
సాంగ్ కాదు… పూజ హెగ్డే కెరీర్ కి సీరియస్ వార్నింగ్?
“ప్రాజెక్ట్‌కు లాభం కాకుండా నష్టం చేస్తుంది” అనే నెగటివ్ ట్యాగ్ నుంచి బయటపడటం కష్టమే
సౌత్ ఇండియన్ సినిమాల్లో పూజా హెగ్డే స్థానం ఎప్పుడూ చర్చనీయాంశమే. పూజ గ్లామర్, స్టార్ ఇమేజ్, బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఆమె ప్రెజెన్స్ ఒకప్పుడు ప్రాజెక్ట్‌కి అదనపు విలువ తెచ్చేది. తెలుగు ఇండస్ట్రీలో “అల్లు అర్జున్”, “మహేష్ బాబు”, “ప్రభాస్” వంటి టాప్ హీరోల సరసన నటిస్తూ పూజా ఒక ‘లక్కీ చార్మ్’గా పేరు తెచ్చుకుంది. కానీ గత కొన్నేళ్లుగా ఆమె కెరీర్‌కి ఉన్న రిథమ్ కాస్త డిస్టర్బ్ అయింది.
తెలుగులోనూ వరుసగా ఫ్లాప్‌లు రావడం వల్ల, హిందీలోకి అడుగు పెట్టింది.అక్కడా సరైన సక్సెస్ రాకపోవడం జరిగింది. అలాగే తమిళంలో రెట్రో వంటి సినిమాలు చేసినా కలిసిరాలేదు. దాంతో ఆమె ప్రెజెన్స్ ప్రాజెక్టులకు ఎంత ఉపయోగం అనేది ప్రశ్నార్థకం అవుతోంది.
ఇక తాజాగా వచ్చిన రజనీకాంత్ సినిమా “Coolie” ఈ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. సినిమా బాక్సాఫీస్‌లో ఘన విజయాన్ని అందుకుంటూ, అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న తమిళ చిత్రంగా రికార్డుల వైపు దూసుకుపోతున్నా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో మాత్రం ఇది “Leo” తర్వాత మరో ‘వీక్ అవుటింగ్’గానే మిగిలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. అయినా కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దర్శకుడుగా ఆయనకు డ్యామేజ్ జరగనట్లే.
ఇక ఈ సినిమాలో ముందే హైప్ సృష్టించిన అంశం పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ “Monica” . రిలీజ్‌కి ముందు ఈ ఐటమ్ నంబర్ సినిమాకి అదనపు బజ్ తెచ్చింది. కానీ థియేటర్‌లో చూసినప్పుడు ఆ పాట సరిగ్గా ప్లేస్ చేయకపోవడం, ఎనర్జీ, ఇంపాక్ట్ లేకపోవడం వల్ల షాక్ ఇచ్చింది. అలా పూజా ఎంట్రీని మాస్ ఆడియన్స్ ఆశించినంతగా ఎంజాయ్ చేయలేకపోయారు.
ఫలితంగా సినిమా విజయం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో పూజా హెగ్డేపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. “ఆమె ఉండటం వల్ల సినిమాకి మైనస్ అవుతుంది” అనే కామెంట్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఆమెకు పెద్దగా మార్కెట్ లేకపోవడంతో, భవిష్యత్తులో ఆమెను ఐటమ్ సాంగ్స్‌కి తీసుకుంటారా అన్న అనుమానం మొదలైంది.
ఇదేమీ పూజకు కొత్త విషయం కాదు. పూజా ఇంతకు ముందు తెలుగులో కూడా రెండు ఐటమ్ నంబర్స్ చేసింది – ఒకటి “రంగస్దలం” లో జిగేల్ రాణి సాంగ్, మరొకటి “F3” లో లైఫ్ అంటే ఇట్టా ఉండాలా సాంగ్ చేసింది. అవి బజ్ సృష్టించినా, ఆ పైన పెద్దగా ఇంపాక్ట్ మిగలలేదు. ఆ ఊపులోనే “Coolie” మోనికా అంటూ కుమ్మేసింది. అయితే రిలీజ్ తర్వాత వచ్చిన రియాక్షన్ చూసి, ఇకపై ఆమెను ఐటమ్ నంబర్స్‌కి పరిగణించే అవకాశాలు మరింత తగ్గేలా కనిపిస్తున్నాయి.
ఏదైమైనా పూజా హెగ్డేకి ఇప్పుడు కెరీర్ పరంగా ఛాలెంజ్ చాలా క్లియర్ గా ఉంది – కేవలం గ్లామర్ సాంగ్స్, స్పెషల్ అప్పియరెన్స్‌ల మీద ఆధారపడితే కెరీర్‌లో ‘రెస్పెక్ట్’ పెరగదు. లీడ్ రోల్స్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించే సినిమాలు ఆమెకి తిరిగి బ్రాండ్ విలువ తీసుకొస్తాయి. లేదంటే, ఇండస్ట్రీలో “ప్రాజెక్ట్‌కు లాభం కాకుండా నష్టం చేస్తుంది” అనే నెగటివ్ ట్యాగ్ నుంచి బయటపడటం కష్టమే.
ఒకప్పటి రోజుల్లో ఐటెంసాంగ్స్ చేయడానికి సపరేట్ గా నటీమణులు ఉండేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెంసాంగ్స్ కు సై అంటున్నారు. సమంత, తమన్నా, కాజల్, శ్రీలీల, అనుష్క.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ అందరూ కూడా ఏదో ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెంభామలుగా చిందేసిన వాళ్ళే. ఇక పూజా పాప కూడా తక్కువేం కాదు. ఇప్పటికీ వచ్చి అమ్మడు మూడు ఐటెంసాంగ్స్చేసింది. విశేషం ఏంటంటే ఆ మూడు సాంగ్స్ హిట్టే. కానీ ఆమె హిట్టవటం లేదు. అదీ విషయం.