‘పరదా’ రివ్యూ
x

‘పరదా’ రివ్యూ

అనుపమ పరమేశ్వరన్ సినిమా హిట్టేనా?


అనగనగా ఓ ఊరు..ఆ ఊరు పేరు పడతి. ఆ ఊరు పేరు లాగే అక్కడ ఓ చిత్రమైన ఆచారం ఉంటుంది. అక్కడ ప్రతి అమ్మాయి పరదా కప్పుకొనే కనపడాలి. అలా లేకపోతే, థిక్కార స్వరం వినిపిస్తే, పరదా తీసినట్టు కనిపిస్తే.. గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకుని చచ్చిపోవాలి. ప్రాణ భయంతోనో లేక ఆచారం మీద గౌరవంతోనే .. ఆ ఊరు జనం అంతా ఈ రోజుల్లో కూడా పరదా తో గడపటమో జీవితాశయం అన్నట్లు బ్రతుకుతూంటారు.

ఆ ఊళ్లో ఓ అమ్మాయి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్). ఆమె అదే ఊళ్లో ఉన్న రాజేష్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటుంది. వీరి పెళ్ళికి పెద్దలు సైతం ఒప్పుకుని ముందుకు వెళ్తున్న సమయంలో ...ఓ పెద్ద సమస్య ఎదురౌతుంది. అదేమిటంటే.. సుబ్బు ఫొటో పరదా లేకుండా ఒక పెద్ద మ్యాగజైన్‌లో కనిపిస్తుంది. దాంతో ఆ ఊరు వాళ్లకి రగిలిపోతుంది. ఏంటిది ..ఇంత గొప్ప కట్టుబాటిని, ఆచారాన్ని కాదని ఓ అమ్మాయి పరదా వేసుకోలేదా అని, ఆత్మార్పణ చేసుకోవాల్సిందే లేదా తన వల్ల ఆ తప్పు జరగలేదని ప్రూవ్ చేసుకోవాలి అని తీర్మానం చేస్తారు.

పాపం ఆ అమ్మాయికి వేరే దారి ఏముంది...పరదా లేకుండా తన ఫొటో తీసి మ్యాగజైన్ లో వేసి తన ప్రాణం మీదకు తెచ్చిన మహానుభావుడు ఎవరా అని వెతుక్కుంటూ బయిలుదేరుతుంది. ఈ జర్నిలో ఇంకొదరు పరిచయం అవుతారు. వాళ్లంతా ఎవరు..చివరకు ఏమైంది..సుబ్బు ప్రాణం రక్షించబడిందా లేదా , అసలు ఈ పరదా ఆచారం ఎందుకు ఆ ఊరుని పట్టుకుంది వంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తే సినిమా చూసేయండి.

విశ్లేషణ

ఒక పిక్షన్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు, అది ప్రేక్షకులను తన ప్రపంచంలోకి లాక్కుపోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే బిలీవబులిటీ ఇవ్వగలిగినప్పుడే. అంటే ప్రేక్షకులు చూసేటప్పుడు ఎక్కడో చోట..ఎప్పుడో అప్పుడు ఇలాంటిది జరిగి ఉండచ్చు.లేదా జరగటానికి అవకాసం ఉండచ్చు అనిపించాలి. అలాంటి నమ్మకాన్ని ఆ రెండు గంటల్లో ఆ కథ ఇవ్వలేకపోతే,ఆ సినిమా వర్కవుట్ కాదు.

స్పీల్‌బర్గ్ ఎంతో క్లియర్ గా చెప్తారు: “If you can’t make people believe in the monsters, then the movie won’t work.”

(“రాక్షస బల్లులు ఉన్నాయని నమ్మించలేకపోతే సినిమా ఎలా ఆడుతుంది”)

దీన్ని ‘పరదా’ విషయం నుంచి చూస్తే – పడతి ఊరి ఆచారం, పరదా లేకుండా ఉంటే ప్రాణాలు పోయే పరిస్దితి రావటం. ఊరి ప్రజల క్రూరమైన కోపం – మోడర్న్ కంటెక్ట్స్ లో నమ్మశక్యంగా అనిపించవు. మోడ్రన్ సొసైటీ, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా పరిస్థితుల్లో “ముఖాన్ని చూపినందుకు చంపడం” ఎలా నమ్మగలరు?

ప్రేక్షకులు తెరపై చూపే ఈ ఆచారాన్ని నమ్మితేనే కథ, తర్వాత సినిమా వర్కవుట్ అవుతుంది. అలాంటి ఊరు ఎక్కడో చోట ఉందనిపిస్తే మిగతావన్ని వరస పెట్టి వర్కవుట్ అయ్యిపోతాయి. అలా లేకపోనప్పుడు ఎంత మంచి ఎలిమెంట్స్ ఉన్నా, కథలో ఎమోషనల్ ఆర్క్ ఉన్నా ఇబ్బందిగానే ఉంటుంది.

ఫిక్షన్, డ్రామా, సస్పెన్స్ – అన్ని internal logic & believabilityపై ఆధారపడి ఉంటాయి. ‘పరదా’ లో internal logic audience కి convincing గా రాకపోవడం వల్ల, కథా సస్పెన్స్, ఎమోషన్ అన్ని వరస పెట్టి అన్ని ఫెయిల్ అవుతాయి.

‘పరదా’లో స్టోరీ ఐడియా, సస్పెన్స్ audience కి convincing గా చేయలేకపోయారు. ఈ సమస్య, స్పీల్‌బర్గ్ కోట్స్ లో చెప్పిన “రాక్షస బల్లులు ఉన్నాయని నమ్మించలేకపోతే .. ” సిట్యువేషన్‌తో సమానం. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులా ఒక ఇన్నోవేటివ్, ప్రోగ్రెసివ్ ఆలోచనను ప్రయత్నించారు. అయితే, ప్రధానమైన కథను హ్యాండిల్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ లో అక్కడక్కడా ఆయన ప్రతిభ చూపినా, మొత్తం కథను కనెక్ట్ చేసి, కావలసిన ఇంపాక్ట్ ను అందించడం ఫెయిలయ్యారు.

టెక్నికల్ గా, ఫెరఫార్మెన్స్ పరంగా...

ప్రధాన పాత్ర చేసిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సుబ్బు పాత్రలో ఒడిగిపోయింది. ప్రతి సన్నివేశంలో ఆమె కళ్ళతోనే భావాలను పలికిస్తుంది, ఈ సినిమా లో ఎక్కువ భాగం ఆమె పరదా కప్పి ఉండగా కూడా మనసుని తాకే ప్రయత్నం చేసింది. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్ధన్, బలగం సుధాకర్ రెడ్డి – తెరపై ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా, చిన్న మోమెంట్స్ లో సినిమా మీద బలమైన ప్రభావం చూపిస్తారు.

గోపీసుందర్ సంగీతం – పాటలు, సాహిత్యం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఓ ఫీల్ గుడ్ ఫీల్ తెచ్చాయి. మృదుల్ సుజిత్ ఛాయాగ్రహణంలో విజువల్స్ చక్కగా ఉన్నాయి.

ఫైనల్ థాట్

‘పరదా’ – కొత్త ఆలోచన, ఇన్నోవేటివ్ కాంసెప్ట్, బలమైన సీన్‌లు, కావాల్సినంత ఎమోషనల్ కంటెంట్ కలిగి ఉన్నా, బిలీవబులిటీ లోపం, predictable climax, diluted finish వల్ల కావాల్సిన మేరకు ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.

Read More
Next Story