Shruti Haasan | కూతురి చిన్ననాటి ఘటన గుర్తుచేసిన కమల్ హాసన్
తాజాగా కమల్ హాసన్ ఓ ఈవెంట్‌లో శృతి హాసన్ చిన్నప్పటి ఓ సరదా సంఘటన గురించి చెప్పుకొచ్చారు. తన కుమార్తె తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
స్టార్ హీరో కమల్ హాసన్‌లాగే ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్ . కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా మ్యూజిక్ అల్బమ్‌లు విడుదల చేస్తూ అలరిస్తున్నారు. శృతిహాసన్‌కు కావాల్సిన మేరకు స్వేచ్చ ఇవ్వటంలో కమల్ ముందుంటారు. అయితే ఆమె కమల్ గారాలపట్టి. తన కూతురు చిన్నప్పటి విశేషాలను ఆయన అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. తాజాగా కమల్ హాసన్ ఓ ఈవెంట్‌లో శృతి హాసన్ (Shruti Haasan) చిన్నప్పటి ఓ సరదా ఘటన గురించి చెప్పుకొచ్చారు. తన కుమార్తె తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
గత కొద్దిరోజులుగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుగారితో ఆయన సినిమాల సినిమాల గురించి మాట్లాడుతున్నారు. 'అపూర్వ సింగీతం' అనే ఈవెంట్ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా కమల్ హాసన్ ..."అపూర్వ సోదరులు (అప్పు రాజా)" సెట్స్ నుండి 1989 క్లాసిక్ అపూర్వ సోదరలు గురించి చిత్రనిర్మాత సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడుతూ అప్పటి సంఘటన గుర్తు చేసుకున్నారు. అప్పుడు శృుతిహాసన్ కు నాలుగేళ్లు. ఆమె చాలా చలాకీగా ఉండేది. స్కూల్లో శ్రుతి ఓ చిత్రమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొందో గుర్తు చేసుకున్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. శృతి ఆలస్యంగా స్కూల్‌కు వెళ్లటంతో ఆమె టీచర్ ఎందుకు లేటు అయ్యిందని అని అడిగినప్పుడు.. 'మేము సింహాలు, పులులకు ఆహారం ఇవ్వవలసి వచ్చింది.' అని ఆమె వివరించింది. ఆశ్చర్యంగా టీచర్ చూస్తూంటే శ్రుతి ఇలా చెప్పింది.. 'అవును ఇంకా మా దగ్గర ఒక ఏనుగు, డాన్స్ చేయగల ఆరు పోమరేనియన్ కుక్కలు కూడా ఉన్నాయి!' అని చెప్పుకొచ్చింది. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నన్ను ఆఫీస్ కు పిలిచి ఆమె అబద్దాలు చెప్తుందేమో అని, విషయం ఏమిటని అడిగారు.”
అప్పుడు కమల్ నవ్వుతూ... శృతి చెప్పేది నిజమే అని, తాను అపూర్వ సహాదరులు సినిమా చేస్తున్న సమయంలో వీనస్ స్టూడియోలో సర్కస్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నాం. అక్కడికి శృతి వచ్చింది. అక్కడ విషయాలన్ని కలిపి చెప్పిందని అని ప్రిన్సిపాల్‌కి చెప్పారు. దాంతో ఆ ప్రిన్సిపాల్ కూడా నవ్వారు. ఈ విషయం ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. కమల్ అభిమానులతో పాటు శృతి అభిమానులు కూడా ఈ సంఘటన విని నవ్వుకుంటున్నారు.
శృతి హాసన్ తన తండ్రి గురించి చెప్తూ...‘నా దృష్టిలో మా నాన్న సూపర్ హీరో. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. దర్శకులు కథలు చెబుతుంటే.. తరగతి గదిలో పిల్లాడిలా వింటారు. దర్శకత్వం అనేది ఎన్నో బాధ్యతలతో కూడిన పని. ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ’ అన్నారు. ఇటీవల ‘ఇండియన్ 2’ ఆడియో రిలీజ్ వేదికపై కమల్‌హాసన్ పాటలతో శ్రుతి హాసన్ అలరించారు. తన తండ్రి (Kamal Haasan) సినిమాలోని పాటలను ఆలపించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.
ఇక శృతి సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఐదు చిత్రాలతో వినోదాన్ని పంచిన శ్రుతి హాసన్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ‘సలార్’కు కొనసాగింపుగా రానున్న ‘సలార్ శౌర్యంగపర్వం’లో కనిపించనున్నారు. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అడివిశేష్ హీరోగా రానున్న ‘డకాయిట్’లో ఆమె నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.