మలయాళీ ఫ్రమ్ ఇండియా ఓటిటి మూవీ రివ్యూ
x

'మలయాళీ ఫ్రమ్ ఇండియా' ఓటిటి మూవీ రివ్యూ

సినిమాలు రాజకీయ నేపధ్యాలను, మన సామాజిక జీవన విన్యాసాలను వ్యతిరేకిస్తూనో, బలపరిస్తూనో... లేక వ్యంగ్యంగా చూపిస్తూనో చేస్తే ఎప్పుడూ బాగానే ఉంటాయి.


సినిమాలు రాజకీయ నేపధ్యాలను, మన సామాజిక జీవన విన్యాసాలను వ్యతిరేకిస్తూనో, బలపరిస్తూనో... లేక వ్యంగ్యంగా చూపిస్తూనో చేస్తే ఎప్పుడూ బాగానే ఉంటాయి. అలాంటి పొలిటికల్ సైటర్ ఫిల్మ్ లు తీసే కల్చర్ ఎప్పటినుంచో కేరళలో ఉంది. మనకు కేవలం ఎలక్షన్స్ టైమ్ లో వచ్చే చిత్రాలు వాళ్లకు ఏడాదంతా వస్తూనే ఉండేవి. అయితే అక్కడా వాళ్లూ తగ్గిపోయారు. ఎప్పుడోకానీ రాజకీయాలపై సెటైర్స్ వేస్తూ సినిమాలు తీయటం లేదు. అయితే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' లో కొంతవరకూ దర్శకుడు ఆ పని చేసారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వచ్చింది. కొంత కేరళ రాజకీయాలపై అవగాహన ఉంటే మరింత బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాలో అసలు కథేంటి..మనకు నచ్చేదేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

కేర‌ళ‌లోని ఓ మారుమూల గ్రామంలో ఉండే అలపరంబిల్ గోపి (నివిన్ పౌలీ) త‌ల్లి, చెల్లితో క‌లిసి ఉంటాడు. అయితే అతను ఎప్పుడూ వేరే లోకంలో ఉంటూంటాడు. రాజకీయాలు, క్రికెట్ తప్ప ఇంటి భాధ్యత పట్టించుకోడు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం మారిపోతుందని కలగంటూంటాడు. తల్లి, చెల్లి కష్టపడి సంపాదించే దాన్ని తినటంలో ఎలాంటి సిగ్గూ పడడు. అయితే అతను సపోర్ట్ చేసే జాతీయ పార్టికు కేరళలో ఆదరణ అంతంత మాత్రమే.

ఇలాంటి గోపికు ఓ ప్రెండ్ మంగ్లేష్ (ధ్యాన్ శ్రీనివాస్) . అతను కూడా సేమ్ టు సేమ్ గోపీ టైపే. అతను ఆవేశపరుడు. వీళ్లిద్దరూ దేశ జీడీపి గురించి రాష్ట్ర అప్పులు గురించి మాట్లాడుతుంటారు కానీ తమ జేబులో టీ తాగటానికి ఎంత డబ్బులున్నాయో అంచనాకి మాత్రం రాలేదు. అలా వీళ్లిద్దరూ పార్టీ ప్రచారం అంటూ వయస్సు వచ్చినా ఏదీ పట్టించుకోకుండా తిరుగుతూండగా...చిన్న ఎమోషనల్ ఇన్సిడెంట్లో ఆవేశపడిపోయిన మంగ్లేష్...అనాలోచితంగా వేరే మతం వ్యక్తులపై నిజా నిజాలు తెలుసుకోకుండా దాడి చేస్తాడు. చిన్న ఘ‌ట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా మ‌త‌, రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతాయి. దీంతో అది పెద్ద ఇష్యూ అయ్యిపోతుంది గోపీ, మంగ్లేష్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇద్దరూ రహస్యంగా దాక్కుంటారు. కానీ మంగ్లేష్ దొరికిపోయి చావు దెబ్బలు తిని హాస్పటిల్ పాలవుతాడు.

ఇక గోపికు ఇదంతా చూసి భయం పట్టుకుంటుంది. తన మామయ్య సహకారంతో కుటుంబం ఒత్తిడితో దేశం వ‌దిలి దుబాయి వెళ్లిపోతాడు. అక్కడ ఆ ఏడారి దేశంలో ఉద్యోగం దారుణంగా ఉంటుంది. ఓ పాకిస్దాన్ వ్యక్తి దగ్గర బ‌ల‌వంతంగా వెళ్లాల్సి వ‌స్తుంది.ఎదురుదిరిగితే ఆ వ్యక్తి గోపిని ఇరక్కొడుతూ ఉంటాడు. పాకిస్దాన్ అంటే మండిపడే గోపి తప్పనిసరి పరిస్దితుల్లో అన్నీ మూసుకుని అతనే దగ్గరే సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ నుంచి అతని జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి... మనిషి అనే వాడు కనపడని ఆ ఎడారుల నుంచి గోపీ బయిటపడ్డాడా, మంగ్లేష్ పరిస్దితి ఏమైంది..బ్రతికి బట్టకట్టాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఫస్టాఫ్ ఫన్ తో లాగేసారు. కాకపోతే కేరళ రాజకీయాలు, అక్కడ సెటైర్లు కొన్ని అర్దమై, అర్దం కానట్లు ఉంటాయి. ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి కోవిడ్ టైమ్ ఆ చావులు, పాకిస్దాన్ వ్యక్తి దగ్గర ఎడారుల్లో పని చేసేటప్పుడు పడిన కష్టాలు అంటూ ఎటెటో వెళ్లిపోతుంది. దర్శకుడు చాలా సీన్స్ హెవీగా హ్యాండిల్ చేసారు. అలాగే ఫోర్సెడ్ డ్రామా కూడా విసిగిస్తుంది. సంఘటనలు కన్నా డైలాగులు మీదే ఎక్కువ ఆధారపడ్డారు. కొంత కామెడీ వర్కవుట్ అయితే మరికొంత కామెడీ సోసోగా నవ్వాలి కదా అన్నట్లు అయ్యిపోయింది. అయితే ఈ నేరషన్ లో చాలా కాంటపరరీ ఇష్యూలు చూపటం అయితే నచ్చే అంశం. దర్శకుడుగా హిందూ, ముస్లిం అంతా ఒక్క‌టే అనే చిన్న మెసేజ్ ఇవ్వటం కోసం ఇంత సినిమా తీయాలా డైరక్టర్ అనిపిస్తుంది. కొన్ని సార్లు ఆడు జీవితం ..ది గోట్ లైఫ్ కు ఇంకో వెర్షన్ చూస్తున్నామా అనే డౌట్ వస్తుంది.

హీరోగా నివిన్ పౌలీ ( Nivin Pauly), అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan), ధ్యాన్ శ్రీనివాస‌న్ (Dhyan Sreenivasan), షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించటం తో సినిమాకు ఓ లుక్ అయితే వచ్చింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మాత్రం ఓ అరగంట లేపేస్టే బాగుండేదే అన్న ఫీల్ వచ్చింది.

చూడచ్చా

కొత్త కల్చర్, కొత్త ప్రాంతాలు, కేరళ జీవితాలు చూడటానికైనా ఓ లుక్కేయచ్చు. ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఏమీ లేవు కాబట్టి ఫ్యామిలీలతో కలిసి చూడచ్చు.

ఏ ఓటిటిలో ఉంది

సోని లీవ్ (Sony LIV) ఓటీటీలో తెలుగులో ఉంది.

Read More
Next Story