కన్నడ సినీ పరిశ్రమ ఆశలన్నీ ‘కాంతారా’, ‘టాక్సిక్’ పైనే..
ఈ సంవత్సరం విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలు
కన్నడ చిత్రపరిశ్రమకు 2024 వ సంవత్సరం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. అయితే ఏడాది చివరిలో విడుదలైన రెండు చిత్రాలు మాత్రం ఇండస్ట్రీకి కాస్త ప్రాణం పోశాయి. అందులో ఉపేంద్ర దర్శకత్వం వహించిన ‘ యూఐ’ అలాగే కిచ్చా సుదీప్ నటించిన ‘మాక్స్’ సినిమా ఇండస్ట్రీకి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాయి.
ఈ సినిమాకు విజయ్ కార్తికేయ్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ కావడంతో కన్నడలో మంచి ఒపెనింగ్స్ అందుకుంది. ఇటీవల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న కన్నడ చిత్రపరిశ్రమ ఈ రెండుచిత్రాలు తిరిగి పునర్జీవాన్ని పోశాయని పేర్కొనవచ్చు.
మంచి కథ, కథనాలు, అందుకు తగ్గ స్ఠార్ నటులు ఉంటే ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వస్తారని ఈ రెండు చిత్రాలు నిరూపించాయి. ఈ రెండు చిత్రాలలో మాక్స్ 2024 లో కన్నడ సినిమాల తరఫున మంచి ఒపెనింగ్స్ ను రాబట్టి కొత్త రికార్డును తన పేరున లిఖించుకుంది.
యూఐ సినిమాతో ఉపేంద్ర తిరిగి దర్శకుడిగా కమ్ బ్యాక్ ఇచ్చారు. ‘‘ మాక్స్, యూఐ కన్నడ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్ లు పని చేశాయి. ఈ సంవత్సరంలో మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో లోకల్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి’’ అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎం నరసింహులు చెప్పారు.
కొత్తగా రానున్న 20 సినిమాలు...
రాబోయే వారాల్లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కొత్త సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. అందులో చిన్న, పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో పెద్దది కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కబోతున్న ‘‘ కాంతారా -1 ’’ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తరువాత పాన్ ఇండియా మాస్ స్టార్ యశ్ నటించిన ‘‘ టాక్సిక్’’ రాబోతోంది. ఈ వరుసలో హత్య కేసులో చిక్కుకున్న దర్శన్ నటించిన ‘‘ డెవిల్ ’’, సుదీప్ ‘‘ బిల్లా రంగ భాష’’ గణేష్ అండ్ రమేష్ అరవింద ల‘‘ యువర్స్ సిన్సియర్ రామ్’’, ధృవ్ సర్జా ‘‘ కేడీ ’’, యువరాజ్ కుమార్ ‘‘ ఎక్కా’’, వినయ్ రాజ్ కుమార్ ‘‘ గ్రామాయణం’’, ఇంకా ప్రముఖ దర్శకులు పేరు లేని సినిమాలు ఎన్నో ఉన్నాయి.
కొన్ని సినిమాల రిజల్ట్స్ చూసి వాటికి పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు పలువురు నిర్మాతలు చెబుతున్న మాట. ఇంకా కొన్ని సినిమాలకు మంచి క్యాచీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి హఫ్ లో రాబోతున్న సినిమాల్లో కాంతారా, టాక్సిక్, డెవిల్, యువర్స్ సిన్సియర్లీ రామ్, జింగో, కరవాలీ, మంద కడలు, తీర్థరూప తాండేయవారిగే, డైజీ తో సహ మరో 12 సినిమాలు వస్తున్నాయని కన్నడ ఫిల్మ్ టైటిల్ కమిటి వర్గాలు తెలిపాయి.
అన్ని ఆశలు టాక్సిక్ చిత్రం పైనే..
రాబోయే అన్ని చిత్రాలలో యష్ నటించిన ‘ టాక్సిక్’ సినిమా పైనే కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. చాలాకాలంగా సినిమా గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే వివిధ ఇండస్ట్రీల నుంచి నటీనటులు ఇందులో నటిస్తుండటం, వారి డేట్లు సర్దుబాటు చేసుకోవడంలో ఇబ్బంది కారణంగా సినిమా ఆలస్యం అయిందని స్వయంగా హీరో యష్ వెల్లడించారు. ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో కూడా యష్ గ్యాంగ్ స్టర్ పాత్రలోనే నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగష్టు కు పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. యూనిట్ అభిప్రాయం ప్రకారం ఈ సినిమా కేజీఎఫ్ ఫ్రాంచైజీ ప్రీక్వెల్, సీక్వెల్ గా ఉంటుందట. అందుకే సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
దర్శన్ ... డెవిల్స్ పై కూడా..
హీరో దర్శన్ తూగుదీప నటించిన డెవిల్ చిత్రం పై కూడా పరిశ్రమ ఇలాంటి ఆశలే పెట్టుకుంది. అంతకుముందు విడుదలైన టీజర్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ను సృష్టించింది. అయితే జూన్ 14న రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఆ సమయానికి సినిమా కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి అయింది. ప్రస్తుతం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. చిత్ర నిర్మాణా బృందంలోని వర్గాల ప్రకారం ఇంకా సినిమాలోని చాలా పోర్షన్ పెండింగ్ లో ఉంది. దీంతో నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కోర్టు కొట్టివేస్తే దర్శన్ షూట్ పూర్తి చేసి ఈ సంవత్సరాంతానికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని హీరో క్యాంపు వర్గాలు తెలిపాయి.
కిచ్చా సుదీప్ నుంచి మరో సినిమా..
తన 51 వ పుట్టిన రోజు సందర్భంగా కిచ్చా సుదీప్ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను సామాజిక మాధ్యమాలైన ‘‘ ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ ’’ లో విడుదల చేశారు. ‘‘ ఏ టేయిల్ ఫ్రమ్ ది ఫ్యూచర్: బిల్లా రంగ బాషా’’ , ఫస్ట్ బ్లడ్ అధికారిక టైటిల్ లోగో, కాన్సెప్ట్ వీడియోను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రానికి విక్రాంత్ రోనా ఫేమ్ అనూప్ భదరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎమోషనల్ జర్నీ..
అలాగే కర్ణాటక సినీ దిగ్గజాలు రమేష్ అర్వింద్, గోల్డెన్ స్టార్ గణేష్ లు ప్రారంభించిన మరో సినిమా ‘‘ యువర్స్ సిన్సియర్లీ రామ్’’ చిత్రంపైనా మంచి బజ్ ఉంది. మూవీని గత ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభించారు. టైటిల్ లోనే మంచి ఎమోషనల్ డెప్త్, క్లాస్ కనిపిస్తోంది. సినిమా ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన టీజర్ మంచి భావోద్వేగాలతో ఉంది.
ఇవే కాకుండా ‘చూ మంతర్ ఆఫ్ శరణ్’, సంజూ వెడ్స్ గీత, ది రాయల్ ఆఫ్ దినకర్ తూగదీప, రుద్ర గరుడ పురాణం వంటి చిత్రాలతో పాటు మల్టిస్టార్ గా వస్తున్న ఫారెస్ట్, జైద్ ఖాన్ నటించిన కల్ట్, విక్రమ్ రవిచంద్రన్ నటిస్తున్న ముధోల్ వంటి చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఈ చిత్రాల విడుదలతో కన్నడ సినిమా దూసుకుపోతుందని భావిస్తున్నారు. కాంతార-1, టాక్సిక్ వంటి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. కచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని ప్రముఖ నిర్మాత ఎంఎన్ సురేష్ అన్నారు. యశ్, రిషబ్ శెట్టి సహ ఇతర కన్నడ స్టార్లు తమ ప్రతిభను పాన్ ఇండియా స్థాయిలో చూపెడతారని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. తమ మార్కెట్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story