
పవన్ “OG” ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతైంది? డిస్ట్రిబ్యూటర్లకు లాభమా లేక రిస్క్?
నంబర్స్ నిజమేనా లేక హైప్‌నా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత సినిమాల ఫలితాలతో సంభందం లేకుండా ఎప్పుడూ బిజినెస్ జరిగిపోతూంటుంది. రిలీజ్ కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ డీల్స్ లాక్ అయ్యిపోతూంటాయి. అదంతా రొటీన్ మేటర్. కానీ ఇప్పుడు ఆయన నటిస్తున్న “OG” సినిమాకి వచ్చిన హైప్, క్రేజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మరీ వేరే స్థాయిలో ఉంది.
గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే – పవన్ కళ్యాణ్ చివరిగా చేసిన “హరిహర వీరమల్లు” బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయినా, “OG” ప్రీ-బిజినెస్‌పై ఒక్క శాతం కూడా ఇంపాక్ట్ పడలేదు. అంటే పవన్ మార్కెట్ పవర్ ఎంత బలంగా ఉందో ఇక్కడే రుజువవుతోంది.
అందుకు కారణం ఈసారి "OG"కి ట్రేడ్, ఆడియెన్స్ రెండింటి అంచనాలు ఆకాశాన్ని తాకుతూండటమే. సుజీత్ మేకింగ్, గ్యాంగ్‌స్టర్ థీమ్, ఇమ్రాన్ హష్మీ యాడ్ వాల్యూ— అన్నీ కలిసి ఈ సినిమాను పవన్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెవెల్‌లో కూడా నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.
మరికొద్ది గంటల్లో స్పెషల్ షోలతో ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మేనియా పట్టుకుంది. మన దగ్గరే కాదు ఓవర్సీస్‌లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.
అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. పవన్‌ని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టికెట్స్ ఎంతైనా పెట్టి కొనేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రి రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందనే లెక్కలు ఓ సారి చూద్దాం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...
“OG” ప్రీ-బిజినెస్ బ్రేక్‌డౌన్:
నైజాం: 54 కోట్లు
సీడెడ్: 22 కోట్లు
ఉత్తరాంధ్ర: 20 కోట్లు
ఈస్ట్: 12 కోట్లు
వెస్ట్: 9 కోట్లు
గుంటూరు: 12.50 కోట్లు
కృష్ణా: 9.50 కోట్లు
నెల్లూరు: 6 కోట్లు
ఏపీ–తెలంగాణా మొత్తం: 145 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 10 కోట్లు
ఓవర్సీస్: 17.50 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 172.50 కోట్లు
(బ్రేక్ ఈవెన్ – 174 కోట్లకు పైగా)
ఇది పవన్ కెరీర్‌లోనే కాకుండా, టాలీవుడ్‌లోనూ హైయిస్ట్ ఫిగర్స్‌లో ఒకటి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే GST తో కలిపి వరల్డ్ వైడ్ గా 174 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాకు ఉన్న హైప్ కి టాక్ ఏమాత్రం డీసెంట్ గా ఉన్నా మాస్ రచ్చ చేయడం ఖాయమే. ఈ నంబర్స్ ఒకటి చెబుతున్నాయి: పవన్ మార్కెట్‌పై డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి సందేహం లేదు. అదెలా అంటే, “హరిహర వీరమల్లు” డిజాస్టర్ ఈ బిజినెస్‌పై అసలు ఇంపాక్ట్ చూపలేకపోవటం. పవన్ బ్రాండ్ విలువ ఎక్కడుందో ఇక్కడే అర్థమవుతోంది.
గమనిక: ఇవన్నీ అఫీషియల్ గా బయిటకు వచ్చిన లెక్కలు కాదు. ట్రేడ్ లో చెప్తున్న లెక్కలే.
Day 1 ఎక్స్పెక్టేషన్: సగం రికవరీ రియాలిటీనా?
ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్‌ని చూస్తే, థియేటర్లు దాదాపు హౌస్‌ఫుల్ మోడ్‌లోనే ఉన్నాయి. ఓవర్సీస్‌లోనూ డిమాండ్ అదే స్థాయిలో ఉంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం: Day 1 (Worldwide Gross) దాదాపు ₹120–₹150 కోట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది.
అంటే ప్రీ-బిజినెస్‌లో 50%కి పైగా ఒకే రోజు రికవరీ అవుతుంది. ఇది సాధిస్తే, “OG” పవన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డ్ కొట్టడం ఖాయం. పవన్ మార్కెట్ + సుజీత్ స్టైల్ మేకింగ్ + ఇమ్రాన్ హష్మీ యాడ్ వాల్యూ— అన్నీ కలిసి , ఈ టార్గెట్ రియలిస్టిక్‌గానే ఉంది.
ముఖ్యంగా ఫ్యాన్స్ ఎమోషనల్ అటాచ్మెంట్, “OG”కు ఉన్న గ్యాంగ్‌స్టర్ థీమ్ కు ఉన్న యూనివర్సల్ అప్పీల్ ఈ సినిమాకు లాంగ్ రన్ కలెక్షన్స్ బలోపేతం చేసే అవకాశం ఉంది.
ఫ్యాన్స్ క్రేజ్ – ఎమోషనల్ హైప్
పవన్ కళ్యాణ్ సినిమాలంటే అభిమానులకి అది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. హరిహర వీరమల్లు ఫెయిల్ అయినా, ఫ్యాన్స్ పవన్‌ని వేరే లెవెల్‌లో చూడాలని ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో “OG మాస్ ఫెస్ట్” అంటూ స్పెషల్ హ్యాష్‌టాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఓవర్సీస్‌లో ప్రీమియర్ టికెట్లు గంటల్లో హౌస్‌ఫుల్ కావడం, స్థానికంగా ఫ్యాన్స్ ఎంతటి ధరకైనా టికెట్లు కొనేందుకు సిద్ధమవ్వడం ఆ క్రేజ్‌ని స్పష్టంగా చూపుతోంది.
మాస్ & క్లాస్ మిక్స్ – పవన్ ఇమేజ్ మాస్ ఆడియెన్స్‌ను లాగుతుంది, సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ క్లాస్ సెంటర్స్‌లో కూడా వర్కౌట్ అవ్వాలి.
కంటెంట్ టాక్ – Day 1 రికార్డులు ఖాయం, కానీ లాంగ్ రన్ పూర్తిగా వర్డ్ ఆఫ్ మౌత్‌పై ఆధారపడి ఉంటుంది.
4-Week Theatrical Window – హిందీ మల్టీప్లెక్స్ రిలీజ్ లేకపోవడం నష్టమే కానీ, ఓటీటీ 80Cr+ డీల్ ఈ లోటుని కవర్ చేసింది.
ఫ్యాన్స్ ఎమోషన్ vs ట్రేడ్ రియాలిటీ
అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. కంటెంట్ ఆ హైప్‌ని బ్యాలెన్స్ చేయగలిగితే, “OG” బాక్సాఫీస్ మాన్స్టర్ అవుతుంది. “OG” ప్రస్తుతం ఉన్న హైప్, ప్రీ-బిజినెస్, బుకింగ్స్— మొత్తంగా చూస్తే, Day 1లోనే 50% రికవరీ అనేది కేవలం అంచనా కాదు, రియాలిటీ అవ్వొచ్చు. ఇది పవన్ కెరీర్‌లోనే కాకుండా, ఇండస్ట్రీ లెవెల్‌లోనూ ఒక మైలురాయి కావొచ్చు. “OG” Day 1 రికార్డులు కొడుతుందా..? లేక వర్డ్ ఆఫ్ మౌత్ డే 2 నుంచి షేప్ మార్చేస్తుందా..? – ఇదే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్.
ఏదైమైనా పవన్ బ్రాండ్ విలువ కేవలం గత సినిమా రిజల్ట్‌పై ఆధారపడదు, ఆయన ఇమేజ్, అభిమానుల అండ, ఇండస్ట్రీలోని నమ్మకం—అన్ని కలిసే ఉంటుంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్‌హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.