సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత..
x

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత..

రెహమాన్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. వేగంగా కోలుకోవాలని ఎక్స్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు.


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

కుటుంబ సమస్యలు..

గత ఏడాది నవంబర్‌లో ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను మూడున్నర దశాబ్దాల వివాహ బంధానికి విరామం ప్రకటించారు. 1995లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. తన ఆరోగ్య సమస్యల కారణంగా రెహమాన్‌కు దూరంగా ఉంటున్నట్లు సైరాభాను చెప్పారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నట్లు సమాచారం. రెహమాన్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని ఎక్స్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

రెహమాన్ ఇటీవల ‘ఛావా’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్‌సీ 16’ చిత్రానికి పనిచేస్తున్నారు. రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. దీని కోసం ఇప్పటికే తాను రెండు పాటలు కంపోజ్‌ చేసినట్లు రెహమాన్ ఇటీవల వెల్లడించారు.

Read More
Next Story