మందాకిని మూవీ రివ్యూ!
x

మందాకిని మూవీ రివ్యూ!

ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి వివరాలు చూద్దాం.

సాధారణంగా మలయాళంలో రొమాంటిక్ కామెడీ డ్రామాలు బాగుంటాయి. అక్కడ క్రైమ్, కామెడీ జోనర్లో నిర్మితమైన సినిమాలే బాగా వర్కవుట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈ జానర్స్ తప్పించి వేరే దారి లేదు. ఆ క్రమంలో మన ముందుకు వచ్చిందే 'మందాకిని'. అల్తాఫ్ సలీం - అనార్కలి మారికార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వినోద్ లీల డైరక్ట్ చేసారు. లాస్ట్ ఇయర్ మే 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, థియేటర్ల బాగానే వర్కవుట్ అయ్యింది. తాజాగా తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి వివరాలు చూద్దాం.

స్టోరీ లైన్

మిడిల్ క్లాస్ కుర్రాడు అరవింద్ (అల్తాఫ్ సలీమ్) కి పెళ్లి లేటవుతుంది. అతనికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది జీవితాశయం. అందుకోసం కొంతమంది అమ్మాయిలను ట్రై చేస్తాడు. కానీ వర్కవుట్ కాదు. అప్పుడే అమ్ములు (అనార్కలి)తో పెళ్లి కుదురుతుంది. తనకంటే చాలా బాగున్నా ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడంతో తన లక్ గా ఫీలవుతాడు. తన లైఫ్ మారిపోయింది అనుకుంటాడు. అయితే జీవితం అనుకున్నది అనుకున్నట్లు ఎందుకు అవుతుంది. ఓ ట్విస్ట్ పడుతుంది.

పెళ్ళైన శోభనం టైమ్ లో అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటే, అతను తాగే జ్యూస్ లో మద్యం కలుపుతాడు వాళ్ల బావ విష్ణు. ఆ విషయం తెలియని అనార్కలి, ఆ జ్యూస్ మొత్తం తాగుతుంది. దాంతో ఆమె ఆ మత్తులోకి వెళ్లిపోతుంది. మత్తులో ఉన్నది ఉన్నట్లు ఉండక కొత్త పెళ్లి కూతురుని అనే విషయం కూడా మర్చిపోయి తన ఫ్లాష్ బ్యాక్ ని విప్పుతుంది. ఆమె పెళ్లికి ముందు సుజీత్ వాసు తో లవ్ ఎఫైర్ ఉంటుంది. అదంతా అత్తగారి ముందే చెప్పడం మొదలవుతుంది. ఫస్ట్ నైట్ రోజే ఇలాంటి ట్విస్ట్ పడుతుందని ఎవరూ ఊహించరు. అప్పుడేం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అరవింద్ పరిస్థితి ఏమిటనేది మిగతా కథ.

ఎనాలసిస్ ...

చాలా చిన్న పాయింట్ చుట్టూ అల్లుకొన్న కథ ఇది. శోభనం రోజు తన భార్య తన లవ్ స్టోరీని భర్తకు చెబితే ఏంటి పరిస్థితి అనేది. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ప్రధానం. బడ్జెట్ తక్కువ. స్క్రిప్ట్ తక్కువ ఉంటే చాలునుకున్నట్లున్నారు.

స్క్రిప్ట్ సరిగ్గా రాసుకుంటే ఈ సినిమా మంచి వెడ్డింగ్ కామెడీ అయ్యేది. అలా చేయకపోవడంతో అక్కడక్కడ నవ్వులు పండి ఓ మాదిరిగా మిగిలిపోయింది. అయితే డైరెక్టర్ రియలిస్టిక్ ఎప్రోచ్ తో మిడిల్ క్లాస్ మళయాళి ఫ్యామిలీలను, వాళ్ల పెళ్లి సరదాలను, సంబరాలను చూపెడుతూ ఆకట్టుకునేలా చేశారు. ప్రీ క్లైమాక్స్ ..క్లైమాక్స్ కామెడీ బాగుంది. కొద్దిగా తాగుడు సీన్స్ తగ్గిస్తే బాగుండేది.

అయితే ఎంత చేసినా ప్రిడిక్టబుల్ ఫ్యాక్టర్ సినిమాని మొదటి నుంచి నీడలా వెంటాడుతూ వచ్చింది. లేజీ రైటింగ్, అందుకు తగ్గ ఎగ్జిక్యూషన్ సినిమా జస్ట్ ఓకే సినిమాలా మార్చేశాయి. కొన్ని జోకులు కూడా సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో మిస్ ఫైర్ అయ్యాయి. హీరో,హీరోయిన్స్ దగ్గరనుంచి ప్రతి పాత్ర మన ఊహకు అందిస్తుంది. క్యారెక్టర్ ఆర్క్ కూడా చూసుకోలేదు. హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి పొటెన్షియల్ ఉన్నా వర్కవుట్ చేయలేకపోయారు.

టెక్నికల్ గా..

స్క్రిప్ట్ వీక్ గా ఉన్న ఈ సినిమాకు ...షిజూ భాస్కర్ సినిమాటోగ్రఫీ రీసెంట్ గా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంది. బిపిన్ అశోక్ పాటలు మాత్రం బాగోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...సింపుల్ నేరేషన్ ని ఎలివేట్ చేసేలా ఉంది.షెరిల్ ఎడిటింగ్ బాగుంది. లొకేషన్ నేచురల్ గా ఉన్నాయి.

చూడచ్చా

కామెడీ సినిమా కాబట్టి ఓ సారి చూడచ్చు. అసభ్యకరంగా లేదు కాబట్టి ఫ్యామిలీలతో ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ చూడచ్చు

'ఈటీవీ విన్' యాప్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story