
‘థగ్ లైఫ్’...కాస్తా ‘రిస్క్ లైఫ్’ అయిపోయింది!
ముఖ్యంగా కమల్ నటించిన తాజా భారీ పాన్-ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలపై కర్ణాటకలో అనిశ్చితి నెలకొనే పరిస్దితికి దారి తీస్తోంది.
“A revolution is not just a gunshot — sometimes it's just a wrong word.”
— inspired by Che Guevara
“ఒక మాట... ఒక వివాదం... ఓ సినిమా భవితవ్యాన్ని తారుమారు చేయగలదా?” — సినిమా రంగంలో ప్రస్తుతం ఇదే డిస్కషన్ నడుస్తోంది.ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతటా సంచలనం రేగుతోంది. ఇది కేవలం ఒక సెలెబ్రిటీ కామెంట్ లా కాకుండా — “భాషా గౌరవం” పేరిట ఒక ఉద్యమంలా రూపాంతరం చెందుతోంది. ముఖ్యంగా కమల్ నటించిన తాజా భారీ పాన్-ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలపై కర్ణాటకలో అనిశ్చితి నెలకొనే పరిస్దితికి దారి తీస్తోంది.
‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పష్టంగా తేల్చి చెప్పింది.కమల్ తగ్గేదేలే అన్నట్లుగా మాట్లాడుతూండటంతో ఈ వివాదం మరింత తీవ్రంగా మారుతోంది.
KFCC వార్నింగ్: క్షమాపణ లేకుంటే విడుదలే రద్దు!
ఈ వివాదంపై ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) బహిరంగంగా స్పందించింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, బహిరంగ క్షమాపణ చెబితేనే ‘థగ్ లైఫ్’ సినిమాను విడుదల చేసే ప్రసక్తి ఉంటుందని హెచ్చరించింది.
మరో ప్రక్క కమల్ కనుక క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలన్నింటినీ రాష్ట్రంలో నిషేధిస్తామని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి తాజాగా హెచ్చరించారు.
KFCC అధ్యక్షుడు ఎం. నరసింహులు మాట్లాడుతూ:
“కమల్ సినిమాను నిషేధించాలని అనేక సంస్థలు డిమాండు చేస్తున్నాయి. భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టదగ్గవి. అందుకే ఆయన్ని కలిసి వివరణ కోరతాము.” అన్నారు.
ఇంతటితో ఆగకుండా, KFCC మాజీ అధ్యక్షుడు గోవిందు, జయమాల మరింత ఘాటుగా: “ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే సినిమా నిషేధం ఖాయం, భాషా వివాదం (Language Controversy) తలెత్తినప్పుడు కన్నడిగులందరూ ఏకమవ్వాల్సిందేనని, అది మన కర్తవ్యం” అన్నారు.
వెనక్కి తగ్గని కమల్...
కాని ఈ ఒత్తిళ్లన్నీ కమల్ హాసన్‌ను కొంచెం కూడా కదిలించలేకపోయాయి. ఆయన సూటిగా చెప్పారు: “ఇటువంటి బెదిరింపులు నాకు కొత్తేమీకావు. 2013లో ‘విశ్వరూపం’ సినిమాను తమిళనాడులో 15 రోజుల పాటు నిషేధించారు. అప్పటికీ నేను వెనక్కి తగ్గలేదు. ఇప్పుడూ కాదు.” అన్నారు.
ఇది కమల్ శైలీ — తాను నమ్మిన మాటల వెనుక నిలబడడం. “Cinema is not a mirror to society; it’s a hammer to shape it” అన్నట్టుగా, ఆయన వాదనలోనూ ఓ తాత్విక స్థాయిని చూడాలా?
కమల్ హాసన్ క్లారిటీ – “ప్రేమతో అన్న మాట.. ఉద్దేశపూర్వకమేం కాదు”
అదే సమయంలో కమల్ ... “నా వ్యాఖ్యలు భాషల మధ్య ప్రేమను ప్రతిబింబించేవే. ఇందులో ఏ భాషపైనా చిన్న చూపు ఏమీ లేదు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదని నేను నమ్ముతున్నాను. ఇదే నియమం నాకు కూడా వర్తిస్తుంది. భాషల గురించి చర్చించాల్సింది చరిత్రకారులు, భాషా నిపుణులు.” అన్నారు. కానీ క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
ఎన్ని కోట్లు నష్టం?
“One controversy before release is enough to either break a film or break records”.
కర్ణాటక ప్రస్తుతం దక్షిణ భారతంలో అత్యంత కీలకమైన సినిమాటిక్ మార్కెట్లలో ఒకటి. తెలుగు, తమిళ సినిమాలకూ ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది. అలాగే థగ్ లైఫ్’, మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ మల్టీ-లాంగ్వేజ్ ప్రాజెక్ట్. జూన్ 5న సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలన్న లక్ష్యంతో నిర్మాతలు పనులు జరుపుతున్నారు.
కానీ ఈ వివాదం వల్ల కర్ణాటక మార్కెట్ పూర్తిగా క్లౌడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్, స్టేట్ వ్యాప్తంగా థియేటర్లు పొందడంలో ఇప్పటికే అడ్డంకులు మొదలైపోయాయి. బాక్సాఫీస్ పై దీని ప్రభావం దాదాపు ఇరవై కోట్లు దాకా ఉంటుందని వేస్తున్నారు.
ఒక మాట వల్ల, ఓ విలువైన మార్కెట్ మొత్తం చేజారే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు రిస్క్ నేపథ్యంలో డీల్ ఫార్మలైజ్ కాకపోవచ్చు లేదా ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
కళా స్వేచ్ఛ vs ప్రాంతీయ గౌరవం – ఎవరు గెలుస్తారు?
ఇది వ్యక్తిగత అభిప్రాయ vs భాషాభిమాన మధ్య యుద్ధం. కమల్ హాసన్ ఓవైపు “వ్యక్తిగత స్వేచ్ఛ”ని సమర్థిస్తుండగా, కర్ణాటక రాజకీయ శక్తులు “భాషా గౌరవం” పేరిట ఓ కండిషన్ పెట్టాయి. “భాషను గౌరవించని వారి సినిమా చూడాలా?” అనే భావోద్వేగ ప్రశ్న ఎదురౌతోంది. మరోవైపు... “వ్యాఖ్యలు ఓ నటుడి వ్యక్తిగత అభిప్రాయమే, కళను దానికి బలిచేయడం ఎందుకు?” అంటూ కొందరు లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై కమల్ అభిమానులు, సినీ ప్రముఖులు, మిగతా ఇండస్ట్రీలు ఇప్పటికే మౌనంగా గమనిస్తున్నాయి. ఈ వివాదం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరోక్షంగా చర్చకు దారి తీస్తోంది.
“A good film is not made in Tamil, Telugu or Kannada. It’s made in emotion.” — అని దర్శకుడు మణిరత్నం గతంలో ఓ టైమ్ లో చెప్పిన మాట. కానీ ఇప్పుడు చిత్రంగా ఆయన సినిమానే ఒక భాషా విమర్శ వివాదంలో లో చిక్కుకుంది.
రీల్స్‌కు మించి రియలిటీ ?
కమల్ హాసన్ వివాదం ఇది ఎంత దాకా వెళుతుందోనన్నదానికంటే... ఇది ఎక్కడ ఆగుతుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? కళ గెలుస్తుందా? రాజకీయ ఒత్తిళ్లే గెలుస్తాయా? అనే ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
కమల్ వ్యాఖ్యలపై అగ్రహం, ఆయన క్లారిటీ, KFCC వార్నింగ్, సినిమాకున్న పాన్-ఇండియా ఆశలు – ఇవన్నీ కలిపి ‘థగ్ లైఫ్’కు పబ్లిసిటీ ఇచ్చే టూల్స్ కావచ్చునేమో. కానీ అదే సమయంలో భవిష్యత్తులోనూ కళపై నియంత్రణ పెడదామనే ఆలోచనలకు, సంకేతంగా ఈ వివాదం మారే ప్రమాదమూ ఉంది.
ఏదైమైనా
సినిమాలు భాషల మధ్య వంతెనలుగా ఉండాలి – గోడలుగా కాకూడదు. జూన్ 5లో ‘థగ్ లైఫ్’ కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా ? అనేది ప్రశ్న కాదు. ఇది భాషల పరస్పర గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, సినిమా మార్కెట్ రాజకీయాలు అనే మూడు పెద్ద అంశాల మధ్య జరిగే సంఘర్షణ, తీర్పు. అదేమిటన్నది అతి త్వరలోనే మనం చూడబోతున్నాం.