మొదట సల్మాన్ ఖాన్ కోసమే ప్రణాళిక వేసుకున్నాము కానీ : బిష్ణోయ్ గ్యాంగ్
సల్మాన్ ఖాన్ చంపడానికి మొదట ప్రణాళికలు వేశాము కానీ అది విఫలం అయిందని చివరకు ఆయన సన్నిహితుడు అయినా..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మొట్టమొదట బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రణాళిక వేసిందని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం, సల్మాన్ ప్రయివేట్ సెక్యూరిటీ కారణంగా అది వీలు కాలేదని, కానీ సినీ ఇండస్ట్రీ పెద్దలతో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉంటున్న బాబా సిద్ధిఖీని అంతమొందించామని నిందితులు చెప్పారు.
చాలా కాలం పాటు సల్మాన్ ను వెంబడించామని అయితే సెక్యూరిటీలో ఎటువంటి లోపం కనిపించలేదని పోలీసుల ముందు నిందితులు వెల్లడించారు. చివరకు అక్టోబర్ 12 న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సల్మాన్ సన్నిహితుడు అయిన బాబా సిద్ధిఖీను బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది.
సల్మాన్ ను కాపాడింది ఏంటంటే..
పోలీసుల స్టేట్ మెంట్ ప్రకారం.. సల్మాన్ కు బ్లాక్ కమెండోల సెక్యురిటీ కారణంగా అతన్ని చంపడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని విచారణ అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా వివరించింది. హత్యలో పాల్గొన్న ముగ్గురు దుండగులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠాతో సంబంధాలు ఉన్నాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్, రాజస్థాన్‌లో బిష్ణోయ్ సమాజానికి పవిత్రమైన జంతువు అయిన కృష్ణజింకను వేటాడి చంపినట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇతర బెదిరింపులు
ఏప్రిల్ 14న సల్మాన్ బాంద్రా నివాసం వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు ముష్కరులు అర్థరాత్రి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది. వీరిది గుజరాత్ అని తేలింది. నవంబర్‌లో, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అని చెప్పుకునే వ్యక్తి సల్మాన్ ఖాన్‌ను కృష్ణజింకను చంపినందుకు క్షమాపణ చెప్పాలని లేదా ₹5 కోట్లు చెల్లించమని బెదిరించాడు. అక్టోబర్‌లో కూడా, జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల అమ్మే వ్యక్తి కూడా నటుడి నుంచి ₹5 కోట్లు డిమాండ్ చేసినందుకు అరెస్టు చేశారు.
Next Story