పుష్ప 2:  టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్), బ్రేక్ ఈవెన్ ! !
x

పుష్ప 2: టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్), బ్రేక్ ఈవెన్ ! !

భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ డిసెంబర్ 5న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్ ఎంత రావచ్చు.

భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ డిసెంబర్ 5న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్ ఎంత రావచ్చు..మొదట రోజు ఓపినింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు , లెక్కలు, డిస్కషన్స్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై ఎక్సపెక్టేషన్స్ మొదలయ్యాయి. ఎంత పెట్టారు, ఎంతకీ అమ్మారు... టోటల్ గా ఎంత కలెక్ట్ చేయచ్చు అనే ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది మీడియా. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏరియా వైజ్ ఎంత బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే విషయాలు బయటకు వచ్చాయి.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు (ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌). దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది . అలాగే ‘పుష్ప2’ ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా నిలిచింది .

విదేశాల్లో దీని ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా యాభైవేల టికెట్స్ సేల్‌ అయిన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు నెలకొల్పింది . అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే...

తెలంగాణా - 100.00cr

రాయలసీమ - 30.00cr

నెల్లూరు - 07.20cr

గుంటూరు - 15.20cr

కృష్ణా - 12.40cr

వెస్ట్ గోదావరి - 10.80cr

ఈస్ట్ గోదావరి - 14.40cr

ఉత్తరాంధ్ర - 23.00cr

తెలుగు రాష్ట్రాల టోటల్ థియేటర్ ప్రీ రిలీజ్ బిజినెస్ - 213.00cr

తెలుగు రాష్ట్రాల టోటల్ థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ - 215.00cr

కర్ణాటక - 32.00cr

కేరళ - 20.00cr

తమిళనాడు - 52.00cr

హిందీ - రెస్టాఫ్ ఇండియా - 200.00cr

ఓవర్ సీస్ - 100.00cr

వరల్డ్ వైడ్ టోటల్ థియేటర్ ప్రీ రిలీజ్ బిజినెస్ - - 617.00cr

వరల్డ్ వైడ్ టోటల్ థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ - 620.00cr

ఈ లెక్కలు ఇప్పుడు అంతటా షాకింగ్ గా మారాయి. ఓ తెలుగు సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూసి బాలీవుడ్ షాక్ అవుతుంది.

ఇక అంతా నార్త్, తెలుగు రాష్ట్రాలే మాట్లాడుతున్నారు కానీ బన్నీ కు మంచి మార్కెట్ మళయాళం. అక్కడ అతనికి వీరాభిమానులు ఉన్నారు. అక్కడా పుష్ప2 భారీగా రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ సైతం కేరళ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2 సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18 గంటలు ఉన్నట్లు సమాచారం . రన్‌టైమ్‌ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ‘పుష్ప’ పార్ట్‌ 1 నిరూపించింది. ఆ మూవీ రన్‌టైమ్‌ దాదాపు 3 గంటలు. దీంతో, పార్ట్‌ 2 నిడివి పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిర్మాత నవీన్‌ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లెంగ్త్ ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు.

Read More
Next Story