మహేష్ బాబు “వారణాసి”లో టైమ్-ట్రావెల్ ట్విస్ట్!
x

మహేష్ బాబు “వారణాసి”లో టైమ్-ట్రావెల్ ట్విస్ట్!

రామాయణం—వర్తమానం—అంటార్కటికా

మహేశ్‌బాబు – రాజమౌళి కాంబోకు “వారణాసి” అనే టైటిల్ ఫిక్స్ చేసారు! అలాగే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో విడుదల చేసిన వీడియో… మాటలతో వర్ణించలేనంత స్కేల్‌లో ఉంది. రాజమౌళి ఈ వీడియోలో చూపించినది ఒక్క ప్రపంచం కాదు — యుగాల నుంచి యుగాలకు మారే ఒక మహా విశ్వం!

“వారణాసి” వీడియో గ్లింప్స్: రామాయణం నుంచి ఈ కాలం దాకా టైమ్-ట్రావెల్ చేసే రాజమౌళి విజన్!

భూలోకం నుంచి అంతరిక్షం దాకా…

చరిత్ర నుంచి పురాణాల దాకా…

ఖండాలు, ఆకాశం, గగనం…

రాజమౌళి ప్రతీ ఫ్రేమ్‌లో ఒక కొత్త నాగరికత!

ఈ గ్లింప్స్ చూసిన వారు ఒక్క మాటే చెబుతున్నారు:

“ఇది సినిమా కాదు… ఇమాజినేషన్‌కు లిమిట్ ఎక్కడో చూపించే విజువల్ ఎపిక్!”

మహేశ్‌బాబు as RUDHRA – రాముడి ఆత్మస్వరూపం?

వారణాసి యూనివర్స్‌లో మహేశ్‌బాబు “రుద్ర” గా దర్శనం ఇచ్చారు.

కానీ ట్విస్ట్ ఏంటంటే…

రాజమౌళి స్వయంగా చెప్పినట్టుగా ఈ కథ రామాయణంలోని ఒక కీలక ఘట్టానికి నేరుగా లింక్.

కాశీలో ఆయన పేరు రుద్ర అయినా,

కథలో ఆయన రూపం శ్రీరాముడి ఆత్మస్వరూపమా?

లేదా విష్ణు–రుద్ర మధ్య ఒక బ్రహ్మాండమైన సంధి ఉందా?

ఈ కాన్సెప్ట్‌నే ప్రేక్షకుల్లో హైయిస్టు క్యూయిరాసిటీ పీక్‌కి తీసుకెళ్లింది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి “వారణాసి” గ్లింప్స్‌ అంటే విజువల్స్ మాత్రమే కాదు—చరిత్ర, పురాణం, ఫ్యాంటసీ అన్నీ కలిసిపోయిన ఒక విజువల్ జలపాతం. వీడియో 512 CE వారణాసి నుంచి మొదలై… ఒక్కసారిగా అంటార్కిటికాలోని Ross Ice Shelf మీద శంభవి అనే అస్టరాయిడ్ పడే దృశ్యానికి కట్!

అక్కడి నుంచి ఆఫ్రికా వైల్డ్‌లో పారాషూట్‌తో దిగే ఓ రహస్య వ్యక్తి… తరువాత ఓ అండర్‌గ్రౌండ్ గుహలోకి దూకే రహస్య మహిళ.

తర్వాత సడెన్ టైమ్ జంప్ — నేరుగా త్రేతాయుగం (7200 BCE) లోకి! రామాయణ మహాసంగ్రామం… శ్రీరాముడు, ఆంజనేయుడు… వానరసేనతో ఏర్పడిన పిరమిడ్‌పై నిలబడి తీర్చిదిద్దుతున్న రామబాణం — ఇది గ్లింప్స్‌లోనే ఇంత స్కేల్ ఇస్తే, సినిమాలో ఎంత భారీగా ఉండబోతోందో చెప్పాల్సిన పనిలేదు.

మళ్లీ వర్తమానం — వారణాసి మణికర్ణిక ఘాట్.

ఇక్కడ మహేశ్ బాబు నందిపై ఎక్కి, చేతిలో త్రిశూలంతో కనిపించే షాట్ — ఆ మూమెంట్!

స్ట్రైట్ హింట్: మహేశ్ బాబు పాత్ర రుద్ర, అంటే శ్రీరాముడి ఆత్మస్వరూపం… ఒక రీఇంకార్నేషన్.

విజయేంద్ర ప్రసాద్–ఎస్‌.ఎస్‌. కాంచి రాసిన కథకు, రాజమౌళి స్క్రీన్‌ప్లే & డైరెక్షన్ జత కాగానే… “వారణాసి” ఇండియన్ సినిమా స్కేల్‌ని దాటి నేరుగా గ్లోబల్ లెవల్‌లోకి వెళ్లేలా కనిపిస్తోంది. పురాణం నుండి ఆధునిక కాలం దాకా — అనేక యుగాలను ఒకే నేరేటివ్ లో కుట్టిన మహా అంబిషస్ యూనివర్స్ ఇది.

అదే కాదు — పూర్తి IMAX ఫార్మాట్‌లో తీస్తున్న తొలి తెలుగు సినిమా!

ఇది సినిమా కాదు… ఒక విజువల్ సివిలైజేషన్!

రాజమౌళి విజువల్స్ = వరల్డ్ బిల్డింగ్ మాస్టర్‌క్లాస్

వీడియోలోని ఇంకో హైలైట్ —

VFX, గ్రాఫిక్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్… ఇండియన్ సినిమా లెవెల్‌ని దాటి హాలీవుడ్ టియర్‌కి వెళ్లాయి.

ప్రతి కట్‌లో:

యుగ మార్పులు

ఖండాల క్రాస్‌-జర్నీలు

పురాణ–చరిత్ర–సైన్స్ ఫిక్షన్ మిక్స్

రామాయణం + ప్రస్తుత కాలం బ్రిడ్జ్

ఇవన్నీ రాజమౌళి ఒరిజినల్ స్టైల్లో పేలిపోయాయి. ఈ గ్లింప్స్ చూసాక ఒక్క అంచనా మాత్రమె — రాజమౌళి వెండితెరపై ఒక దృశ్యకావ్యం నిర్మిస్తున్నారు. ఇది సినిమా కాదు…మన దేశపు మొదట MYTHO–COSMIC EPIC.

కె.ఎల్. నారాయణ & ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మిస్తున్న ఈ మహాప్రాజెక్ట్‌ 2027లో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More
Next Story