ఫ్రస్టేషనా..? లేక పాఠాలు నేర్చుకున్నాడా?
x

కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలకు కారణం ఏమిటి..ఎవరు తనని పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు?

ఇవాళ సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం హాట్ టాపిక్ గా మారారు. అందుకు కారణం ఆయన తన తాజా చిత్రం ‘క ‘ప్రమోషన్ లో చాలా ఎమోషన్ అయ్యారు. తనను ట్రోల్ చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. ‘క ‘ సినిమా దీపావళి కానుకగా రేపు( గురువారం) విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ సైతం గట్టిగానే నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలకు కారణం ఏమిటి..ఎవరు తనని పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు?

సినిమా కెరీర్ అంటేనే అసలే ఎన్నో ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ పరుగెడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ ఎదుర్కోవడం మరో పెద్ద ఒత్తిడి అయిపోతోంది. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఒక్కోసారి ఆడదు. సినిమా ఆడకపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే అవన్నీ పట్టించుకోకుండా జనం ట్రోలింగ్ చేస్తూంటే ఆ హీరో లేదా హీరోయిన్ ఇటువంటి పరిస్థితులకు ఎంత తల్లడిల్లి ఉంటారు? అయితే తాను ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదనీ, సినిమాల మీదే దృష్టిపెట్టాననీ నవ్వుతూ చెప్పేస్తారు. కానీ తెలియకుండా లోలోపల వాళ్లు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటారు...దాంతో ఎంత కష్టం అనిపిస్తుంది? ఏదో రోజు బరస్ట్ అవుతారు. ఇప్పుడు అదే పరిస్దితి కిరణ్ అబ్బవరం కు ఎదురౌతోంది.

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. నటించిన మొదటి సినిమా 'రాజా వారు రాణి గారు'తో డీసెంట్ హిట్ సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా వరుసగా ఎనిమిది సినిమాలు తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాలన్నీ రకరకాల కారణాలతో బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లాపడటంతో దారుణమైన ట్రోలింగ్‌ని ఫేస్ చేశాడు. ఆ ఎనిమిది సినిమాల్లో మధ్య మధ్యలో వచ్చిన కొన్ని డీసెంట్ మూవీస్‌ని కూడా వదలలేదు కొందరు ట్రోలర్స్. అదే కిరణ్ అబ్బవరం ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. దాన్ని తన తాజా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయిటకు కక్కేసాడు. చాలా ఆవేదనతో చెప్పిన ఈ మాటలు చాలా మందిని కనెక్ట్ చేస్తున్నాయి.

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (Ka Movie). ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన సినిమాలపై పని కట్టుకొని కొన్ని సంస్థలు ట్రోల్ చేస్తున్నాయంటూ ఆవేశ పడ్డారు. తనను ట్రోల్స్ చేసే వారిపై మండిపడ్డాడు.

ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను చేసే సినిమాలు నచ్చుతాయ్.. కొన్ని పోతాయ్.. అసలు మీ బాదేంటి.. నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి.. ఈ విషయం చెప్తే కచ్చితంగా కొంతమంది నా మీద పగబడతారు. అయినా నేను చెప్తా.. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా, బాధపడ్డ. ఒక సినిమాలో నా మీద ట్రోల్స్ చేసారు. ఏదో ఫిలిమ్స్ చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నా వాళ్లకి ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. ఎందుకండి నా మీద.. మిమల్ని నేను ఏం అడుగుతున్నాను. అసలు డైరెక్ట్ గా సినిమాలో ట్రోలింగ్ చెయ్యడం ఏంటి.. అది కూడా నా అనుమతి లేకుండా.. అలా ఎలా చేస్తారండి.. నేను చేసింది 8 సినిమాలు. అందులో 4 డీసెంట్ సినిమాలు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. 4 సినిమాలు హిట్ అవ్వడమంటే జోక్ కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోస్ నుండి, అభిమానుల నుంచి కిరణ్ కి మద్దతు పెరుగుతోంది. వాస్తవానికి ఎదుటివారిని విమర్శించడం, వెక్కిరించడం అనేది సొసైటిలో ఎప్పుడూ ఉన్నదే. ఒకప్పుడు స్నేహితుల నుంచి, దూరపు బంధువుల నుంచి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఇది డిజిటల్‌ ఫార్మాట్‌కు మారింది. కంప్యూటర్‌ తెర వెనుక ఉన్నాం, మనల్ని ఎవరూ గమనించరు అనే నమ్మకంతో కొందరు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇటువంటి ట్రోలింగ్‌కు సినిమా వాళ్లు ఎక్కువగా గురికావాల్సి వస్తోంది.

నిజానికి ఆన్‌లైన్‌లో ఇలా ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజజీవితంలో ‘ఐడెంటిటీ క్రైసిస్‌’తో బాధపడుతుంటారు. ఏదోవిధంగా అందరూ తనను గుర్తించాలి అనే ఆలోచనతో ఉంటారు. సొంతంగా ఏదైనా సాధించి ఆ గుర్తింపు పొందే యోగ్యత లేనివారు.. అప్పటికే ఏదో విధంగా విజేతలైన వారిని విమర్శించడం ద్వారా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఎవరికైనా ప్రాముఖ్యం పెరుగుతుందని అనిపిస్తే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్‌లు, కామెంట్లు, షేర్ల కోసం అవతలివారు మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక లోపం అంటారు మానసిక విశ్లేషకులు.

అది ప్రక్కన పెడితే ఇంతకీ కిరణ్ అబ్బవరం దాన్ని పాజిటివ్ గా తీసుకుని, ప్రష్టేషన్ తగ్గించుకుని ముందుకు ఎదుగుతాడా అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఆయన తాజా భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (Ka Movie)విషయానికి వస్తే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపినింగ్స్ బాగుంటాయనిపిస్తోంది. ఇన్నాళ్లూ తన ప్లాఫ్ లకు కారణం వైవిధ్యం లేకుండా ఊకదంపుడు రొట్టకొట్టుడు సినిమాలు చేయటమే అని గ్రహించినట్లున్నాడు. ఆ విషయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రోలర్స్ దూరంగా ఉంటాడనిపిస్తోంది. ఏదైమైనా కిరణ్ అబ్బవరం తిట్టుకుంటూ నిలబడటం కాదు, తట్టుకుని నిలబడాలి. ఇది సాధన చేయడం ద్వారా కెరీర్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కో గలరనేది నిజం.

సినిమా కెరీర్ అంటేనే అసలే ఎన్నో ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ పరుగెడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ ఎదుర్కోవడం మరో పెద్ద ఒత్తిడి అయిపోతోంది. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఒక్కోసారి ఆడదు. సినిమా ఆడకపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే అవన్నీ పట్టించుకోకుండా జనం ట్రోలింగ్ చేస్తూంటే ఆ హీరో లేదా హీరోయిన్ ఇటువంటి పరిస్థితులకు ఎంత తల్లడిల్లి ఉంటారు? అయితే తాను ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదనీ, సినిమాల మీదే దృష్టిపెట్టాననీ నవ్వుతూ చెప్పేస్తారు. కానీ తెలియకుండా లోలోపల వాళ్లు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటారు...దాంతో ఎంత కష్టం అనిపిస్తుంది? ఇప్పుడు అదే పరిస్దితి కిరణ్ అబ్బవరం కు ఎదురౌతోంది.

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. నటించిన మొదటి సినిమా 'రాజా వారు రాణి గారు'తో డీసెంట్ హిట్ సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా వరుసగా ఎనిమిది సినిమాలు తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాలన్నీ రకరకాల కారణాలతో బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లాపడటంతో దారుణమైన ట్రోలింగ్‌ని ఫేస్ చేశాడు. ఆ ఎనిమిది సినిమాల్లో మధ్య మధ్యలో వచ్చిన కొన్ని డీసెంట్ మూవీస్‌ని కూడా వదలలేదు కొందరు ట్రోలర్స్. అదే కిరణ్ అబ్బవరం ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. దాన్ని తన తాజా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయిటకు కక్కేసాడు. చాలా ఆవేదనతో చెప్పిన ఈ మాటలు చాలా మందిని కనెక్ట్ చేస్తున్నాయి.

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (Ka Movie). ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన సినిమాలపై పని కట్టుకొని కొన్ని సంస్థలు ట్రోల్ చేస్తున్నాయంటూ ఆవేశ పడ్డారు. తనను ట్రోల్స్ చేసే వారిపై మండిపడ్డాడు.

ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను చేసే సినిమాలు నచ్చుతాయ్.. కొన్ని పోతాయ్.. అసలు మీ బాదేంటి.. నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి.. ఈ విషయం చెప్తే కచ్చితంగా కొంతమంది నా మీద పగబడతారు. అయినా నేను చెప్తా.. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా, బాధపడ్డ. ఒక సినిమాలో నా మీద ట్రోల్స్ చేసారు. ఏదో ఫిలిమ్స్ చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నా వాళ్లకి ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. ఎందుకండి నా మీద.. మిమల్ని నేను ఏం అడుగుతున్నాను. అసలు డైరెక్ట్ గా సినిమాలో ట్రోలింగ్ చెయ్యడం ఏంటి.. అది కూడా నా అనుమతి లేకుండా.. అలా ఎలా చేస్తారండి.. నేను చేసింది 8 సినిమాలు. అందులో 4 డీసెంట్ సినిమాలు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. 4 సినిమాలు హిట్ అవ్వడమంటే జోక్ కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోస్ నుండి, అభిమానుల నుంచి కిరణ్ కి మద్దతు పెరుగుతోంది. వాస్తవానికి ఎదుటివారిని విమర్శించడం, వెక్కిరించడం అనేది సొసైటిలో ఎప్పుడూ ఉన్నదే. ఒకప్పుడు స్నేహితుల నుంచి, దూరపు బంధువుల నుంచి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఇది డిజిటల్‌ ఫార్మాట్‌కు మారింది. కంప్యూటర్‌ తెర వెనుక ఉన్నాం, మనల్ని ఎవరూ గమనించరు అనే నమ్మకంతో కొందరు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇటువంటి ట్రోలింగ్‌కు సినిమా వాళ్లు ఎక్కువగా గురికావాల్సి వస్తోంది.

నిజానికి ఆన్‌లైన్‌లో ఇలా ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజజీవితంలో ‘ఐడెంటిటీ క్రైసిస్‌’తో బాధపడుతుంటారు. ఏదోవిధంగా అందరూ తనను గుర్తించాలి అనే ఆలోచనతో ఉంటారు. సొంతంగా ఏదైనా సాధించి ఆ గుర్తింపు పొందే యోగ్యత లేనివారు.. అప్పటికే ఏదో విధంగా విజేతలైన వారిని విమర్శించడం ద్వారా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఎవరికైనా ప్రాముఖ్యం పెరుగుతుందని అనిపిస్తే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్‌లు, కామెంట్లు, షేర్ల కోసం అవతలివారు మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక లోపం అంటారు మానసిక విశ్లేషకులు.

అది ప్రక్కన పెడితే ఇంతకీ కిరణ్ అబ్బవరం దాన్ని పాజిటివ్ గా తీసుకుని, ప్రష్టేషన్ తగ్గించుకుని ముందుకు ఎదుగుతాడా అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఆయన తాజా భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (Ka Movie)విషయానికి వస్తే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపినింగ్స్ బాగుంటాయనిపిస్తోంది. ఇన్నాళ్లూ తన ప్లాఫ్ లకు కారణం వైవిధ్యం లేకుండా ఊకదంపుడు రొట్టకొట్టుడు సినిమాలు చేయటమే అని గ్రహించినట్లున్నాడు. ఆ విషయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రోలర్స్ దూరంగా ఉంటాడనిపిస్తోంది. ఏదైమైనా కిరణ్ అబ్బవరం తిట్టుకుంటూ నిలబడటం కాదు, తట్టుకుని నిలబడాలి. ఇది సాధన చేయడం ద్వారా కెరీర్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కో గలరనేది నిజం.

Read More
Next Story