
ప్రభాస్ 'కల్కి -2' లో హీరోయిన్ మార్పు...ఆమెనే ఫైనల్ చేసారా?
బిజినెస్, ఫ్యాన్స్ ఎమోషన్ డిసైడ్ చేస్తుందా?
ప్రభాస్ చేసిన “కల్కి 2898 AD” భాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్‌లోనూ కల్కి కలెక్షన్లు రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ రేంజి సకెస్స్ తర్వాత సీక్వెల్‌పై క్రేజ్ ఆకాశాన్నంటంతో వింతేముంది. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు కన్నా ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదురుచూస్తున్నారు.
కానీ ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె ఎగ్జిట్ హాట్ టాపిక్ అయింది. వైజయంతి మూవీస్ ప్రకటించిన ఈ వార్తతో సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. “గొంతెమ్మ కోరికలు తీర్చలేకే తప్పించారట”, “ప్రొడక్షన్ మీద నిబద్ధత లేదని పరోక్షంగా విమర్శించారట” అంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పరోక్షంగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం మరింత రచ్చ అయింది.
అదే సమయంలో దీపికా పదుకొనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు రావటంతో, ఆమె స్థానంలో ఎవరు వస్తారు అన్నది హాట్ టాపిక్ అయింది. ఈ లోపు సోషల్ మీడియాలో ఒక్క పేరు గట్టిగా ట్రెండ్ అవుతోంది – ఆమే అనుష్క శెట్టి.
ప్రభాస్–అనుష్క జంట అంటే తెలుగు సినిమా ఫ్యాన్స్‌కి ఒక ఎమోషన్. మిర్చి నుంచి బాహుబలి వరకు వాళ్ల కెమిస్ట్రీ మాయ చేసింది. ఆ మ్యాజిక్ మళ్లీ పెద్ద తెరపై చూడాలనేది అభిమానుల డ్రీమ్. వాళ్లిద్దరూ మళ్లీ కలిస్తే సీక్వెల్ బిజినెస్ రేంజ్ ఆకాశాన్ని అంటుందనడంలో సందేహం లేదు. సౌత్ మార్కెట్‌తో పాటు, హిందీ బెల్ట్‌లో కూడా ఈ జంటకు క్రేజ్ వేరే లెవెల్. ఇప్పుడు కల్కి సీక్వెల్ ఆ కల నిజం చేసుకునే అవకాశం ఇస్తుందా అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఓ మాట అంటారు. “Casting is 85% of directing. The rest is just adjusting to the choices you’ve made.” అని. అది ప్రతీ పెద్ద సినిమా విషయంలోనూ నిజం అవుతూ ఉంటుంది.
ప్రభాస్–అనుష్క కాంబో: బిజినెస్ లాభాలు
సౌత్ మార్కెట్: ప్రభాస్–అనుష్క అంటే తెలుగు, తమిళం, కేరళలో కల్ట్ ఫాలోయింగ్. మిర్చి, బాహుబలి సక్సెస్ మానసికంగా ఆడియెన్స్‌లో డీప్ కనెక్ట్ క్రియేట్ చేసింది.
హిందీ బెల్ట్: బాహుబలి తర్వాత నార్త్ ఆడియెన్స్‌కి ఈ జంట ఒక ఐకానిక్ ఇమేజ్. మళ్లీ స్క్రీన్‌పై వస్తే మార్కెటింగ్‌లో అదనపు మైలేజ్.
ఓవర్సీస్: USA, UAE, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో ఈ కాంబోకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాస్టాల్జియా వర్కౌట్ అవుతుంది.
అంటే, బిజినెస్ వైపు చూస్తే అనుష్కను కాస్ట్ చేస్తే సేఫ్ బెట్టింగ్.
కానీ రిస్క్ కూడా ఉంది
అనుష్క క్రేజ్ గత కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది.
రీసెంట్ గా ఘాటీ డిజాస్టర్ ఆమెలోని స్టార్ పవర్‌కి బలహీనత చూపించింది. మినిమం ఓపినింగ్స్ రప్పించలేకపోయింది.
ఫిజికల్ అపియరెన్స్ మార్పులపై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.
అయినా, “ప్రభాస్–అనుష్క డ్రీమ్ పెయిర్” అన్న భావన మాత్రం అభిమానుల్లో బలంగా ఉంది. అదే కారణంగా మేకర్స్ రిస్క్ తీసుకుని అనుష్కను ఫైనల్ చేసినా షాక్ కాదు.సర్ప్రైజ్ అసలేకాదు.
దీపికా వివాదం – బిజినెస్ యాంగిల్
దీపికా ఎగ్జిట్‌తో మేకర్స్‌కి రెండు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి: బాలీవుడ్ కనెక్ట్ తగ్గింది – హిందీ మార్కెట్‌లో దీపికా బ్రాండ్ స్ట్రాంగ్. ఆమె లేకపోతే బిజినెస్ సపోర్ట్ కొంత తగ్గే అవకాశం ఉంది.
పాజిటివ్ పబ్లిసిటీ కూడా వచ్చింది – ఇప్పుడు కొత్త హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేసి మరింత హైప్ ఇస్తోంది.
ఇండస్ట్రీలో టాక్
డిస్ట్రిబ్యూటర్లు: “అనుష్క వస్తే సౌత్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పక్కా” అంటున్నారు.
బాలీవుడ్ ట్రేడ్: “హిందీ మార్కెట్‌లో మరో A-లిస్ట్ హీరోయిన్ కూడా రోప్ చేస్తే బిజినెస్ సేఫ్ అవుతుంది” అనేది వారి అభిప్రాయం.
దీపికా కౌంటర్
ఇదిలా ఉంటే ఈ మధ్య దీపికా ఈ వివాద విషయంలో తన స్టైల్లో పరోక్ష కౌంటర్ ఇచ్చేయటం కూడా అనుష్క వైపుకు ఫ్యాన్స్ మ్రొగ్గు చూపటానికి కారణమైంది. షారుఖ్ ఖాన్తో “కింగ్” సినిమా ప్రకటిస్తూ, “సినిమా అనుభవం, మనతో చేసే వారే ముఖ్యం” అని క్యాప్షన్ వేశారు. ఇది నెటిజన్లకు క్లియర్ మెసేజ్: “కల్కి వివాదం? నాకు లాస్ ఏమీ లేదు. నేను ఇంకా టాప్ లెవెల్‌లోనే ఉన్నాను” అన్నట్టే. అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా, షారుఖ్‌తో “కింగ్” – దీపిక తన కెరీర్ రూట్ ఇంకా ఫుల్ కంట్రోల్‌లో ఉందని ప్రూవ్ చేసినట్లు అయ్యింది. దాంతో అనుష్క ఈ సినిమాలోకి రావటం సేఫ్ అనే నిర్ణయానికి ఫ్యాన్స్ వచ్చేస్తోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే “అనుష్కను తీసుకోండి” అంటూ ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. వైజయంతి మూవీస్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్‌కి గ్రీన్ సిగ్నల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ భారీ బడ్జెట్ సీక్వెల్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. ప్రభాస్ వచ్చే ఏడాది సెట్స్‌లో జాయిన్ కానున్నారు.
ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా (గాఢ్ ఫాధర్ ) ఇలా అంటారు. “A film is a collective effort of many hearts and minds. Casting decides whose heart the audience beats with.”
ఫైనల్ గా... “కల్కి 2898 AD” సీక్వెల్ క్యాస్టింగ్ గేమ్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. హీరోయిన్ ఎవరన్నది కేవలం కథ పరంగా కాదు—బిజినెస్, మార్కెట్, అభిమానుల ఎమోషన్—ఆల్ ఇన్ వన్ డీల్. నాస్టాల్జియా కార్డు ఆడతారా? లేక కొత్త స్టార్ పవర్‌తో హైప్ క్రియేట్ చేస్తారా? ఈ సస్పెన్స్‌నే సినిమా మీద క్రేజ్‌ని రెట్టింపు చేస్తోంది.
మరి మళ్లీ ప్రభాస్–అనుష్క మ్యాజిక్ స్క్రీన్‌పై మెరుస్తుందా? లేక మరొక స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా? చూద్దాం.