
‘మహావతార్ నరసింహ’
చిన్న బడ్జెట్ 10x లాభాలు వెనక అసలు రహస్యం?
ఈ రోజు ఫిల్మ్ సర్కిల్స్ లోనే కాకుండా సినిమా అభిమానుల్లో హాట్ టాపిక్ ఏదీ అంటే అది ‘మహావతార్ నరసింహ’. పూర్తిగా Made in India అని చెప్పుకోగల సత్తా ఉన్న సినిమా ఇది. మన పౌరాణిక ఇతిహాసాలతో, మన దేశంలోనే తయారైన యానిమేటెడ్ సినిమా అవటం ఈ సినిమా ప్రత్యేకత. రిలీజైన నాటీ నుంచి ప్రతీ రోజు బాక్స్‌ఆఫీస్‌లో ఒక్కో పేజీ చరిత్ర రాస్తోంది.
‘మహావతార్ నరసింహ’ ఒక పౌరాణిక యాక్షన్ మూవీ, ఇది అశ్విన్ కుమార్ డైరెక్టర్ డెబ్యూ. ఇది ఏడు పార్ట్స్ మహావతార్ సినిమా యూనివర్స్లో మొదటి భాగం. జూలై 25న రిలీజ్ అయిన ఈ సినిమా భారత్‌లో అత్యధికంగా కలెక్ట్ చేసిన కమర్షియల్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
2025లో మహావతార్ నరసింహ సూపర్ సెన్సేషన్‌గా మారింది. చిన్న బడ్జెట్ 3D యానిమేటెడ్ సినిమా అయినప్పటికీ వస్తున్న రెస్పాన్స్ భారీగా ఉంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్, సోషల్ మీడియా హాట్ డిస్కషన్స్ తో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. రివ్యూస్ మొదట యావరేజ్ గా ఉన్నప్పటికీ, ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి word-of-mouth explosive growth ఇచ్చి, ఫిల్మ్ థియేటర్ రన్ లో రికార్డ్ బ్రేకింగ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చింది.
ఈ సెన్సేషన్ కేవలం భాక్సాఫీస్ నెంబర్స్ కే పరిమితం కాకుండా ఒక కొత్త బిజినెస్ మోడల్ సృష్టించడంలోనూ కీలకంగా నిలిచింది. చిన్న బడ్జెట్‌తో మొదలైన ప్రాజెక్ట్, పర్ఫెక్ట్ మార్కెటింగ్, డబ్బింగ్, మల్టి లాంగ్వేజ్ రిలీజ్ లు,నాన్ థియేటర్ డీల్స్ ద్వారా 10x ROI సాధించింది, ఇండస్ట్రీ లోనూ,ట్రేడ్ లోనూ చర్చగా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమాకు కలిసొచ్చిన అంశాలేంటి, ఎందుకింత పెద్ద హిట్ అయ్యింది చూద్దాం.
‘మహావతార్ నరసింహ’ మన రోజువారీ యానిమేటెడ్ సినిమా కాదు. ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం, భారత్ యొక్క పౌరాణిక ఇతిహాసాలను పెద్ద తెరపై ఆధునిక సాంకేతికతతో జీవితం ఇవ్వడం. ఈ సినిమా హిరణ్యకశిపుడి కథను, ఆయన కుమారుడు ప్రహ్లాదుడు యొక్క భక్తిని భగవాన్ విష్ణుపై చూపిస్తుంది.
ఇది మనలో చాలా మందికి చిన్నతనంలోనే పరిచయం అయిన కథ – మన పెద్దవాళ్లు, నాయనమ్మలు, తాతయ్యలు, పెద్దమ్మలు మనకు భారతీయ పౌరాణిక ఇతిహాసాల కథలు చెప్తూ ఉంటారు. రామాయణం, మహాభారతం సినిమాలు, టెలివిజన్ సీరీస్, కామిక్ బుక్స్‌లో అందుబాటులో ఉంటాయి, కానీ భగవాన్ విష్ణుపై ఆధారపడి సినిమాలు చాలా తక్కువే.
ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అందరికీ, భారతీయ పౌరాణిక ఇతిహాసాలపై ఆధారపడిన ఓ పౌరాణిక గాధను పెద్ద తెరపై యానిమేటెడ్ సినిమా చూడటం ఒక విశిష్ట అనుభవం. ఇప్పటి సినిమాటిక్ ప్రపంచంలో, థియేటర్ స్క్రీన్లలో ఎక్కువగా పిల్లలకు చూడకూడని సినిమాలు ప్రదర్శింపబడుతున్న సమయంలో, ‘మహావతార్ నరసింహ’ ఒక అందరికీ సురక్షిత, సంతోషకరమైన ఆప్షన్ గా నడుస్తోంది.
ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు విశ్లేషకులు. భారతీయ పౌరాణిక సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైన మార్కెట్‌ను పొందుతూనే ఉన్నాయి. ఈ సినిమాల విజయం తో తెలిసే విషయం ఏమిటంటే, భూమిపై దేవుళ్లపై నమ్మకం, విశ్వాసం ఉన్నంతకాలం ఈ జానర్ ఎల్లప్పుడూ ఫలప్రదంగానే ఉంటుంది.
అలాగే “ఇలాంటి సినిమాలు సమూహ అనుభవం కోసం ఉంటాయి. ఇది ఆలయానికి వెళ్లడం లాంటిది గా భావిస్తారు. పిల్లలకు భారతదేశం, భారతీయ సంస్కృతిని కథల ద్వారా చెప్తూ పరిచయం చేసే అవకాశంగా నమ్ముతారు”
“Small budgets don’t limit impact; smart strategy multiplies it.”
మహావతార్ నరసింహ సెన్సేషన్ ద్వారా ఇండస్ట్రీకి ఒక సిగ్నల్ పంపింది: “సరైన ప్లాన్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్,వర్డ్ ఆఫ్ మౌత్,ఫ్రాంఛైజ్-రెడీ థింకింగ్” తో, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా పెద్ద లాభాలు సృష్టించగలవు.
కన్నడలో కొత్త టీమ్ రూపొందించిన మహావతార్ నరసింహ 3D యానిమేటెడ్ సినిమా 2025లో బాక్సాఫీస్‌లో సరికొత్త బిజినెస్ మోడల్ క్రియేట్ చేసింది. KGF ప్రొడ్యూసర్ హోంబాలే ఫిల్మ్స్ మద్దతుతో దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఫిల్మ్ డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్‌కు పెట్టిన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇవి రిటర్న్స్‌ను మల్టిప్లై చేసేవిధంగా ప్లాన్ చేయటం కలిసి వచ్చింది.
1. స్మార్ట్ బడ్జెట్ ప్లానింగ్:
ఫిల్మ్ మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు మాత్రమే. కానీ ఫలితం 10 రెట్లు లాభంగా మారింది. చిన్న బడ్జెట్ ఫిల్మ్‌కి పెద్ద మార్కెట్ రీచ్ ఇవ్వడం, అధిక ROI (Return on Investment) కి కావాల్సిన ఫెరఫెక్ట్ మోడల్.
2. నేషనల్ + లాంగ్వేజ్ విస్తరణ:
స్థానికంగా తయారైన ఈ సినిమాను అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసి, దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం మార్కెట్ ఎక్స్పోజర్‌ను మెక్సిమైజ్ చేసింది. "Global thinking starts with local excellence." అన్న విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.
3. వర్డ్ ఆఫ్ మౌత్ & కస్టమర్ ఎంగేజ్‌మెంట్:
రిలీజ్ రోజు టాక్ యావరేజ్ గా వచ్చినా, ప్రేక్షకుల పాజిటివ్ రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి డిస్కషన్స్ ఫిల్మ్ ట్రెండింగ్ అయ్యేందుకు కారణమయ్యాయి. ఈ మాదిరి “క్లిక్, లైక్, షేర్” ఫ్యాక్టర్ సినిమాని జనాల్లోకి చాలా స్పీడుగా తీసుకెళ్లింది. స్టీవెన్ స్పీల్ బర్గ్ చెప్పినట్లుగా ...“ఒక గొప్ప సినిమా తన ప్రేక్షకులను తానే వెతుక్కుంటుంది ”.
4. నాన్-థియేట్రికల్ రివెన్యూ మోడల్:
OTT, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాండ్ & మెర్చండైజ్ డీల్‌లను ముందుగానే ఫిక్స్ చేయడంతో ఫైనాన్షియల్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఈ “Revenue Pyramid” approach, సినిమాని కేవలం theatrical success గానే కాకుండా multi-platform profit center గా మార్చుతుంది.
5. ఫ్రాంచైజీ ప్రిపరేషన్:
మొదటి సినిమా సక్సెస్ తర్వాత ప్రాఛైంజ్ లకు భారీ బడ్జెట్ ప్లాన్. ఈ సినిమా తరహాలో డివోషనల్ ప్రాఛైంజ్ లు రాబోతున్నాయి. ఫ్రాంచైజీలు ఎప్పుడూ బడ్జెట్ ల నుంచి పుట్టవు; అవి సినిమా సక్సెస్ పై ఉనే్న నమ్మకం, అంచనాల నుంచి పుడతాయి.
హోంబేల్ ఫిల్మ్స్ సహ-స్థాపకుడు చలూవే గౌడ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు:
“మేము కేవలం ఓ సాహసోపేతమైన, కొత్త ప్రయత్నం చేస్తున్నాం అని అనుకున్నాం. కానీ దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమని అసలు ఊహించలేదు. యువత, వృద్ధులు – అందరూ మహావతార్ నరసింహను ఇంత ఉత్సాహంగా స్వీకరించడం నిజంగా హృదయాన్ని తాకుతోంది. మేము మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.”
ఏదైమైనా:
మహావతార్ నరసింహ సక్సెస్ కేవలం సృజనాత్మకతకు మాత్రమే కాక, బిజినెస్ వ్యూయింగ్‌లో కొత్త సొల్యూషన్స్ తీసుకువచ్చినదానికి కారణం. చిన్న బడ్జెట్ సినిమాల కోసం “వర్డ్ ఆఫ్ మౌత్ + మల్టీ ఫ్లాట్ ఫామ్ రెవిన్యూ +ఫ్రాంఛైజ్ ప్లానింగ్” అనే మోడల్‌ను చూపిస్తూ, ఇండస్ట్రీలో కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది.