ప్రభాస్ నే నమ్ముకున్న ఫ్యాక్టరీ, రాజాసాబ్ ఏం చేస్తారో
x

ప్రభాస్ నే నమ్ముకున్న ఫ్యాక్టరీ, రాజాసాబ్ ఏం చేస్తారో

రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయ్యిపోదులేరా అనే పాట నిజం కావాలని ఇప్పుడు పీపుల్స్ మీడియా కోరుకుంటోంది. ఎందుకంటే


రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయ్యిపోదులేరా అనే పాట నిజం కావాలని ఇప్పుడు పీపుల్స్ మీడియా కోరుకుంటోంది. ఎందుకంటే

అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సినిమాలు అంటే100 సినిమాలు చేయాలనే టార్గెట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అలాగే సినిమా పక్రియలో అన్ని క్రాప్ట్ లలో కార్పోరేట్ రూల్స్ ని అప్లే చేస్తూ దెబ్బలు తింటూ, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్, రవితేజ ,వెంకటేష్ వంటి స్టార్స్ తో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది. అయితే అనుకున్న స్దాయిలో ఆ సినిమాలు వర్కవుట్ కావటం లేదు. సక్సెస్ లు కన్నా ప్లాఫ్ ల పర్శంటేజే ఎక్కువ అయ్యింది. వాటికి చెక్ చెప్పాలంటే రాజాసాబ్ ప్రభాస్ కి మాత్రమే సాధ్యమని భావిస్తోంది.

వాస్తవానికి తెలుగులో ఒకప్పటి బ్యానర్స్ ఏమీ దూకుడుగా సినిమాలు తియ్యటం లేదు. అటు మైత్రీ, సితార, ఇటు పీపుల్స్ మీడియా బ్యానర్స్ సినిమాలను వరసపెట్టి చేస్తున్నాయి. అయితే ఎన్ని సినిమాలు చేసామన్నది బ్యానర్ కు ఒక గుర్తింపు మాత్రమే. ఎంత పెద్ద బ్యాన‌ర్‌కైనా స‌రే ముఖ్య‌మైన‌ది మాత్రం స‌క్సెస్ అనేది కాదనలేని నిజం. త‌మ బ్యాన‌ర్ నుంచి ఎన్ని సినిమాలొచ్చాయ‌నే దానికంటే ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయ‌నేది ముఖ్యం. ఈ విష‌యంలో పీపుల్ మీడియా సంస్థ బాగా వెనుక‌బ‌డిపోయిందనే చెప్పాలి.

రవితేజతో ధ‌మాకా త‌ర్వాత ఈ బ్యాన‌ర్ లో స‌రైన హిట్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌డ‌లేదు. బ్రో, ఈగ‌ల్, మ‌న‌మే, రామ‌బాణం, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఇలా వచ్చిన ప్ర‌తీ సినిమా వచ్చినట్లు బోల్తా కొడుతూనే ఉంది. దీంతో ఆ సంస్థ‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రీసెంట్ గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో ఈ బ్యానర్ నుంచి వచ్చిన రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వటంతో అది బాగా రిజస్టర్ అయ్యింది. ఈ సినిమాతో భారీగా న‌ష్ట‌పోయింది పీపుల్ మీడియా. పీపుల్ మీడియా స‌క్సెస్ రేటు 40 శాతం కూడా లేదు.

దాంతో ఇప్పుడు ఎలాగైనా మంచి సక్సెస్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ బ్యానర్ అనిపించుకోవాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అందుకు ప్రభాస్ ఇప్పుడు ఆశాకిరణంలా కనపడుతున్నారు.

అవును నిజమే..ఇప్పుడు ఈ సంస్ద నుంచి వస్తున్న భారీ చిత్రం, చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందీ అంటే అది ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ది రాజ్ సాబ్ మాత్రమే. ప్ర‌భాస్ మీడియం సినిమాలు చేసుకునే దర్శకుడు మారుతికు డేట్స్ ఇచ్చారు. ప్రబాస్, మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాజా సాబ్‌’. దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ఇక ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. పీపుల్ మీడియా చేతుల్లో ఉన్న భారీ ప్రాజెక్ట్ ఇదేనని ఖచ్చితంగా చెప్పచ్చు.

కాబట్టి ఈ సంస్థ‌ భవిష్యత్తుని ఈ సినిమా తేలుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ మంచి ఫామ్ లో ఉన్నాడు. హిట్ టాక్ తెచ్చుకుంటే వెయ్యి కోట్లు భాక్సాఫీస్ దగ్గర ఈజిగా వచ్చేస్తున్నాయి. ఓ మాదిరి టాక్ వ‌చ్చినా రూ.500 కోట్లు వచ్చేస్తాయి. మరీ డిజాస్టర్ అయితేనే కష్టం. అదే… పీపుల్ మీడియా నమ్మకం. హిట్ కొట్టామన్న ఆనందం ప్రభాస్ ఇస్తాడని నమ్మతుతున్నారు. తమ వరస ప్లాఫ్ లకు ‘రాజాసాబ్‌’ సినిమా సమాధానం చెప్పగల సత్తా ఉందని భావిస్తోంది నిర్మాణ సంస్ద. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పీపుల్ మీడియా ఈ సినిమాపై ప్ర‌త్యేక‌మైన దృష్టి నిలిపింది. తగ్గేదేలే అన్నట్లు ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. క్వాలిటీలో కింగ్ అన్నట్లుండాలి. సినిమా దుమ్ము రేపాలి అని డిసైడ్ అయ్యారట.

ఇదిలా ఉంటే న‌వంబ‌రులో పీపుల్ మీడియా సంస్థ నుంచి ‘స్వాగ్‌’, ‘విశ్వం’ చిత్రాలు విడుద‌ల అవుతున్నాయి. శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న ‘స్వాగ్’ చిన్న సినిమా. హిట్ట‌యినా చెప్పుకోదగ్గ లాభాలు ఉండాలి. గోపీచంద్ – శ్రీ‌నువైట్ల ‘విశ్వం’పై ఎవ‌రికీ పెద్ద‌గా ఎక్సపెక్ఠేషన్స్ లేవు.కాబట్టి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ని ప్రస్తుతానికి లేపి నిలబెట్టే భాధ్యత, బరువు ప్ర‌భాస్ మీదే ఉంది.

Read More
Next Story