2025 సెప్టెంబర్ :టాలీవుడ్ హిట్స్
x

2025 సెప్టెంబర్ :టాలీవుడ్ హిట్స్

బ్లాక్ బస్టర్స్ లిస్ట్

2025 ఆగస్ట్ నెల తెలుగు పరిశ్రమకు అంతంత మాత్రం రిజల్ట్ ఇచ్చింది. ఆగస్ట్ లో 14 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు.. మూడు డబ్బింగ్ చిత్రాలు తెలుగు లో సందడి చేశాయి. కానీ వాటిల్లో సంచలనాలు సృష్టించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.అంతకు ముందు నెలలతో పోల్చి చూస్తే సక్సెస్ రేట్ ఇంకా దారుణంగా పడిపోయింది.

ఉన్నంతలో జులై చివరి వారంలో రిలీజైన 'కింగ్డమ్' సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్ లో హవా కొనసాగించింది. డబ్బింగ్ యానిమేషన్ సినిమా అయినా 'మహావతార్ నరసింహ' కూడా మంచి నంబర్స్ తీసుకొచ్చింది. ఇవి బాక్సాఫీస్ కు కాస్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినా ట్రేడ్ కు కలిసివచ్చిందేమీ లేదు.

ఇక రజనీకాంత్, నాగార్జున నటించిన 'కూలీ'.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' డబ్బింగ్ సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. దీంతో సెప్టెంబర్ నెలలో విడుదల అయిన సినిమాలపైనే ట్రేడ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఊహించని విధంగా సెప్టెంబర్‌లో మాత్రం మూడింత‌ల ఆనందం చూసింది.

లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి ఒక్కటే కాదు – ఓజీ అదరగొట్టడంతో బాక్సాఫీస్‌కి కొత్త ఊపు వచ్చింది. చిన్న సినిమాల నుంచి స్టార్ స్టడెడ్ బ్లాక్‌బస్టర్స్ వరకు వరుస విజయాలు రావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కళ్ళల్లో లాంగ్ గ్యాప్ తర్వాత ఆనందం కనపడుతోంది. “టాలీవుడ్‌కి ఇప్పుడు జోష్ పీక్‌లో ఉంది, ఈ స్పీడు దీపావళి వరకు కొనసాగడం ఖాయం” అంటున్నారు సినీ వర్గాలు.

సెప్టెంబర్ రిలీజ్ లు, రిజల్ట్ లు

సెప్టెంబర్ 2025 తెలుగు పరిశ్రమకి నిజంగా కలల నెలైంది. ఒకవైపు ఊహించని హిట్స్, మరోవైపు స్టార్ పవర్‌తో రికార్డుల వర్షం కురిసింది. దేశీయంగా, ఓవర్సీస్‌లో కూడా తెలుగు సినిమాలు మోత మోగించాయి.

ఘాటి ఘోర పరాజయం – చిన్న సినిమా గెలుపు!

నెల ఆరంభంలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి: అనుష్క శెట్టి నటించిన "ఘాటి", యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "లిటిల్ హార్ట్స్", శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డబ్ ఫిల్మ్ "మద్రాసి".

క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ఘాటి, అంచనాలను భారీగా ఉన్నా…మినిమం ఓపెనింగ్ కూడా బాగాలేకపోయింది. టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద వైఫల్యాల్లో ఇది ఒకటి. మద్రాసి తమిళనాట సక్సెస్ అయినా, తెలుగు వెర్షన్‌కి కలిసిరాలేదు.

కానీ అతి పెద్ద సర్‌ప్రైజ్ "లిటిల్ హార్ట్స్". మౌళి తనుజ్ ప్రసాంత్ – శివాని నాగరం జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ, నిశ్శబ్దంగా రిలీజ్ అయి డబ్బులు వర్షంలా కురిసేలా చేసింది. అమెరికాలో కూడా ఈ మూవీ మిలియన్ డాలర్ మార్క్ దాటింది!

మిరాయ్ బ్లాక్‌బస్టర్ – కిష్కిందపురి నిలబడింది

రెండో వారాంతం బాక్స్ ఆఫీస్‌ను తలకిందులు చేసింది.

"మిరాయ్", తేజా సజ్జా హీరోగా వచ్చిన సూపర్‌హీరో సాగా, అద్భుతమైన విజయం సాధించింది. 150 కోట్ల రూపాయల కలెక్షన్‌తో టాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. తేజా సజ్జా కెరీర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన "కిష్కిందపురి" సగటు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. యావరేజ్ అనిపించుకుంది. అయినా, ఫ్లాఫ్ లలో ఉన్న హీరో – హీరోయిన్స్ (అనుపమా పరమేశ్వరన్)కి ఇది మంచి ఊరట.

ఓజీ థండర్: పవన్ కళ్యాణ్ రికార్డు!

సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్‌టైనర్ "ఓజీ", బాక్స్ ఆఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది.

ఓపెనింగ్ వీకెండ్‌లోనే 220 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు చేసి రికార్డులు చెరిపేసింది. అమెరికాలో మాత్రమే 5 మిలియన్ డాలర్లు సాధించి, పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఓవర్సీస్ గ్రాస్ కొట్టింది.

ఇప్పుడు "ఓజీ" = పవన్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రోసర్ అన్న టైటిల్ అందుకుంది!

పూర్తిగా పతనం అయినవీ ఉన్నాయి

మరుతి ప్రెజెంటేషన్‌లో వచ్చిన "బ్యూటీ", ఆడియన్స్ పూర్తిగా తిరస్కరించారు. తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన "భద్రకాళి" కూడా ఘోరంగా విఫలమైంది.

మొత్తంగా – సెప్టెంబర్ టాలీవుడ్ గోల్డెన్ మంత్!

సెప్టెంబర్ 2025 టాలీవుడ్‌కి కేవలం బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాదు… మోరేల్ బూస్ట్ కూడా ఇచ్చింది. చిన్న సినిమాలకైనా, జానర్ ఎక్స్‌పెరిమెంట్స్‌కైనా, స్టార్ పవర్‌కైనా — ఆడియన్స్ “గుడ్ కంటెంట్” ఉంటే హిట్ చేస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. సర్‌ప్రైజ్ హిట్స్, బ్లాక్‌బస్టర్స్, స్టార్ పవర్, రికార్డులు… ఇలా అన్నీ కలిసొచ్చి టాలీవుడ్‌కి చాలా కాలం తర్వాత ఇంత బంగారు నెలని తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 2025 – టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో గుర్తుండిపోతుంది!

లిటిల్ హార్ట్స్ చెప్పింది: స్మాల్ ఫిల్మ్, బిగ్ డ్రీమ్ సాధ్యమే.

మిరాయ్ చూపించింది: టాలీవుడ్ సూపర్‌హీరోలకు ఫ్యూచర్ ఉంది.

కిష్కిందపురి నిరూపించింది: అడ్వెంచర్, ఫాంటసీ కూడా మార్కెట్‌లో నిలబడగలవు.

ఓజీ చెబుతోంది: ఫ్యాన్ పవర్‌తో స్టార్ సినిమాలు ఎప్పుడూ మాజిక్ చేస్తాయి.

మొత్తానికి… “సెప్టెంబర్ – టాలీవుడ్‌కి బ్లాక్‌బస్టర్ పండుగ”

Read More
Next Story