిమా కథ భారతదేశంలో జరిగిన భారీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వాలని మేనుప్యులేట్ చేసిన ఫ్రాడ్ చేసిన ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుందని టాక్ నడుస్తోంది. రానా ఓ పెద్ద ఎడ్యుకేషన్ యాప్ కంపెనీకి ఓనర్ గా కనిపిస్తాడని,అతను చేసే అక్రమాలకు రజనీ చెక్ పెడతాడని అంటున్నారు. అమితాబ్ క్యారక్టర్ ఇలాంటి ఎనకౌంటర్స్ కు వ్యతిరేకంగా వాదిస్తాడని తెలుస్తోంది. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దీనికి దర…

Read More
Next Story