అఖండ 2   ఓటిటికు నుంచీ సమస్య?
x

"అఖండ 2" ఓటిటికు నుంచీ సమస్య?

ఒక్కసారి ఆగితే అన్నీ సమస్యలే


బాలకృష్ణ–బోయపాటి కాంబో సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కి పండుగ. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన Akhanda 2 కోసం అభిమానులు థియేటర్ల దగ్గర భారీ హంగామా చేసేలా రెడీగా ఉన్నారు. షో టైమింగ్స్, ప్రీమియర్స్ అన్నీ సిద్ధం. కానీ చివరి నిమిషంలో పెద్ద అడ్డంకి సినిమాని పూర్తిగా ఆపేసింది. అదే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్. మరో ప్రక్క కోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు సినిమా స్క్రీన్‌కి నో ఎంట్రీ. ఆ మేటర్ ఎలోగోలా సెటిల్ చేసుకున్నా... ఇప్పుడు మరో రిలీజ్ డేట్ సెట్ చేయాలంటే నెట్ ప్లిక్స్ నుంచి అవసరం అని తెలుస్తోంది.

ఒకప్పుడు సినిమాల విడుదల అంటే థియేటర్లలో షోలు, టికెట్ అమ్మకాలు, వారం మొదటి కలెక్షన్లే అసలు మ్యాటర్. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్లు కలసి నిర్ణయాలు తీసుకునేవారు. కాని ఇప్పుడు ఆ గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈరోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్, ప్రమోషన్, విండో — అన్నింటికైనా OTT ప్లాట్‌ఫార్మ్‌లు డిక్టేట్ చేస్తున్నారు.

Netflix, Amazon Prime, Hotstar, Zee5 వంటి ప్లాట్‌ఫార్మ్‌లు: ముందుగానే భారీ అమౌంట్‌కి రైట్స్ కొనుగోలు చేస్తాయి , 4–6 వారాల థియేటర్ విండో ఫిక్స్ చేస్తాయి. తమ ప్రోగ్రామింగ్ క్యాలెండర్‌కి తగ్గట్టు తేదీలు లాక్ చేస్తాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే —థియేటర్ రిలీజ్ కన్నా ముందే OTT షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది!

ఒక సినిమా డేట్ మారితే, OTT షెడ్యూల్ మొత్తం కదలాలి… అక్కడే అసలు కమాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు బాలయ్య సినిమా Akhanda 2 కూడా ఇదే రూల్ బుక్‌లో పడింది. మొత్తం కథ ఇలా సాగింది

రిలీజ్ డేట్‌పై ఫైనల్ మాట Netflix వాళ్లదే!

Akhanda 2 OTT రైట్స్‌ను Netflix భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ డీల్ ప్రకారం:

థియేటర్స్ → 4 వారాల తర్వాత → Netflix స్ట్రీమింగ్

కాబట్టి Netflix జనవరి మొదటి వారం స్లాట్ బ్లాక్ చేసి ఉండే అవకాశం ఉంది

సింపుల్ లాజిక్:

సినిమా ఈరోజు లేదా రేపు రిలీజ్ అయితే — Netflix షెడ్యూల్ సేఫ్. కానీ విడుదల ఇంకా వాయిదా పడితే Netflix కొత్త స్లాట్ ఇవ్వాలి. అది ఒక్క Akhanda 2 కోసం కాదు. ఏ పెద్ద సినిమాకి అయినా ఇంతే.

Netflix ఒక Global Programming Calendar మీద పనిచేస్తుంది:

ప్రతి దేశం కోసం, ప్రతి ప్రోగ్రామ్ కోసం ప్రత్యేక స్లాట్లు

మార్కెటింగ్ క్యాంపెయిన్, యాప్ హోమ్‌పేజ్ ప్లేస్‌మెంట్ అన్నీ ముందుగానే సెట్ చేస్తుంది.

ఒక సినిమా ఆలస్యం అంటే వాళ్ల మొత్తం క్యాలెండర్ షిఫ్ట్ అవ్వాలి. అందుకే నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాలంటే ముందు: Netflix అనుమతి అవసరం.

Akhanda 2‌కు ఇప్పుడు రెండు సమస్యలు తీరాలి

కోర్టు ఇంజంక్షన్

Netflix అనుమతి

ప్రస్తుతం నిర్మాతలు అర్జెంట్ గా సమస్యను ఈరోజే క్లియర్ చేయటం అంటే మాటలు కాదు. దాంతో రిలీజ్ డేట్ కు పెద్ద డిలే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే: లీగల్ క్లియర్‌అన్స్, Netflix కొత్త స్లాట్, మార్కెటింగ్ రీసెట్, షో టైమింగ్స్ ఇవన్నీ గంటల్లో తీరేవి కావు.

Akhanda 2 రిలీజ్‌కి ఇప్పుడు “థియేటర్ నుంచి Netflix వరకు” రెండు గ్రీన్ సిగ్నల్స్ అవసరం.

కోర్టు: అప్పు క్లియర్ చేయటం

Netflix: కొత్త స్లాట్ ఫిక్స్ చేయటం

ఏదైమైనా సినిమా అంటే కెమెరా, కట్, యాక్షన్ కాదు — కోర్టు ఆర్డర్లు, Netflix క్యాలెండర్ లు కూడా సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి.

ఇది ఒక పెద్ద రియాలిటీ బిజినెస్, లీగల్, డిజిటల్ అన్ని లెవెల్స్‌లో సరైన టైమింగ్ సెట్ అవుతేనే బాలయ్య మాస్ ఫైర్ మళ్లీ స్క్రీన్‌పై కనబడుతుంది.

Read More
Next Story