డార్క్ కామెడీ  బ్లడీ బెగ్గర్ రివ్యూ
x

డార్క్ కామెడీ 'బ్లడీ బెగ్గర్' రివ్యూ

వరుణ్ డాక్టర్, జైలర్ చిత్రాలతో డైరక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ అంటే తెలుగు వారికి కూడా ఇష్టమైన డైరక్టర్ అయ్యిపోయారు.

వరుణ్ డాక్టర్, జైలర్ చిత్రాలతో డైరక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ అంటే తెలుగు వారికి కూడా ఇష్టమైన డైరక్టర్ అయ్యిపోయారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అంటే కచ్చితంగా అంచనాలు ఉంటాయి. అందులోనూ నెల్సన్ ..డార్క్ కామెడీ స్కూల్ నుండి వచ్చిన తన శిష్యుడు శివబాలన్ ముత్తుకుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతుండటంతో ఖచ్చితంగా సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, నెల్సన్ దగ్గరుండి చూసుకుంటాడు అనే నమ్మకం ఆడియన్స్ లో కలిగింది. ఆ నమ్మకం నిలబెట్టుకున్నారా దర్శక,నిర్మాతలు. బ్లడీ బిచ్చర్ కథేంటి, సినిమా చూడదగ్గదేనా చూద్దాం.

స్టోరీ లైన్

ఓ బిచ్చగాడు అనుకోని పరిస్థితుల్లో ఓ భవంతిలో చిక్కుకుపోతే..అక్కడ ఆస్థి కోసం ప్రాణాలు తీసుకునే మనుష్యులు ఉంటే ఏం జరుగుతుందనేదే కథ. చెన్నై సిటీలో ఒక బిచ్చగాడు (కవిన్) . అతని తోడుగా తనకు దొరికిన ఒక చిన్న బాబు జాక. బిచ్చగానే కానీ కాస్తంత మోడ్రన్..అంటే ఈ కాలం బ్యాచ్ అన్నమాట. అతను డెలివరీ యాప్స్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టుకోగలడు. సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టుకుని డాన్స్ వేస్తుంటాడు. ఒకరోజు అతనికి భిక్షం దొరకదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఒక పెద్దింట్లో అన్నదానం కోసం మనిషి తగ్గాడని ఈ బిచ్చగాడిని తీసుకెళ్తారు కొందరు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక బిచ్చగాళ్లందరూ వెళ్లిపోతారు.

కానీ కళ్లకెదురుగా ఉన్న పెద్ద భవనం నచ్చడంతో ఆ ఇంట్లోకి దొంగతనంగా దూరతాడు ఈ బిచ్చగాడు. ఆ ఇంటికి ఆటోమేటిక్ లాక్ ఉండటంతో కానీ ఆ బిల్డింగ్ లో లాక్ అయిపోతుంది. అదే ఇంట్లో ఇంకొందరు ఉన్నారని తెలుసుకుంటాడు. అయితే అక్కడున్న వాళ్ల నుంచి ప్రపోజల్ వస్తుంది. బిచ్చగాడిని ఆ ఇంటికి వారసుడు అని చెప్తా ప్రాణాలతో వదిలేస్తామని చెప్తారు. అసలు ఆ భవంతిలో ఉన్నది ఎవరు.. ఇరుక్కుపోయిన ఆ బిచ్చగాడు బయిటపడ్డాడా...అసలు ఆ ఇంట్లో ఉన్న వాళ్లకి ఆ బిచ్చగాడికి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ‘బ్లడీ బెగ్గర్’ చూడాల్సిందే.

ఎలా ఉంది

సినిమా ప్రారంభం ఇంట్రస్టెంట్ గానే ప్రారంభమవుతుంది. బిచ్చగాడు క్యారెక్టరైజేషన్ గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే అయితే బిచ్చగాడు నుంచి మామూలు గెటప్ లోకి వచ్చేస్తాడో, ఆ ఇంట్లో ఇరుక్కుపోతాడా..అక్కడ నుంచి సినిమా నార్మల్ అయ్యిపోయింది. అక్కడ బిచ్చగాడు ఇరుక్కుంటే ఏమిటి..వేరే వాళ్ళు ఇరుక్కుంటే ఏమిటి అనిపిస్తుంది. బిచ్చగాడే ఇరుక్కోవటం వల్ల స్పెషల్ గా వచ్చే ఎడ్వాంటేజ్ లతో సినిమా నడవలేదు.

అలాగే ఆ తర్వాత వరస పెట్టి ఆ భవంతిలో జరిగే హత్యల్లో హీరో ఇరుక్కుపోవటం దాకా సెటప్ బాగానే చేశారు కానీ దాన్నుంచి బయటపడటానికి అతను ఏమీ చేయకపోవడంతో సెకండాఫ్ మొత్తం బాగా ల్యాగ్ గా బోరింగ్ గా మారిపోయింది. ఎంత డార్క్ కామెడీ అయినా వరసపెట్టి హత్యలు తప్పించి ఏమీ జరగకపోవడంతో నవ్వు రాదు...అసలు ఏమీ అనిపించదు. ఎందుకంటే బిచ్చగాడు పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయాడు అనిపించదు. అసలు అతను చుట్టూనే కథ తిరగదు. ఆ ఇంట్లో ఉండే మిగతా క్యారక్టర్స్, వాళ్ల ప్లాష్ బ్యాక్ లే సినిమాకు ప్రధానంగా కనిపిస్తాయి. క్లైమాక్స్ లో మరీ తమిళ అతి ఎక్కువగా ఉంది.

ఎవరెలా చేసారు

సినిమాలో ఎమోషనల్ సీన్లు లో కవిన్ బాగా చేసారు. అయితే అనుకున్న కామెడీ పండలేదు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ మీద నెల్సన్ ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. నటుల క్లోజప్ షాట్లు అయితే నెల్సన్ ఇంపాక్ట్ కనిపించింది. అయితే సినిమా స్క్రిప్టు దశలోనే సమస్య ఉండటంతో ఎంత బాగా డైరెక్ట్ చేసినా ఫలితం కనపడలేదు. మిగతా టెక్నీషియన్స్ కూడా పెద్ద సినిమాకు పనిచేసినట్లు అవుట్ ఫుట్ ఇచ్చారు.

చూడచ్చా

మరీ డెస్పరేట్ వెంటనే చూడాల్సిన సినిమా కాదు కానీ ఓటీటీలో వచ్చాక చూడచ్చు

ఎక్కడ ఉంది

ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో ఉంది.. ఓ నెల లోపు ఓటిటి లో వస్తుంది.

Read More
Next Story