మ్యాడ్ స్క్వేర్‌ మూవీ రివ్యూ
x

'మ్యాడ్ స్క్వేర్‌' మూవీ రివ్యూ

మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాలో కథేంటి, ఈ సారి ఈ టీమ్ హిట్ కొట్టిందా, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని పంచింది చూద్దాం.

ఇంతక ముందు వచ్చిన ‘మ్యాడ్‌’ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని క్యారక్టర్స్ ని , కథనాన్ని కొనసాగిస్తున్న తాజాగా వచ్చిన చిత్రమే ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాలో కథేంటి, ఈ సారి ఈ టీమ్ హిట్ కొట్టిందా, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని పంచింది చూద్దాం.

స్టోరీ లైన్

మొదటి పార్ట్ లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన దామోదర్‌ (సంగీత్‌ శోభన్‌), అశోక్‌ కుమార్‌ (నార్నే నితిన్‌), మనోజ్‌ (రామ్‌ నితిన్‌), లడ్డూ (విష్ణు ఓఐ) తమ సొంతూళ్లకు వెళ్లి జీవితాల్లో పడి పోతారు. అక్కడ లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్‌ ఎదురు కట్నం ఇచ్చి మరీ ఓ సంబంధం సెట్‌ చేస్తాడు. దాంతో లడ్డు తన ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పకుండా పెళ్లికి రెడీ అవుతాడు. కానీ, ఈ విషయం దామోదర్‌కు తెలియడంతో అశోక్, మనోజ్‌ను తీసుకొని నేరుగా లడ్డూ పెళ్లికి వచ్చేస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ పడుతుంది.

కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు మరో కుర్రాడితో వెళ్లిపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీంతో లడ్డుని ఆ బాధ నుంచి బయట పడేసేందుకు ఫ్రెండ్స్ అందరూ గోవాకు తీసుకెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేద్దామనుకునేలోగా సరిగ్గా అప్పుడే అక్కడి మ్యూజియంలో ఓ విలువైన లాకెట్‌ దొంగతనం జరుగుతుంది. అక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది.

ఆ లాకెట్ .. దామోదర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ చేతిలో పడటంతో వాళ్ల జీవితాలు గ్యాంగ్‌స్టర్‌ మ్యాక్స్‌ (సునీల్‌) చేతిలో పడతాయి. ఒక ఘటనలో ఆ లాకెట్‌ లడ్డు దగ్గరకు వస్తుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్‌ కిడ్నాప్‌ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఒకవైపు పోలీసులు, మరో వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?వాటి నుంచి ఎలా బయటపడ్డారు?అన్నది చిత్ర కథ.

విశ్లేషణ

ఎంత కామెడీ సినిమా అయినా బలమైన ఎమోషన్స్, దానికి తగ్గ డ్రామా లేకపోతే ఇబ్బందే. కేవలం రెండు చిన్న ఇన్సిడెంట్స్‌ను బేస్‌ చేసుకునే రెండు గంటల కథను నడిపించే ప్రయత్నం చేయడం ఇబ్బందుల్లో పడేసింది. దానికి తోడు ఎక్కడా ఎమోషన్స్ లేకపోవడం, కథలో బలమైన డ్రామా లేకపోవడం.. సెకండాఫ్ సాగతీతగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కామెడీనే ప్రధానంగా లాజిక్ లు పట్టించుకోకుండా చేసిన కథ ఇది. మొదటి పార్ట్ లాగానే లడ్డు పాయింటాఫ్ వ్యూలోనే కథ ప్రారంభం అవుతుంది. వరుస పంచ్‌లతో ఫస్టాఫ్ నవ్విస్తారు. అయితే సెకండాఫ్‌ కు వచ్చేసరికే కథ లో విషయం తక్కువై వినోదం పండటం తగ్గిపోతుంది. గోవా షిఫ్ట్‌ అయ్యాక కామెడీ డోస్ స్పీడ్‌ పెంచాడు దర్శకుడు. అయితే అది వేరే దారిలో వస్తున్నట్టు అనిపిస్తుంది. మ్యాక్స్‌ గ్యాంగ్‌ చేసే దొంగతనం మ్యాడ్‌ గ్యాంగ్‌కు చుట్టుకోవడం.

ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్‌ కిడ్నాప్‌ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్‌ చేసే ప్రయత్నాలు పెద్దగా నవ్వించవు. తెరపై పంచ్ లు పేలుతూంటాయి కానీ పెద్దగా నవ్వించవు. జస్ట్ ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా సత్యం రాజేష్‌ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్స్ కథలో కలవవు. ఫిల్ ఇన్ బ్లాంక్స్ అన్నట్లు ఆ బ్యాంగ్స్ అనిపిస్తూ ఎప్పుడు ముందుకు వెళ్తుందా కథ అనిపిస్తుంది. ఫస్టాఫ్ వెళ్లినట్లే సెకండాఫ్ కూడా వెళ్తే బాగుండేది. ఫస్ట్ పార్ట్ లో లాగానే మ్యాడ్‌ గ్యాంగ్‌కు ఉన్న చిన్న చిన్న లవ్‌స్టోరీలు.. వాళ్లు కాలేజీలో చేసే అల్లరి, హంగామా ఉంటాయనుకుంటే పెద్ద నిరాశ ఎదురౌతుంది.

టెక్నికల్ గా..

ఈ సినిమాకు స్క్రిప్టే ప్రధాన సమస్యగా కనబడుతుంది. అయితే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కామెడీ సీన్స్ చాలా భాగం ఆ లోటుని కనపడ నివ్వకుండా ముందుకు తీసుకెళ్తుంది. ఇక భీమ్స్‌ సంగీతం, తమన్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ లుగా నిలిచాయి. షామ్‌దత్‌ కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో ...నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, మనోజ్‌ తమకు అలవాటైన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి గెస్ట్ రోల్ లో కనిపించింది నవ్వించే ప్రయత్నం చేశారు.

చూడచ్చా

కథను పట్టించుకోకుండా నవ్వులు కోసం, ఫన్ తో వచ్చే పంచ్ డైలాగ్స్ కోసం చూడచ్చు.

నటీనటులు: నార్నె నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్, శుభలేఖ సుధాకర్‌, మురళీధర్‌ గౌడ్‌, తదితరులు

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌

నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్య

సమర్పకులు: ఎస్. నాగ వంశీ

ఎడిటింగ్: నవీన్ నూలి

దర్శకత్వం, కథ: కల్యాణ్‌ శంకర్‌

సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్

విడుదల: మార్చి 28, 2025

Read More
Next Story