మైత్రీ  కొత్త డీల్, నార్త్,సౌత్ ఇక హోల్ సేల్
x

'మైత్రీ' కొత్త డీల్, నార్త్,సౌత్ ఇక హోల్ సేల్

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరుగా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటిగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.


ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరుగా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటిగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ప్రారంభంలోనే తెలుగు స్టార్ హీరోలతో ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టి స్ట్రాంగ్ బేస్ వేసుకుంది ఈ సంస్థ. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ప్యాషనెట్ గా సినిమాలు చేస్తూ సంస్దను అతి తక్కువ కాలంలోనే టాప్ పొజిషన్ లోకి తీసుకొచ్చారు. ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వస్తున్నారు. నిర్మాతలు ఒక సినిమాను తెరకెక్కించటానికే తడబడుతూంటే...ఒకేసారి ప్లానింగ్ తో రెండు మూడు భారీ సినిమాల్ని ఏకకాలంలో షూట్ జరపడం ఈ సంస్థ ప్రత్యేకత.

ఈ క్రమంలో మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్‌ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తూ నెంబర్ వన్ స్దానంలో ఉన్నారు. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం మరిన్ని భారీ సినిమాలను సెట్స్ మీదుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు . అందుకోసం డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ విస్తరణ, థియేటర్స్ లీజుకు తీసుకోవటం తో పాటు ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్ లోనూ స్మూత్ గా తమ సినిమాల రిలీజ్ కు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

తెలుగులో టాప్‌ బ్యానర్‌ గా అతి తక్కువ కాలంలో ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) నుంచి వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు మినహా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్‌ గా నిలిచాయి. పుష్ప, రంగస్థలం, పుష్ప 2, వాల్తేరు వీరయ్య లాంటి హిట్స్‌ అందించారు. ప్రతీ ఏడాది కోట్ల టర్నోవర్ తో భారీ సినిమాలు నిర్మించే మైత్రీ 2023 లో ఏకంగా రెండు సినిమాల్ని ఒకేసారి రిలీజ్ చేసి రెండూ కలిపి 350 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు జోల్ట్ ఇచ్చే స్దాయిలో ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో ఇప్పుడు ప్రతీ పెద్ద హీరో సినిమా ప్యాన్ ఇండియా నే. దాంతో ఈ సినిమాలుకి నార్త్ లో రిలీజ్ పెద్ద సమస్యగా మారింది. అందరికీ కరణ్ జోహార్ అందుబాటులో ఉండరు కదా. అలాంటప్పుడు ప్రతీ సారి తమ సినిమాకు అక్కడ మార్కెట్ లో బేరసారాలు జరిపి డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ ని వెతుక్కోవటం కన్నా పర్మనెంట్ గా తమ సినిమాలు నార్త్ లో రిలీజ్ చేసేందుకు, అందు నిమిత్తం పెట్టుబడులు ముందుగానే పెట్టేందుకు మైత్రీ మూవీస్ వారు ప్లాన్ చేసి టీసీరిస్ భూషణ్ కుమార్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2024 పుష్ప 2 రిలీజ్ నుంచి ఈ ఎగ్రిమెంట్ అమలు లో రానుందని సమాచారం.

పుష్ప – 2: రూల్’.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా., సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆల్రెడీ భూషణ్ కుమార్ పెట్టుబడి పెట్టారు. అలాగే మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ప్రభాస్ తో చేస్తున్న ఫౌజీ, ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్, అజిత్ తో చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లోనూ తమ వాటా కొంత పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఈ పార్టనర్ షిప్ వలన టీ సీరిస్ వాళ్లు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఈ సినిమాలను రిలీజ్ చేస్తారు. అప్పుడు మైత్రీ వారు తెలుగు మార్కెట్ పైనే పూర్తి ఫోకస్ చేయవచ్చు. కొలాబిరేషన్ రెండు సంస్దలకు అతి కీలకమైన విషయం. నార్త్ లో టీసీరిస్ వాళ్లకు ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. దాంతో ఖచ్చితంగా అక్కడ తెలుగు సినిమాలకు మార్కెట్ కు ఏ ఢోకా ఉండదు. అందులో వారి సొంత సినిమా క్రింద రిలీజ్ చేస్తారు కాబట్టి అసలు సమస్యే ఉండదు.

టీ సీరిస్ వాళ్లు ఆల్రెడీ తెలుగు దర్శకుడు సందీప్ వంగాతో యానిమల్ వంటి సూపర్ హిట్ ఇచ్చి ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ చిత్రం చేస్తున్నారు. అలాగే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సైతం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భూల్ భుల్లయ్యా 3 సినిమాని దీపావళి 2024న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. టీ సీరిస్ ఇప్పుడు వరస పెట్టి ఎక్సైటింగ్ ప్రాజెక్టులును లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తోంది. అవన్నీ తెలుగులో మైత్రీవారు తమ నెట్ వర్క్ లో రిలీజ్ చేస్తారు.

ఇప్పటివరకు సినిమాల నిర్మాణం వరకే పరిమితమైన మైత్రీ మూవీ బ్యానర్‌ ఇక పంపిణీ రంగంలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నెట్ వర్క్ ని పెంచుతోంది. ఇప్పటికే సలార్‌,హనుమాన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను విడుదల చేసిన భారీ వసూళ్లను రాబట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ కంపెనీ పాగా వేయాలని ఎప్పట్నుంచో భావిస్తోంది. ఓవైపు దిల్ రాజు, మరోవైపు ఏషియన్ సురేష్ కంపెనీ (సునీల్ నారంగ్, సురేష్ బాబు జాయింట్ కంపెనీ) పోటీగా ఉన్నప్పటికీ మైత్రీ మూవీస్ తన డిస్ట్రిబ్యూషన్ ను కొనసాగిస్తూనే ఉంది. త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతోంది. అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సెట్స్ పై ఉంది. విజయ్ దేవరకొండ-రాహుల్ సంకృత్యాన్ సినిమా ఎనౌన్స్ చేసింది. పుష్ప-2ను విడుదలకు సిద్ధం చేస్తోంది.

ఇప్పుడు మైత్రీవారు తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే మలయాళం, హిందీలో లైన్ క్లియర్ చేసిన మైత్రి మేకర్స్ త్వరలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ నిర్మాణంలో పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16, నడిగర్ తిలకం సినిమాలు ఉండగా త్వరలో సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇవే కాకుండా ఆహా ఓటీటీ కోసం సిరీస్ లు కూడా నిర్మిస్తుంది. ప్రస్తుత వరుస సినిమాలతో, వరుస సక్సెస్ లతో మైత్రి మూవీ మేకర్స్ దూసుకుపోతూ టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు టీసీరిస్ తో టైఅప్ తో మరిన్ని కొత్త అడుగులు పడతాయనంటలో సందేహం లేదు.

Read More
Next Story