
ఓటీటీలో రచ్చ రచ్చ చేసే మూవీస్, సిరీస్ లిస్ట్!
హాలిడే స్పెషల్…
ఆగస్టు రెండో వారం ప్రేక్షకులకు పండగ వాతావరణం క్రియేట్ అవనుంది. థియేటర్లలో ఒకవైపు రజనీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో ‘వార్ 2’ లాంటి పాన్ ఇండియా లెవెల్ బిగ్ సినిమాలు రాబోతుంటే… మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అదే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరసగా లైనప్ అయ్యాయి. ఈసారి థియేటర్ – ఓటీటీ పోటీ రసవత్తరంగా ఉండనుంది.
ఆగస్టు నెల మొదలై వారం గడవక ముందే, రెండో వారం ప్రారంభం కావడంతో ఓటీటీ ప్రేక్షకులకు మస్త్ ట్రీట్ సిద్ధమైంది. ముఖ్యంగా ఈ వారం ఒక్కసారిగా 30 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో తెలుగు డబ్బింగ్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉండటం విశేషం. ఈ క్రమంలో ఓటీటీ బజ్ కూడా మాక్స్‌లో ఉండనుంది.
Netflix
Sullivan Crossing – Season 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11
Outlander – Season 7 Part 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11
Final Draft (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12
Jim Jefferies (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 12
Fixed (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 13
Love is Blind: UK – Season 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13
Sare Jahan Se Achha (హిందీ సిరీస్) – ఆగస్టు 13
Songs from the Hole (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 13
Young Millionaires (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 13
In the Mud (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 14
Mononoke Movie: The Second Chapter (జపనీస్ సినిమా) – ఆగస్టు 14
Fit for TV (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
The Echoes of Survivors (కొరియన్ సిరీస్) – ఆగస్టు 15
The Night Always Comes (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
ZEE5
Tehran (హిందీ సినిమా) – ఆగస్టు 14
Janaki vs State of Kerala (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 15
Amazon Prime Video
Andhera (హిందీ సిరీస్) – ఆగస్టు 14
Disney+ Hotstar
Dog Man (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) – ఆగస్టు 11
Drop (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 11
Iron Man and His Awesome Friends (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12
Alien: Earth (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13
Limitless (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
Bloody Trophy (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 17
Apple TV+
Snoopy Presents (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
Sony LIV
Kaun Banega Crorepati – Season 17 (రియాలిటీ షో) – ఆగస్టు 11
Court Kacheri (హిందీ సిరీస్) – ఆగస్టు 13
అలాగే ఈటీవీ విన్ (ETV Win) లో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో కథతో అలరించడానికి సిద్ధమైంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఆగస్టు 14వ తేదీ నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఏదైమైనా రీసెంట్ ఇయిర్స్ లో ఓటీటీ మార్కెట్ వేగంగా విస్తరిస్తూ, థియేటర్ బిజినెస్‌కి నిజమైన పోటీగా మారింది. ముందెప్పుడో థియేటర్‌లో చూడలేని చిన్న సినిమాలకే ఓటీటీ వేదిక ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది — బిగ్ బడ్జెట్, స్టార్ క్యాస్ట్ సినిమాలు, ఇంటర్నేషనల్ క్వాలిటీ వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రైట్‌గా లేదా షార్ట్ గ్యాప్‌లో ఓటీటీలోకి వస్తున్నాయి.
ప్రేక్షకులకు ఇప్పుడు ఎంపికలు ఎక్కువ. థియేటర్‌కి వెళ్లాలా? లేక ఇంట్లోనే హై-క్వాలిటీ కంటెంట్ చూడాలా? అన్నది ప్యూర్ పర్సనల్ ప్రిఫరెన్స్, కంఫర్ట్‌పై ఆధారపడి పోతోంది.