రాధా మాధవం (అమెజాన్ ప్రైమ్) చిత్రం రివ్యూ!
x

'రాధా మాధవం' (అమెజాన్ ప్రైమ్) చిత్రం రివ్యూ!

అంతా కొత్త వాళ్లతో సినిమా తీయటం కొత్త విషయం కాదు. సక్సెస్ సాధించినవి కూడా చాలా ఉన్నాయి.

అంతా కొత్త వాళ్లతో సినిమా తీయటం కొత్త విషయం కాదు. సక్సెస్ సాధించినవి కూడా చాలా ఉన్నాయి. అయితే ఫ్రెష్ ఫేస్ లతో కథ చెప్పేటప్పుడు అంతే ఫ్రెష్ గా కథ కూడా ఉండాలని కోరుకుంటారు. అయితే కథ పాచి పట్టిపోయినప్పుడే సమస్యలు మొదలవుతాయి. కొత్త వాళ్లతో తీసిన సినిమాలు చూడటం లేదని కంప్లైంట్స్ వినిపిస్తూంటాయి. ఒకప్పుడు కొత్తవాళ్లతో సినిమా అంటే రిలీజ్ చాలా కష్టం కానీ ఇప్పుడు ఓటిటి సంస్దలను ఒప్పిస్తే చాలు జనాలకు చేరువ అవుతుంది. ఆ క్రమంలో కొత్తవాళ్లతో రూపొందిన రాధామాధవం చిత్రం ఎలా ఉంది, చూడదగ్గ కంటెంట్ తో ఉన్నదేనా

కథేంటి

అనంతపురం జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు. ఆ ఊరు కుర్రాడు మాధవ్ ( వినాయక్ దేశాయ్),అదే ఊరు అమ్మాయి రాధ( అపర్ణాదేవి) అదే పనిగా ప్రేమించుకుంటూ ఉంటారు. అందులోనూ చిన్నప్పటినుంచి ఒకే స్కూల్ లో చదువుకున్న వాళ్లు కూడాను. దాంతో ఒకరినొకరు బాగా అర్దం చేసుకున్నారు. వాళ్లను ఊరి జనం కూడా అర్దం చేసుకున్నారు. అయితే ఏంటి వాళ్ల పెళ్లికి సమస్య అంటే ...మాధవ్ తక్కువ కులానికి చెందినవాడు. రాధేమో పెద్ద కులపు అమ్మాయి. అయితే మాధవ్ కు అసలు పెళ్లి మాటలు మాట్లాడటానికి కాని అడ్డు పడటానికి కానీ ఎవరు లేరు. అతను తల్లి,తండ్రులు చిన్నప్పుడే కాలం చేసారు.

ఇక రాధకు తల్లి లేదు కానీ తండ్రి ఉన్నాడు. అతని జీవితాశయం పొలిటికల్ గా ఎదగాలని. అందుకోసం రకరకాల స్కెచ్ లు వేస్తూంటాడు. తమ కులం వాళ్లకే ప్రయారిటీ ఇస్తూంటాడు. ఈ కులం పట్టింపులు ఏంటి ఈ రోజుల్లో అని రాధ కేమో మండిపోతూంటుంది. కానీ ఏం చేయగలదు. తండ్రి చాటు బిడ్డ. ఇక ఎలక్షన్ టైమ్ దగ్గర పడుతుంది. వీళ్ల ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి వీరభధ్రంకు తెలుస్తుంది.

అయితే వీరభద్రం కంగారుపడడు. రాజకీయంగా బుర్ర పెట్టి ఆలోచిస్తాడు. ఇప్పుడు మాధవ్ ని ఏమైనా చేస్తే అతని కులం ఓట్లు పోతాయి అని అర్దం చేసుకుని ఓ ప్రపోజల్ పెడతాడు. తనని గనుక ఎలక్షన్స్ గెలిపిస్తే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. పెళ్లి అయ్యాక మెల్లిగా అతన్ని హత్య చేయించి అడ్డు తప్పించి తనకు ఇష్టమైన కాళీతో పెళ్లి చేయాలని ఆలోచన.ఈ ప్లాన్ సక్సెస్ అయ్యిందా...వీరభద్రం గెలిచాడా...ఈ ప్లాన్ విషయం రాధా,మాధవ్ ఇద్దరికీ తెలిసిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఇది కొత్తగా అనిపిస్తుందేమో అని మొదలెడితే కాసేపటికి రొటీన్ గా వెళ్లిపోతుంది. అలాగే ఈ కథలో వచ్చే మలుపులు మనం ముందే ఊహించేయగలుగుతాం. దాంతో పెద్దగా ఇంట్రస్ట్ గా అనిపించదు. అసలే కొత్త మొహాలు..దానికి తోడు తెలిసున్న మేటర్. పెద్ద ఆసక్తిగా అనిపించదు. ఫస్టాఫ్ ని ఎలాగో లాగుతాం. సెకండాఫ్ లో ఏదన్నా విషయం ఉందేమో అని ఎదురుచూస్తాము. అక్కడేమీ కనపడక నిరాశపడతాము. క్యారక్టరైజేషన్స్ బలంగా లేకపోవటం,డ్రమటిక్ కాంప్లిక్ట్స్ సెట్ చేయలేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. ఇదే కంటెంట్ అనుభవం ఉన్న దర్శకుడు అద్బుతం తీయలేకపోయినా యావరేజ్ అయినా తీద్దుడేమో. మంచి ఫీల్ గుడ్ టైటిల్ ని పాడు చేసారనిపించింది. డైలాగ్స్ అలాగే ఉన్నాయి.

టెక్నికల్ గా నూ ఎందుకనో అంత జాగ్రత్తలు తీసుకోలేదు. కెమెరా నాశిరకంగా ఉంటుంది. లైటింగ్ సోసో. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సినిమాలో వచ్చే సీన్స్ కు కనెక్టవిటీ ఉండదు. ఎడిటింగ్ కూడా మొక్కుబడిగా చేసినట్లు ఉంటుంది. ఇలా ఏ డిపార్టమెంట్ కూడా మనస్పూర్తిగా చేసినట్లు లేరు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మరీ నాశిగా ఉన్నాయి.

చూడచ్చా

ఓటీటిలో చూసేందుకు అన్ని సినిమాలు అయ్యిపోయాయి అనుకున్నప్పుడు ఈ సినిమావైపు ఓ లుక్కేయచ్చు

ఏ ఓటీటిలో ఉంది

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

Read More
Next Story