రూరల్ కామెడీ : కీర్తి సురేష్  ‘ఉప్పు కప్పురంబు’ రివ్యూ
x

రూరల్ కామెడీ : కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ రివ్యూ

ఈ చిత్రం ఎలా ఉంది. అసలు కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం!

వెండితెరపై తనదైన వైభోగం చూపిస్తూ, ‘మహానటి’ తరువాత ప్రతి పాత్రకు ప్రాణం పోస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తూ ముందుకు వెళ్తోంది కీర్తి సురేష్. అలాంటి ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తోందంటేనే ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఆ పాత్రలో ఏముంటుంది? కథ ఎలా మలుపులు తిరుగుతుంది? అనే ఉత్కంఠ ఏర్పడుతుంది. మరో ప్రక్క సుహాస్ ..విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిపి నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఎలా ఉంది. అసలు కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం!

స్టోరీ లైన్

1992లో 'చిట్టి జయపురం' అనే చిన్న ఊళ్లో ఉన్న అపూర్వ (కీర్తి సురేశ్) చుట్టూ ఈ కథ జరుగుతుంది. తండ్రి సుబ్బరాజు (శుభలేఖ సుధాకర్) చనిపోవటంతో అపూర్వ (కీర్తి సురేశ్) తప్పనిసరిపరిస్దితుల్లో ఆమె ఊరి పెద్ద అవుతుంది. అయితే ఆమెను పెద్ద చేయటం ఆ ఊళ్లో ఉన్న భీమయ్య (బాబూ మోహన్) , మధుబాబు (శత్రు)ల కి గిట్టదు. ఆమెను తప్పించేసి తామే పెద్ద అవ్వాలని వాళ్ల కోరిక. అందుకోసం ఏవేవో స్కెచ్ లు వేస్తూంటారు.

ఇదిలా ఉంటే ఆ ఊరికి ఓ విచిత్ర సిట్యువేషన్ వస్తుంది. ఆ ఊళ్లో శ్మశానం భూమి కొరత వస్తుంది. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుంది. ఆ విషయం అపూర్వ దాకా వస్తుంది. అప్పుడు ఆమె కాటికాపరి చిన్న (సుహాస్‌) సాయింతో కలిసి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతికింది?ఈ సమస్యను పెద్ద చేసి లబ్ది పొందాలనుకున్న భీమయ్య, మధు బాబు ఏం చేస్తారు. చివరకు అపూర్వ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఈ సమస్యను పరిష్కరించింది ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

విషయం తక్కువైనప్పుడే విశ్లేషణ ఎక్కువ అవుతుందని అంటారు. అలాగే ఈ సినిమాలో విషయం చాలా చిన్నది. దాన్నీ సాగతీసి పెద్దది చేసి సినిమా స్క్రిప్టుగా చేసే క్రమంలో పాయింట్ పలచబడిపోయింది. వాస్తవానికి ఈ కథలో underlying concept బలంగా ఉంది. కానీ స్క్రీన్‌ప్లే దానికి సరిగా నిర్మాణం ఇవ్వలేకపోయింది. కథలో ప్రధాన సమస్య "శ్మశానంలో కేవలం నాలుగు స్థలాలు మిగిలాయి." ఇది ఒక low-stakes conflict . అలాంటప్పుడు కథలో దాన్ని life-and-death dilemma గా చూపించాలి. అలా కాకుండా, హాస్యపు స్కిట్‌లతో ప్రారంభమై సరైన ఎమోషనల్ హుక్‌ను ఇవ్వకుండానే ముందుకు తీసుకువెళ్లారు. దాంతో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఫీల్ కలుగుతుంది. ఇబ్బందికరమైన set-ups, uneven tone మన దృష్టిని ప్రక్కకి తప్పిస్తూంటాయి.

ఇక సెకండ్ హాఫ్ లో కాస్తంత క్లారిటీ, ఎమోషన్, సామాజిక చర్చ కనిపిస్తాయి. క్లైమాక్స్ లో చిన్నా-అపూర్వ కలిసి తీసుకునే నిర్ణయం, ఊరి ప్రజల స్పందన – ఇవన్నీ ఒక payoffలా ఫీల్ అవుతాం. కానీ వాటికి groundwork కొద్దిగా తక్కువ. స్క్రీన్‌ప్లే ప్రారంభంలో వేసిన బీజాలు సెకండాఫ్ లో మొలకెత్తినప్పటికీ, గొప్పగా నిలబడలేకపోయాయి. అందుకు కారణం ఇదో ఫార్స్ గా అనిపించటమే. ఎక్కడా ఇది నిజంగా జరుగుతున్న కథ అనే ఫీల్ తేలకపోయారు.

కథలో చిన్నా (సుహాస్) పాత్రకి ఉన్న ఇంటర్నల్ మోటివ్ — తన తల్లి చివరి కోరికను నెరవేర్చాలనే కోరిక చాలా బలమైనదే. కానీ దాన్ని సినిమా ప్రారంభంలోనే బలంగా స్థాపించకపోవడం వల్ల, ప్రేక్షకుడు పూర్తిగా ఆ పాత్రతో కనెక్ట్ కాలేడు. అయితే ఉన్నంతలో క్లైమాక్స్ కాస్త బలంగా,ఇంట్రస్టింగ్ గా ఉంది. దానికి న్యాయం చేసారు.

"Great stories are not about events, they’re about decisions." – Aaron Sorkin

టెక్నికల్ గా ...

దివాకర్ మణి సినిమాటోగ్రఫీ .. రాజేశ్ మురుగేశన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కథకి తగినట్టుగానే సాగాయి. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో సాగ తీతీను తొలిగించి ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకత్వం అనుభవం ఉన్న చెయ్యే కాబట్టి నడిచిపోయింది. అయితే కథకు తగ్గ టోన్ సరిగ్గా సెట్ చేయలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

నటీనటుల్లో ...కీర్తి సురేశ్ మరీ సన్నగా కనిపించింది.అయితే గ్రామీణ అమ్మాయిగా లుక్ కొత్తగా కనిపించింది. ప్రారంభంలో ఆమె నటన కాస్తంత అతిగా అనిపిస్తుంది. సుహాస్ .. బాబూ మోహన్ .. శుభలేఖ సుధాకర్ .. తాళ్లూరి రామేశ్వరి అంతా బాగానే చేశారు.

ఫైనల్ థాట్ :

ఉప్పు కప్పురంబు ఓ మంచి కాన్సెప్టుతో మొదలై, సాగి..సాగి.. చివరి 30 నిమిషాల్లో అసలు ఉప్పు-కప్పురంబు రుచిని చూపిస్తుంది. కానీ అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే. స్క్రీన్‌ప్లే మరింత సూటిగా, తక్కువ డ్రాగ్‌తో ఉండివుంటే — ఈ సినిమా మరింత బాగుండేది. ఇది స్టోరీ టెల్లింగ్ సమస్యే.

చూడచ్చా

కీర్తి సురేష్ గురించి ఓ లుక్కేయచ్చు. అక్కడక్కడా కాసేపు నవ్వుకోవటానికి బాగానే ఉంది. ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకపోతే ఓకే.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో తెలుగులో ఉంది.

Read More
Next Story