ఒక్క బ్లాక్‌బస్టర్, మూడు డిజాస్టర్స్!
x

ఒక్క బ్లాక్‌బస్టర్, మూడు డిజాస్టర్స్!

ఉగాది-ఈద్ బాక్సాఫీస్ రిపోర్ట్

ఉగాది-ఈద్ డబుల్ ఫెస్టివల్ వీకెండ్‌లో నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అవి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్, వీర ధీర శూరన్. వీటిలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ఘన విజయం సాధించగా, మిగిలిన మూడు చిత్రాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

రాబిన్ హుడ్ – బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్

నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, రాబిన్ హుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా, తర్వాతి రోజుల్లో వసూళ్లు నెమ్మదించాయి.

4 రోజుల్లో కేవలం 10 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ వీకెండ్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బోర్ కొట్టించే స్క్రీన్‌ప్లే, బలహీనమైన కథ, మిక్స్‌డ్ టాక్ ఈ సినిమాను దారుణంగా దెబ్బతీశాయి. 50 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంగా ఉంది.

ఎంపురాన్ – మలయాళంలో హిట్, తెలుగులో ఫ్లాప్!

మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఎంపురాన్, మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న, తెలుగులో మాత్రం పరిస్థితి విభిన్నంగా మారింది.

హైదరాబాద్లో మలయాళ వెర్షన్ బాగా ఆడినా, తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. 4 రోజుల్లో తెలుగు వెర్షన్ 7 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది.

సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్ అయినా, తెలుగులో ప్రమోషన్లు సమర్థవంతంగా లేకపోవడం, నేటివిటీ మిస్ అవ్వడం కారణంగా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది.

వీర ధీర శూరన్ – విక్రమ్ మ్యాజిక్ మిస్!

చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర శూరన్ మంచి హైప్ ఉన్నప్పటికీ, తెలుగులో ఈ సినిమా నిరాశపరిచింది. తమిళంలో బాగానే ఆడుతున్న, తెలుగులో మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రివ్యూలు సానుకూలంగా ఉన్నప్పటికీ, వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి.

4 రోజుల్లో 6 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. మంచి యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్ ఉన్నా, కథనం నెమ్మదిగా సాగడం,తమిళ నేటివిటి మరీ ఎక్కువగా ఉండటం దెబ్బతీసింది.

MAD స్క్వేర్ – ఉగాది-ఈద్ వీకెండ్ సింగిల్ బ్లాక్‌బస్టర్!

ఈ ఫెస్టివల్ వీకెండ్‌లో విజయం సాధించిన ఏకైక సినిమా MAD స్క్వేర్ మాత్రమే. 4 రోజుల్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

నవ్వులు పంచే కథ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రెష్ కథనం సినిమాకు బలంగా పనిచేశాయి. ప్రధానంగా, అద్భుతమైన మౌత్ టాక్ ఈ సినిమాకు కలిసొచ్చింది. బ్రేక్ ఈవెన్ 20 కోట్లు కావడంతో, ఇప్పటికే భారీ లాభాల్లోకి వెళ్ళిపోయింది.

మీరు ఏ సినిమాలు చూసారు?

ఈ పండగ వీకెండ్‌లో మీరు ఏ సినిమా చూసారు? మీకు ఏది నచ్చింది? కామెంట్స్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి!

Read More
Next Story