ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్‌’ రివ్యూ
x

ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్‌’ రివ్యూ

గౌరవమా? లేక రిస్కీ ఎక్స్పెరిమెంటా?


పది ఏళ్ల క్రితం ఇండియన్‌ సినిమా పరిమితులను దాటేసి, ప్రపంచం ముందు తెలుగు సింహగర్జన చేసిన చిత్రం బాహుబలి. మొదట ‘ద బిగినింగ్’, ఆ తర్వాత ‘ద కన్క్లూజన్’ పేరుతో వచ్చిన ఈ సినిమాలతోనే ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి బిజీలో వాళ్లు పడ్డారు. అయితే ఇన్నేళ్ల తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆ రెండు పార్ట్‌లను ఒక్కటి చేసి, తనే కట్ చేసి, మళ్లీ థియేటర్లోకి తెచ్చారు “బాహుబలి: ది ఎపిక్” పేరుతో.

ఇంతకీ… పది ఏళ్ల క్రితం చూసిన సినిమా మళ్లీ ఎందుకు?

టీ‌వీ, ఓటిటి, యూట్యూబ్ రీల్స్‌ — ఏప్లాట్‌ఫార్మ్ అన్నా బాహుబలి సీన్స్ ముందే ఇన్నాళ్ల తర్వాత కూడా మన కళ్ల ముందు తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రీ-ఎడిట్ వెర్షన్‌కి నిజంగా ఇంపాక్ట్ ఉందా? అవును/కాదు అనేదాన్ని చెప్పేలోపు — ఈ కొత్త అనుభవంలోకి నేరుగా దూకుదాం.

బాహుబలి ఇంకా ‘బాహుబలి’గానే ఉందా?

అదే కథ, అదే పాత్రలు, అదే ఎమోషన్… కానీ కొత్త శ్వాస ని ఇవ్వటానికి రాజమౌళి ప్రయత్నించారన్నది నిజం. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రాజమౌళి ఈ మిథ్‌ను మళ్లీ మలిచాడు. అయితే మనం ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన కథని,సీన్స్ ని, పాటలని… మళ్లీ థియేటర్లో ఎందుకు చూడాలి? ఎందుకంటే, ఇది రీ-ఎడిట్ కాదు. ఇది రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ఓ ఎపిక్‌గా చేసే ప్రయోగం.

కథ అదే, కానీ కథనం మారింది — లెజెండ్ టోన్‌లో

బాహుబలి కథ తిరిగి చెప్పటం అంటే రామాయణం మళ్లీ వినిపించినట్టే. రెండు పార్ట్‌ల కలిపితే దాదాపు 5 గంటలు 30 నిమిషాలు. ఇప్పుడు రాజమౌళి తన ఎడిటర్‌తో కలిసి.

మూడు పాటలు కట్‌, కొన్ని రిపెటిటివ్ సీన్స్ డిలీట్‌, మొత్తం డ్యూరేషన్ = 225 నిమిషాలు (3 గంటలు 45 నిమిషాలు)

కానీ కంటెంటు కోర్? అదే ఫైర్. అదే ఎమోషన్. కొత్త సీన్స్ ఏమీ లేవు. కొత్త స్క్రీన్‌ప్లే కాదు. కేవలం రీ–ఎడిట్. కానీ రిథమ్ మాత్రం షార్ప్ అయింది.

అయితే రాజమౌళి ఇందులో కొన్ని సీన్స్ తాకలేదు. ఎందుకంటే వాటి మీద ఫ్యాన్స్‌కి ‘ఎటర్నల్ లవ్’ ఉంది: అవి

రాజదర్బార్‌లో శిరచ్ఛేదం

కట్టప్ప చేసిన విశ్వాస ఘాతకం

ప్రభాస్–అనుష్క బాణాల అద్భుతం

ఇంటర్వెల్ బాంగ్:

"కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" ఇప్పుడు రెండు ఏళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు —పది నిముషాల్లో ఆన్సర్ అనే ఇంటర్వెల్ పంచ్.

సెకండ్ హాఫ్:

వేగం పెరిగింది, ఎమోషన్, వార్, ప్యాలెస్ డ్రామా — చక్కగా మిక్స్, అనవసర లాగుడు లేదు

రీ–ఎడిట్ వెర్షన్‌ లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కథను సంక్షిప్తం చేసి, నేరేటివ్ స్పైన్‌ని మరింత పదునుగా చేయడం. అయితే, స్క్రీన్‌ప్లే పేసింగ్ దృష్టికోణంలో చూస్తే ఈ నూతన కట్ పూర్తి స్థాయిలో పనిచేసిందని చెప్పడం కష్టమే. ఫ్రాంచైజ్‌కు నిస్సందేహంగా ఉన్న అడిక్షన్ ఉన్న అభిమానులు ఈ బాహుబలి జర్నీ ని మళ్లీ ఆస్వాదించవచ్చు, కానీ న్యారేటివ్ సెన్సిబిలిటీతో చూసే ప్రేక్షకులకు ఇది తరచుగా ఓవర్‌లాంగ్ రీక్యాప్ లా అనిపిస్తుంది.

ఈ కొత్త కట్ ప్రధానంగా స్క్రీన్‌టైమ్ తగ్గించే ప్రయత్నం మాత్రమే చేస్తుంది; కాని న్యారేటివ్ రీడిజైన్ అనే లోతైన పనిని చేపట్టలేదు.

దీని వల్ల సంఘటనల వరుస వేగంగా కదిలినా, కథ భావోద్వేగ వర్క్‌లోడ్లో అంతర్లీన కర్వ్‌లు తెగిపోయాయనిపించింది. కొన్ని సన్నివేశాలు అప్పుడు థియేటర్లో అద్బుతంగా అనిపించాయి. ఇప్పుడు అవి న్యారేటివ్ హైస్‌గా కాక, న్యారేటివ్ మెమరీలుగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుని మైండ్‌లో ఉన్న మిథ్, స్క్రీన్‌పై వచ్చే ఇమేజ్‌ను మించి పోతున్న సందర్భాలు గమనించవచ్చు.

గ్రౌండ్‌బ్రేకింగ్‌గా నిలిచిన విజువల్ ఎఫెక్ట్స్‌ ఇప్పుడు టైమ్ టియర్ కు చిక్కుకున్నాయి. ఆ టైమ్ లో ఆశ్చర్యాన్ని ఇచ్చినవి ఇప్పుడు, విజువల్ గ్రావిటీ తగ్గి పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇది టోన్ మిస్‌మ్యాచ్. అయితే ప్రభాస్‌ పాత్రకు ఉన్న ఎపిక్ స్టేచర్ ఇప్పటికీ న్యారేటివ్‌ను మోసింది. అనుష్క పాత్రలోని శక్తి, రాజకీయ నిర్మాణం, భావోద్వేగాలు క్లాసికల్ ట్రాజెడీ రాయల్ ఆర్క్ లా పనిచేస్తాయి.

ఫైనల్ థాట్:

“బాహుబలి: ది ఎపిక్” రిలీజ్ అనేది ఒక సెలబ్రేటరీ రిథమ్. కానీ స్క్రీన్‌ప్లే అనుభవం దృష్టిలో — ఇది కథను తిరిగి పుట్టించడం కాదు, కథను ఆడిట్ చేసిన అనుభవం. నాస్టాల్జియా ఉన్నవారికి ఇది ఒక అద్బుత అనుభవం, కానీ నేటి సినిమా భాషతో పాటు నడిచే విమర్శక కళ్లకు ఇది కొన్నిసార్లు పాత పేజీ తిరగడంగా అనిపిస్తుంది.

Read More
Next Story