298 కోట్ల  బ్లాక్‌బస్టర్  ‘కొత్త లోక’
x

298 కోట్ల బ్లాక్‌బస్టర్ ‘కొత్త లోక’

OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన ‘లోకహ్: చాప్టర్ 1 — చంద్ర’ ఇప్పుడు థియేటర్ల రన్‌కి ఎండ్‌కార్డ్ పడేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹298 కోట్లు గ్రాస్ వసూలు చేస్తూ, మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది.

ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న OTT రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది! అనేక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల మధ్య జరిగిన పెద్ద డీల్ తర్వాత, చివరికి Jio Hotstar ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను సొంతం చేసుకుంది.

సమాచారం ప్రకారం, ‘కొత్త లోక’ అక్టోబర్ 20 నుంచి అన్ని భాషల్లోనూ Jio Hotstarలో స్ట్రీమింగ్ కానుంది!

కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో ‘చంద్ర’గా శక్తివంతమైన పాత్రలో ఆకట్టుకున్నారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ తన Wayfarer Films బ్యానర్‌లో నిర్మించారు. నస్లెన్ కే. గఫూర్, సాండీ మాస్టర్, అరుణ్ కురియన్, విజయరాఘవన్ కీలక పాత్రల్లో నటించగా,

దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ ప్రత్యేక పాత్రల్లో గెస్ట్ అప్పియరెన్స్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు.

థియేటర్లలో సంచలనంగా నిలిచిన ‘కొత్త లోక’, ఇప్పుడు ఓటీటీలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది!

కథ ఏంటంటే?

ఓ అమ్మాయికి సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుంది? అనేదే ఐడియాతో ఈ మూవీని తెరకెక్కించారు. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కు సూపర్ పవర్స్ ఉన్న సంగతి కొంత మందికి మాత్రమే తెలుసు. ఓ సాధారణ అమ్మాయిలా బెంగుళూరు వచ్చిన ఆమె రెస్టారెంట్‌లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. తన పవర్స్ బయట పడనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆమెకు అద్దెకు దిగిన ఇంటి ఎదురు అపార్ట్‌మెంట్‌లోనే సన్నీ (నస్లెన్) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు తొలి చూపులోనే చంద్రను సన్నీ ఇష్టపడతాడు. ఈ క్రమంలో ఓ పెద్ద ప్రమాదం నుంచి సన్నీని కాపాడుతుంది చంద్ర. దీంతో ఆమెకు మరింత దగ్గరవుతాడు. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఫాలో కాగా సూపర్ పవర్స్ ఉన్న విషయం తెలుస్తుంది. అసలు ఆమె ఎవరు? సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి?

వాటిని మంచి కోసం వాడినా వచ్చినా ఇబ్బందులేంటి? ఏళ్లుగా ఆమె యవ్వనంగా ఎలా ఉంది? చంద్ర గతం ఏంటి? ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె వెంట ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.

Read More
Next Story