
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి భారీ షాక్
అమెరికాలో ‘OG’ షోలు రద్దు
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చిత్రానికి క్రేజ్ పీక్స్ కు చేరింది.
ఉత్తర అమెరికాలో పవన్ కల్యాణ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ థియేటర్ చైన్ యార్క్ సినిమాస్ (YorkCinemas) సంచలన ప్రకటన చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG’ సినిమాకి షోలు రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
అసలు ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటి? కేవలం బిజినెస్ డీల్స్ మాత్రమేనా? లేక ఇంకా ఏదైనా ఉందా?
థియేటర్ యాజమాన్యం సంచలన ఆరోపణలు
‘OG’ ప్రదర్శిస్తే ప్రేక్షకుల భద్రతకు ముప్పు ఉంటుందని స్పష్టంగా హెచ్చరిక.
డిస్ట్రిబ్యూటర్‌లపై పోలిటికల్ ప్రెషర్ ఆరోపణలు.
టికెట్ రేట్లు పెంచాలనే బలవంతం చేసారని సంచలన క్లెయిమ్.
సౌత్ ఏషియన్ కమ్యూనిటీ లోనూ కలకలం
యార్క్ సినిమాస్ ప్రకటన ప్రకారం — కొందరు వ్యక్తులు సామాజిక హోదా, రాజకీయ సంబంధాల ఆధారంగా గొడవలు సృష్టిస్తున్నారట. తాము మాత్రం సమాన అవకాశాలకే కట్టుబడి ఉంటామని క్లారిటీ ఇచ్చింది.
అలాగే, ఇండియాలో కొన్ని ఆన్‌లైన్ మీడియా సంస్థలు తమపై తప్పుడు ఆర్థిక సమాచారం ప్రచారం చేస్తున్నాయని ఖండించింది. అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
టికెట్లు కొన్నవారికి గుడ్ న్యూస్
ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
“ప్రేక్షకులు, ఉద్యోగుల భద్రతే మా ప్రాధాన్యం” అంటూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది.
అయితే, ఈ సంచలన పరిణామంపై ‘OG’ మూవీ టీమ్ నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు.