
రజినీకాంత్ రిటైర్ అవుతున్నారా?
అభిమానుల్లో కలకలం!
చాలా మంది నటులు వయసుతో పాటు నెమ్మదిస్తారు. కానీ రజినీకాంత్ — కాలాన్ని కూడా వెనక్కి నడిపించగల ఎనర్జీ. ఈ వయసులోనూ ఆయన తెరపై కనిపిస్తే థియేటర్లలో గాలిలోనే మార్పు వస్తుంది. అయితే, ఇప్పుడు అదే అభిమానుల హృదయంలో ఒక కొత్త ప్రశ్న వెంటాడుతోంది.
“ఇదేనా రజినీకాంత్ కెరీర్‌కి చివరి అంకం?”
సూపర్‌స్టార్ రజినీకాంత్ వయసు 74 అయినా ఇంకా అదే జోష్‌తో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారు. లీడ్ హీరోగా ఆయనకిప్పుడు మూడు భారీ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి
జైలర్ 2
సుందర్ C తో ఫాస్ట్ ప్రాజెక్ట్
కమల్ హాసన్‌తో మల్టీ స్టారర్ బ్లాక్‌బస్టర్!
అయితే... ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా వార్తలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. ఈ సినిమాల తర్వాత రజినీకాంత్ రిటైర్మెంట్‌కు సిద్ధమవుతున్నారట! ఇదే ఇప్పుడు తమిళ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం.
వయసు పెరిగేకొద్దీ యాక్షన్ సీన్లు, డాన్స్‌లు, హై ఎనర్జీ పాత్రలు చేయడం ఎవరికైనా కష్టమవుతుంది. చాలా మంది సీనియర్ నటులు సపోర్టింగ్ రోల్స్‌కి మారిపోతారు లేదా పూర్తిగా సినిమాలకి గుడ్‌బై చెబుతారు. రజినీకాంత్ విషయంలో అయితే, ఆయన కమల్ హాసన్‌తో చేస్తున్న న్యూ ఫిల్మ్ — నెల్సన్ దర్శకత్వంలో — ఆయనకు లాస్ట్ హీరో రోల్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
70లలో ఒకే సినిమాలలో కలిసిన కమల్ హాసన్ & రజినీకాంత్. ఇప్పుడు మళ్ళీ 2026 లలో కలిసి నటించడం ఒక “ఫుల్ సర్కిల్” మోమెంట్.
ఈ ప్రాజెక్ట్‌నే చాలా మంది “సింబాలిక్ రిటైర్మెంట్ ఫిల్మ్”గా చెబుతున్నారు.
ప్రస్తుతం రజినీ జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తర్వాత సుందర్ C మూవీ, ఆ తర్వాత కమల్ హాసన్ ప్రొడక్షన్‌లోని మల్టీ స్టారర్. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
‘జైలర్ 2’ – చివరి మాస్ రోర్?
“జైలర్” విజయంతో రజినీ మళ్లీ ఫుల్ ఫార్మ్‌లోకి వచ్చారు. ఇప్పుడు జైలర్ 2 అనౌన్స్‌మెంట్ తర్వాత ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.
కానీ అదే సమయంలో ఒక భయం కూడా “ఇది ఆయనకు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా?” అని. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో రజినీ పాత్రకి గాను ఎమోషన్, యాక్షన్, ఫిలాసఫీ మూడు లెవల్స్‌లో మిక్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది.
కొంతమంది ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే ...“ఇది ‘కబాలి’లోని రజినీ తత్త్వం, ‘బాషా’లోని రజినీ ఆగ్రహం కలిసిన రీబర్త్!”
ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ వార్తలపై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంత వయసైనా రజినీ అంటే రజినీ!తన చరిష్మా, బాక్స్ ఆఫీస్ పవర్, మరియు అభిమానుల మద్దతుతో ఆయన ఇంకా ఇండియన్ సినిమాకి ఓ చెదిరిపోని లెజెండ్!
ఏదైమైనా “రజినీకాంత్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో మనకు తెలియదు. కానీ ఆయన వెలుగుతో నిండిన ప్రయాణం ముగిసినా, ఆ ప్రభ వెలుగులు ఇంకా కోట్ల హృదయాల్లో మెరుస్తూనే ఉంటాయి.”

