నిర్మాతలు టాక్స్ ఎగ్గొట్టడానికి పుష్ప లాగే స్కెచ్? ఏం జరిగింది
x

నిర్మాతలు టాక్స్ ఎగ్గొట్టడానికి 'పుష్ప' లాగే స్కెచ్? ఏం జరిగింది

'పుష్ప 2' సినిమా ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు.

'పుష్ప 2' సినిమా ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. దాదాపు 55 ఐటీ అధికారుల బృందాలు హైదరాబాద్ లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వచ్చిన ఆదాయం ఎంత? కడుతున్న టాక్స్ ఎంత? అనే విషయంలో అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకటే హాట్ టాపిక్ ..పుష్ప 2 లో వైల్డ్ గా ఏమన్నా లెక్కలు తప్పాయా...ఐటీ విభాగం వాళ్లు ఏమి తేలుస్తారు అనేదే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో తనిఖీలు,డైరక్టర్ సుకుమార్ ఇంటి పైనా రైడ్స్...ఇవన్నీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పుష్ప2 భారీ వసూళ్లు వచ్చినా ట్యాక్స్ ఎగ్గొట్టే ప్లాన్ ఏమైనా చేశారా? 1,700 కోట్ల వసూళ్లలో చెల్లించాల్సిన పన్ను ఎంత? నష్టాల కోసం కొన్ని సినిమాలు మైత్రీ మూవీస్ తీస్తున్నారా? హీరోలకు అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన సొమ్ము ఎంత? ఇవన్నీ ఇప్పుడు తేలుస్తున్నారా, లెక్కలు చూస్తున్నారా?

సినిమాలో ఎన్నైనా చూపించవచ్చు. పోలీసుల కళ్లుగప్పి ఎర్ర చందనం లారీలను ఎలా సరిహద్దులు దాటించాలో, ఎలా షిప్పు ల్లోకి ఎక్కించాలో నీటుగా ఎక్సప్లైన్ చేయచ్చు. అయితే నిజ జీవితంలో అలాంటి పథకాలు ఆదాయం పన్ను చెల్లింపు విషయంలో అదే పుష్ప సినిమా థీమ్ ని నిర్మాతలు ఫాలో అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప ‘ది రూల్' ఇండియన్ బాక్సాఫీస్ సినీ రూల్ చేసింది. ఈ చిత్రం సౌత్ కంటే నార్త్ జనాలకు బాగా కనెక్ట్ అయి కనక వర్షం కురిపించింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూట ర్లు ముందే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. కానీ, సినిమా అమ్మకం, వసూళ్లలో వచ్చిన సొమ్ముపై ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వేసిన ప్లాన్ ను ఆదాయపన్ను శాఖ పసిగట్టి మరీ దాడులు చేస్తోందని వినపడుతోంది.

ఇక ఇదే సమయంలో కొన్ని వార్తలు లాంటి రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. విదేశాల నుంచి ఫండింగ్ చేయించుకుని, ఊరు పేరు లేని సినిమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించి.. వచ్చిన లాభాలను పంచుకొని.. నల్ల డబ్బు ను తెల్లగా మార్చేశారని, పన్నులు ఎగ్గొట్టేందుకు ప్లాన్ల లు వేశారని చెప్పుకుంటున్నారు! ఆ టాక్ ని అందిపుచ్చుకునే ఐటీ శాఖ దాడులకు బయలుదేరిందని చెబుతున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఏదైమైనా పుష్ప 2 వచ్చిన భారీ కలెక్షన్స్ కు సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయనే చర్చ తెలుగు సినీ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. పెట్టుబడి రూపంలో ట్యాక్స్ చెల్లించకుండా 75 పైసల వడ్డీతో రూ.500 కోట్లు ఎన్నారై ఫండ్స్ రూపంలో వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అందులో నిజాలెంతో కానీ ఈ నేపథ్యంలో ఐటీ అధికారు లు రంగంలోకి దిగారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహించారు. ఓటిటి,శాటిలైట్ రైట్స్ కు వచ్చిన రూ.500 కోట్ల పైగా లెక్క ఇంకా మిగిలే ఉందని అంటున్నారు.

పుష్ప 2 మొత్తం రూ.2,300 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నాయి. ఇందులో రూ.400 కోట్లు ప్రొడక్షన్ కు ఖర్చు అయింది. మరో రూ.400 కోట్లు థియేటర్ కు, ప్రమోషన్స్ కు అన్ని ఖర్చులు,షేర్స్ పోగా రూ.1,500 కోట్ల నికర లాభం వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీం అయిన మైత్రీ మూవీ మేకర్స్ 50 శాతం, హీరో అల్లు అర్జున్ 30 శాతం, దర్శ కుడు సుకుమార్ 20 శాతం వాటా తీసుకునేందుకు ఎగ్రిమెంట్స్ జరిగాయని చెప్పుకొంటున్నారు. వీటన్నిటినీ ఏ మేరకు ఐటీ అధికారులు క్లియర్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ఐటీ దాడులు సినిమా వాళ్లపై చాలా రొటీన్ అని మరికొందరు లైట్ అంటున్నారు.

Read More
Next Story