‘పుష్ప 3’: లేటు అవుతుందా, ఆపేస్తారా? లేటెస్ట్ వార్త ఏంటంటే
అల్లు అర్జున్, సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్నారు. అన్ని చోట్ల నుంచి ప్రస్తుతం పుష్ప 2 సినిమా కి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ లు వస్తున్నాయి.
అల్లు అర్జున్, సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్నారు. అన్ని చోట్ల నుంచి ప్రస్తుతం పుష్ప 2 సినిమా కి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ లు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఈ వీకెండ్ ని పుష్ప 2 తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినిమా ప్రియులు. అదే సమయంలో పుష్ప 3 గురించి కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని సినిమా చివర్లో ప్రకటించారు మేకర్స్. ‘పుష్ప 3 ది రాంపేజ్’ పేరుతో సీక్వెల్ రాబోతుందని చెప్పారు.
పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో సైతం పుష్ప 3 కి సంబంధించిన హింట్ ఇచ్చారు మేకర్స్. దాంతో పుష్ప 3 ఎప్పుడు ప్రారంభం చేసి రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. పుష్ప వచ్చిన మూడేళ్ల తర్వాత పుష్ప 2 వచ్చింది. ఇక ఇప్పుడు 3 కూడా ఆ గ్యాప్ లోనే వస్తుందని మీడియా అంటోంది. ఇదిలా ఉంటే అసలు పుష్ప 3 ఉండదంటూ మరో ప్రచారం మొదలైంది. ఒకవేళ వచ్చినా పుష్ప 3 థియేటర్స్ కు వచ్చేసరికి పుష్ప 2 కి పట్టిన సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
మీడియా స్పెక్యులేషన్ ప్రకారం పుష్ప 3 రావడానికి మరో 6 సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కమిటైన సినిమాలు పూర్తి చేయాలి. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమా ఉందని తెలుస్తోంది. వీటి తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఓ సినిమా ఉందని వినిపిస్తుంది.
మరో ప్రక్క డైరెక్టర్ సుకుమార్ కూడా పూర్తి బిజీగా ఉన్నారు. ఆయన పూర్తి చేయాల్సిన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట. సుకుమార్ నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఉంది. దానికి తోడు పుష్ప కి కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత నిజంగా పుష్ప కు సీక్వెల్ తీయాలన్న ఆలోచన ఉంటుందా అని అంటున్నారు. కానీ పుష్ప లాంటి సినిమాకు సీక్వెల్ వదులుకోవటానికి ఏ నిర్మాణ సంస్థ ఇష్టపడదు. ఎందుకంటే బిజినెస్ ఈజీగా అయిపోయింది కాబట్టి.
ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం. ఈ సినిమా టీం ..బాలీవుడ్ స్టార్ సన్నిడియోల్ ని పుష్ప3 కు కొత్త విలన్ గా అనుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆల్రెడీ సన్నిడియోల్ తో జాట్ అనే సినిమా చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ మార్కెట్ కు మరింత ఉపయోగపడేలా సన్నిడయోల్ ని సీన్ లోకి తెద్దామనుకున్నారట. క్లైమాక్స్ లో సన్ని డయోల్ షాట్ చూపెడదామనుకున్నారట. అయితే ఆ ఆలోచనను ఆఖరి నిముషంలో వదులుకున్నారట. పార్ట్ 3 షూటింగ్ మొదలయ్యేసరికి ఎవరు క్రేజ్ లో ఉంటారో చూసుకుని అప్పుడు ప్లాన్ చేద్దామని ఆగిపోయారట. మరో ప్రక్క విజయ్ దేవరకొండ విలన్ గా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఒప్పుకుంటే, ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పుష్ప 3 తీస్తానని సుకుమార్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. దీంతో పుష్ప 3 ఎప్పుడు తీస్తారు అనేది బన్నీ చేతిలోనే ఉంది.
‘పుష్ప 2’ (Pushpa2 The Rule) డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో డ్రాప్స్ కనిపించాయి. అయినప్పటికీ ఓవర్సీస్, నార్త్ వంటి ఏరియాలో భారీ వసూళ్లు సాధించింది. ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.199.89 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.405.32 కోట్ల షేర్ రావాలి. ఈస్ట్,వెస్ట్ వంటి ఏరియాలో రెండో రోజు సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయ్యింది. శని,ఆది వారాల్లో జోరు పెంచితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.