కాంతారా-1, లోకా: థియేటర్‌లో పూనకం… ఓటీటీలో పాజ్ బటన్!
x

కాంతారా-1, లోకా: థియేటర్‌లో పూనకం… ఓటీటీలో పాజ్ బటన్!

మాస్ ర్యాంపేజ్ నుంచి ఓటీటీ రియాలిటీ చెక్


థియేటర్‌లో దుమ్మురేపిన ప్రతీ సినిమా… ఓటీటీలో అదే రేంజ్ రిజల్ట్ రావాలి అనే రూల్ లేదు. అక్కడ హిట్ అయ్యినవి..ఇక్కడ వర్కవుట్ కానివి ఉన్నాయి. అలాగే అక్కడ డిజాస్టర్ అయ్యినవి..ఓటిటిలో సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి. జాతిరత్నాలు వంటి సినిమాలు ఓటీటీలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇదే విషయం మరో సారి రుజుంది. వందల కోట్ల వసూళ్లు, ఇండస్ట్రీ హిట్ స్టేటస్… కానీ ఓటీటీలో మాత్రం “అంతేనా?” అని నెటిజన్స్ తల పట్టుకుంటున్నారు.

తాజాగా ప్రైమ్‌లోకి వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్స్ ‘లోక’, ‘కాంతార చాప్టర్ 1’ పరిస్థితి ఇదే. థియేటర్స్‌లో ఊహించలేని హైప్, హై సక్సెస్.. కానీ డిజిటల్ రిలీజ్‌ తర్వాత కామెంట్స్ మాత్రం షాక్!

ముఖ్యంగా కాంతార చాప్టర్ 1 పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ ఇంటెన్స్ డ్రామా అక్టోబర్ 2న రిలీజ్ అయి 600+ కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్స్‌లో కూడా రన్ అవుతున్నప్పటికీ… ఓటీటీలో చూసిన వాళ్ళు తమకు నచ్చలేదని అంటున్నారు.

“ఏముంది సినిమాలో? హైప్ అంత ఎందుకు?”

“కాంతారే బెటర్… ఇది ఓవర్ రేటెడ్!”

“లాస్ట్ 40 మినిట్స్‌ తప్ప ఏం లేదు… కామెడీ కూడా సో-సో!”

అని కామెంట్స్ వరద. కొందరు మాత్రం

“రిషబ్ డెడికేషన్, టేకింగ్ క్లాస్… స్క్రీన్‌ప్లే మాత్రం స్లో!”

అంటూ సాఫ్ట్ రివ్యూస్ ఇస్తున్నారు.

థియేటర్‌లో హడావిడి ఒకటి… ఓటీటీలో చూసే రియాలిటీ ఇంకోటి అని ఈ ఉదాహరణ మళ్లీ చూపించింది. అయితే అందుకు కారణం ఏమై ఉండచ్చు.కాంతారా- చాప్టర్, లోకాలాంటి సినిమాలు థియేటర్‌లో పూనకం తెప్పించేంతగా పనిచేసినా, ఓటీటీలో అదే ప్రభావం కనపడకపోవడానికి కొన్ని లోతైన సినీ-సైకాలజికల్ కారణాలు ఉన్నాయి. ఇది "ఓటీటీ vs థియేటర్" అనే మ్యాప్ కంటే, ఫార్మ్, స్కేల్, టోన్ గురించే.

థియేటర్ అనుభవం vs రూమ్-అనుభవం

థియేటర్ = Ritually Immersive Experience

డార్క్ రూమ్, భారీ స్క్రీన్, సౌండ్ పల్స్, కలెక్టివ్ ఎనర్జీ (అప్లాజ్, విజిల్స్, శ్వాస కూడా సింక్ అవుతుంది). ఇంటెన్స్, మిస్టికల్, మానవ-ప్రకృతి సంఘర్షణను చెప్పే కాంతారాలాంటి సినిమాలు ఈ వాతావరణంలో పవిత్ర అనుభూతిలా పనిచేస్తాయి. లోకా కూడా కామిక్-ఫాంటసీ థియేటర్ వైబ్‌లో పండుతుంది.

ఓటీటీ = Private, Analytical Viewing

మొబైల్/లాప్‌టాప్/TV చూస్తాము. ఇంట్లో డిస్ట్రాక్షన్స్, మధ్యలోనే ఆపేసి మళ్లి ఎప్పుడో గ్యాప్ తీసుకుని మొదలెట్టడం, పాజ్, రీవైండ్, స్కిప్, సైలెంట్ జడ్జ్‌మెంట్ మోడ్. ఈ క్రమంలో థియేటర్‌లో “అద్బుతం”గా అనిపించిన హై పాయింట్లు, ఓటీటీలో విజువల్ ట్రాన్స్ గా అనిపించవు. చాలా సార్లు ఓటీటీలలో మనం కథను అనుభవించకుండా, విమర్శిస్తూ చూస్తాము.

కాంతారా ఒక దైవ-పౌరాణిక శక్తి మీద నడిచే కథ. థియేటర్‌లో ఇది మతానుభూతి + విజువల్ ఫోకస్ + కలెక్టివ్ ఎమోషన్ కారణంగా మనకు బాగా దగ్గరైన సినిమాగా అనిపిస్తుంది. ఓటీటీలో “ఇది ఏమంత గొప్ప?” అనిపిస్తుంది. ఓటీటీలో చూసేవారు స్లో-బర్న్ సీన్స్ కి ఓపికగా చూడటం లేదు; వారు నేరుగా డోపమిన్ కోరుకుంటున్నారు.

ఫైనల్ గా...

థియేటర్ అనేది ప్రేక్షకుడుకి దేవాలయం.

OTT ప్రేక్షకుడి కోర్ట్‌రూమ్

ఒకరు అనుభూతిని వెదకతారు

మరొకరు justification వేస్తారు

ఈ రెండు చోట్లా చూసే సినిమా ఒకటే కావచ్చు , కానీ ఫలితం మాత్రం చాలా సార్లు ఒకటే కాదు.

మరి.. మీరు కాంతార చాప్టర్ 1 ఓటీటీలో చూశారా? మీకెలా అనిపించింది?

Read More
Next Story