‘పుష్ప’ సపోర్ట్ లేకుండా రష్మిక దుమ్ము రేపుతుందా?
x

‘పుష్ప’ సపోర్ట్ లేకుండా రష్మిక దుమ్ము రేపుతుందా?

వరస హిట్స్ తర్వాత… రష్మిక సొలో రిస్క్!


వరుసగా సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులతో పాన్ ఇండియా క్రేజ్ పెంచుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె ఇప్పుడు నిజమైన టెస్ట్‌కి రెడీ అవుతోంది. ‘పుష్ప’ నుండి ‘ఛావా’, ‘కుబేర’, థామా వరకూ హై బజ్ ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న రష్మిక… ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ‘The Girlfriend’ తో ఎమోషనల్ డ్రామా జోనర్‌లో తన క్రేజ్‌ను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.

ట్రైలర్‌ క్రేజీగా ఉంది కానీ, మాస్ బజ్ మాత్రం ఇంకా పెరగాల్సి ఉంది. హీరోయిన్ సెంట్రిక్ లవ్ స్టోరీ — ఇంకా మహిళా దృష్టికోణంతో చెప్పబడిన కథ… అంటే మొదటి రోజు ఓపెనింగ్స్‌ విషయంలో కొంచెం రిస్క్ ఉండే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రాలు భారీ ఓపెనింగ్స్‌ని పెద్దగా రికార్డ్ చేయలేదనేది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం.

అయితే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కి రెండు మేజర్ ప్లస్ పాయింట్లు ఉన్నాయి —

ఇండస్ట్రీలో అద్భుతమైన రెప్యుటేషన్ ఉన్న గీతా ఆర్ట్స్ ప్రెజెంటేషన్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రష్మిక బ్రాండ్ పవర్

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, దీరజ్ మొగిలినేని – దివ్య కొప్పినీడి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం… కమర్షియల్ ఫార్ములా లేకుండా, ఎమోషనల్ న్యారేటివ్‌తో రష్మిక స్టార్ పవర్‌ను టెస్ట్ చేయబోతోంది.

సోషల్ మీడియాలో క్వీన్, “నేషనల్ క్రష్”, “పుష్ప ఫ్రాంచైజ్ హీరోయిన్”, బాలీవుడ్ లో అడుగుపెట్టిన పాన్–ఇండియా అట్రాక్షన్…అన్నీ ఉన్నాయి కానీ స్పెషల్‌గా తన పేరు మీద సినిమా నడపగల సత్తా ఉందా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్.

స్టార్‌డమ్ vs సాలిడ్ థియేటర్ పుల్

రష్మికకి ఆన్‌లైన్ లో మాస్ క్రేజ్ ఉంది — వైరల్ ఫోటోలు, ఫ్యాన్ ఆర్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పాపులర్ ఇమేజ్. కానీ నిజమైన స్టార్‌డమ్ అంటే… ఇండిడ్యువల్ గా టికెట్ కొనిపించే శక్తి. ఇక్కడే చాలా హీరోయిన్-సెంట్రిక్ సినిమాలు తడబడ్డాయి. ఇటీవలి కాలంలో భారీ మీడియా ఎటెన్షన్ ఉండకపోతే, థియేటర్స్‌లో ప్రజలు అడుగుపెట్టలేదు.

అయితే రష్మిక?

ఇది వరకూ ఆమె క్రేజ్,లో మేజర్ షేర్ మాస్ ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ వల్లే వచ్చింది — Pushpa, Animal aura. ఇప్పుడు అటువంటి బలమైన హీరో – మాస్ ఫార్ములా సపోర్ట్ లేదు. ఇక్కడే ఈ సినిమా తన రియల్ మార్కెట్‌ ని డిఫైన్ చేయబోతుంది. రష్మిత సత్తా ఏంటనేది చెప్పబోతోంది.

ఇక గర్ల్ ప్రెండ్ సినిమా లవ్ స్టోరీ కానీ… కన్వెన్షనల్ గ్లామర్–కామెడీ రొటీన్స్ కాదు. ఇది ఫిమేల్ పర్స్పెక్టివ్ నుండి భావోద్వేగ కథ.

ఇలాంటి కథలకు — రిలీజైన రెండు రోజులకు వరకూ ఫేమ్ రాదు. అందుకే మొదటి షో నుండి వర్డ్ అఫ్ మౌత్ ముఖ్యం. అందుకే “రష్మిక ఆడియెన్స్‌ని ఎమోషన్‌తో థియేటర్‌కి లాగగలదా?” అనే చర్చ మొదలైంది.

ఇది కంటెంట్ టెస్ట్ మాత్రమే కాదు,

రష్మిక స్టార్ విలువకు రిపోర్ట్ కార్డ్.

Read More
Next Story