నాగబాబు, నివేదా పేతురాజ్ ‘పరువు’ వెబ్‌సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu) ఓటీటీ ‘జీ 5’ (Zee 5 ) రిలీజైంది. ఈ సీరిస్ చూడదగ్గదేనా? స్టోరీ ఏంటి? ఎలా ఉంది అనేది చూద్దాం.
తెలుగులో డైరక్ట్ గా మన తెలుగు ఆర్టిస్ట్ లతో రూపొందే వెబ్ సీరిస్ లు మనకు బాగా తక్కువ. ఎక్కువ డబ్బింగ్ వెబ్ సీరిస్ లు చూడటానికి అలవాటు పడ్డాం. తాజాగా నాగబాబు, నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu) ఓటీటీ ‘జీ 5’ (Zee 5 ) రిలీజైంది. ఈ సీరిస్ ఎలా ఉంది, చూడదగ్గదేనా. స్టోరీ ఏంటి? ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ ఏమిటంటే...
క్రైమ్ చుట్టూ నడిచే కథ ఇది. పల్లవి అలియాస్ డాలీ (నివేదా పేతురాజ్).. సుధీర్ (నరేశ్ అగస్త్య) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ పెళ్లి పల్లవి ఫ్యామిలీలో ఎవరికి నచ్చదు. వారందిరకీ దూరంగా ఈ ప్రేమ జంట జీవిస్తూంటుంది. అయితే పల్లవికు తన పెదనాన్న చనిపోయాడన్న వార్త తెలిస్తుంది. దాంతో హడావిడిగా హైదరాబాద్ నుంచి గుంటూరు దగ్గర ఉన్న తమ గ్రామానికి భర్తను తీసుకుని బయిలు దేరుతుంది. ఈ జర్నిలో తప్పనిసరిపరిస్దితుల్లో పల్లవి బావ చందు (సునీల్ కొమ్మిశెట్టి) కారు ఎక్కుతారు.
కారులో ఆ రాత్రివేళలో దారిపొడవునా గతాన్ని గురించి చందూ ప్రస్తావించడం .. తాగుతూ ఉండటం పల్లవికి నచ్చదు. కానీ వేరే దారి లేదు. అంతేకాకుండా మధ్య దారిలో చందూ ఒక వ్యక్తి నుంచి 'గన్' తీసుకోవడం పల్లవి - సుధీర్ గమనిస్తారు. తమని చంపడం కోసమే అతను 'గన్' తీసుకున్నాడని వాళ్లు భావిస్తారు.
ఇక చందు... వీళ్లిద్దరిపై కామెంట్స్ చేస్తూ సుధీర్ ని అవమానకరంగా మాట్లాడతాడు. తన భర్తను అవమానించడాన్ని సహించలేని పల్లవి చందుతో గొడవ మొదలవుతుంది. ఈ క్రమంలో ఈ గొడవ పెరిగి పెద్దదై ఆ ఆవేశంలో సుధీర్.. చందుని రాడ్డుతో కొట్టడంతో చనిపోతాడు. ఇక్కడ కథ క్రైమ్ వైపు టర్న్ తీసుకుంటుంది.
అనుకోకండా హత్య జరగటంతో ఆ జంట ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో పడతుంది. దాంతో ఆ శవం ఎవరికి కంటపడకుండా ఉండాలని దాచే ప్రయత్నం చేస్తారు. ఇదిలా ఉంటే చందు ఆల్రెడీ పెళ్లి నిశ్చయమై ఉంటుంది. దాంతో ఆ పెళ్లి కూతురు స్వాతి (ప్రణీత పట్నాయక్) అతడు ఫోన్ లిప్ట్ చేయటం లేదని, కనిపించడం లేదంటూ తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తూంటుంది.
అంతేకాకుండా ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) తనకు కాబోయేవాడిని కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపిస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి వెంటనే రంగంలోకి దిగిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో చందూ డెడ్ బాడీని పల్లవి - సుధీర్ ఏం చేసారు. రామయ్యకు చందుకు ఉన్న సంబంధమేంటి? చందు అసలు తుపాకీ ఎవరిని చంపాలని తీసుకున్నాడు? పెదనాన్న చివరి చూపు కోసం వచ్చిన పల్లవికి ఎలాంటి పరిస్దితులు ఎదురయ్యాయి? తదితర ప్రశ్నలన్నింటికీ సిరీస్ చూసి సమాధానం తెలుసుకోవాల్సిందే .
ఎలా ఉంది?
పరువు అనే టైటిల్ చూడగానే ఇది పరువు హత్యలకు సంబంధించిన కథ అని అర్దమవుతుంది. ప్రోమోలు కూడా అందుకు తగ్గట్లే కట్ చేసారు. అయితే సీరిస్ లో శవాన్ని ఎలా దాచారు అనేదే కీలకమై ప్రధాన ఎలిమెంట్ గా మారింది. అసలైన పరువు హత్య అనేది సబ్ ప్లాట్ అయ్యింది. అలాగే సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నట్లు గతం, వర్తమానం సీన్స్ కలిపి మిక్సెడ్ గా రాసుకున్నారు. అది కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. వెబ్ సీరిస్ కు ఇలాంటి స్క్రీన్ ప్లే రాసుకోవటం చూసేవారికి కన్ఫ్యూజన్ కి గురి చేసినట్లు అవుతుంది.
మొదట చాలా స్లోగా నడిచిన ఈ సీరిస్... చందు హత్య తర్వాత కథలో స్పీడు అందుకుంటుంది. అప్పటిదాకా పెద్దగా ఏమీ అనిపించదు. శవం ఎలా మాయం చేస్తారనేది ఎన్ని సార్లు చూసినా ఇంట్రస్టింగే కాబట్టి ఆ సీన్స్ బాగానే ఎంగేజ్ చేసాయి. కథలో ఎక్కువ సబ్ ప్లాట్స్, క్యారక్టర్స్ ఉన్నాయి. కొన్నిసార్లు అన్ని అనవసరం అనిపిస్తాయి. నాగబాబు సీన్స్ బాగా రాసుకున్నారు. అవి బాగా పండాయి.
టెక్నికల్ గా..
సీరిస్ మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. నాగబాబు క్యారక్టర్ పెంచినా ఇంట్రస్టింగ్ గానే ఉండేది. కీ రోల్ లో చేసిన నరేష్ అగస్త్య, నివేదా ఇద్దరూ తమ పాత్రలకు ఫెరఫెక్ట్ యాప్ట్ అనిపించారు. బిందు మాధవి ని సెకండ్ సీజన్ కు దాచినట్లున్నారు. అలాగే సీరిస్ లో డైలాగులు కొన్ని బాగా పేలాయి. డైరక్టర్స్ ద్వయం కథను మాగ్జిమం ఇంట్రస్టింగ్ గా నడిపేలా చేసారు. అయితే పరువు అని టైటిల్ పెట్టకుండా ఇంకాస్త ఎక్కువ మంది చూసేందుకు అవకాసం ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఛల్తా హై.
చూడచ్చా..
ఫ్యామిలీతో కలిసి చూడకపోవటమే ఉత్తమం. ఎందుకంటే కొన్ని అసభ్యకరమైన డైలాగులు ఉన్నాయి. వాటిని తట్టుకోగలిగితే నడిచిపోతుంది. ఓ లుక్కేయచ్చు
ఎక్కడ చూడచ్చు :
‘జీ 5’ ఓటిటిలో తెలుగులో ఉంది
నటీనటులు: నరేశ్ అగస్త్య, నివేదా పేతురాజ్, నాగబాబు, రమేశ్, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, మొయీన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, బిందు మాధవి తదితరులు;
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్;
ఛాయాగ్రహణం: విద్యాసాగర్;
ఎడిటింగ్: విప్లవ్;
నిర్మాతలు: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి;
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: సిద్ధార్థ్ నాయుడు
దర్శకత్వం: సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి