‘మాస్ జాతర’ని బలవంతం మీద రిలీజ్ చేస్తున్నారా?
x

‘మాస్ జాతర’ని బలవంతం మీద రిలీజ్ చేస్తున్నారా?

పబ్లిక్ డిమాండ్ కాదు… ప్లాట్‌ఫామ్ డిమాండ్!


‘మాస్ జాతర’కి ప్రారంభం నుంచే శకునాలు బాగాలేదు. భాక్సీఫీస్ భాషలో చెప్పాలంటే కాంబినేషన్ మీదనే కొంచెం హడావిడి… అంతే. రవితేజ వరుస ఫ్లాపుల్లో తేలిపోతున్నాడు, శ్రీలీల క్రేజ్ గట్టిగా ట్రై చేస్తోంది. పెద్దగా వర్కవుట్ కావటం లేదు. నాగవంశీకి కింగ్‌డమ్ – వార్ 2 దెబ్బలు నుంచి ఇంకా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో ఈ ముగ్గురు కలిసి తీసుకొచ్చిన సినిమా — మాస్ జాతర.

వాస్తవానికి ‘మాస్ జాతర’ పరిస్థితి బయట కనిపించేదానికంటే లోపల చాలా కాంప్లికేటెడ్‌. సినిమా రిలీజ్ అవ్వక ముందే అంతర్గత ఒత్తిడులు, మార్కెట్ టెన్షన్, ఆడియన్స్ డిస్కనెక్ట్ — మొత్తం కలిస్తే రవితేజ టీమ్ మీద గట్టి ప్రెజర్ పడింది. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట ఏంటంటే — “ఈ సినిమా కంటెంట్ పట్ల విశ్వాసం కంటే, విడుదల చేయాలన్న బాధ్యత ఎక్కువ అయ్యింది.”

ఈ సినిమా అసలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఎందుకు బాగా లేటైంది? ఇండస్ట్రీలో కొంతమంది చెప్పేది —

స్క్రిప్ట్ ప్యాచ్‌లు, రెండు మూడు ఫైట్‌లు రీడిజైన్

బిజినెస్ అడ్జస్ట్మెంట్స్

టీమ్ లోపలి గ్యాప్‌లు

ఇవి చాలా ప్రభావం చూపించాయంట. అయితే ఇందులో నిజమెంత అనేది ప్రక్కన పెడితే ఇప్పుడు "రిస్క్ చెయ్యలేని స్థితిలో ఉన్నారు… ఓటీటీ డీల్ సేవ్ చేసుకోవడమే ప్రాధాన్యం" అని ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

అయితే వాయిదాలు, ప్యాచ్ వర్క్‌, డేట్ మార్పులు… ఈ మొత్తం జర్నీలో బజ్‌ని చంపేసింది. ఇక ఇప్పుడు 31న ప్రీమియర్లతో అరంగేట్రం. కానీ షాక్ ఏంటంటే… ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా వీక్ గా ఉన్నాయి. అదే టైమ్‌లో ‘బాహుబలి ఎపిక్’ కోసం మాత్రం పబ్లిక్ ఫుల్ జోష్ లో నడుస్తోంది.

మోంథా తుపాను = మాస్ జాతరకి మరో షాక్?

ఆంధ్రా–తెలంగాణ అంతా వర్షాలతో ఇబ్బంది పడుతోంది. కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో థియేటర్‌కి వెళ్లి మాస్ జాతర చూడాలి? పబ్లిక్‌కి అసలు మూడ్ ఉంటుందా? డౌట్ పెద్దది. దీనికి తోడు నెలాఖరు… ఆడియన్స్ జేబులు ఖాళీ… మరోవైపు బాహుబలి రీ–రిలీజ్ హైప్… అప్పుడే ఈ డేట్ ఎందుకు? ప్రముఖ నిర్మాత గా వెలుగుతున్న నాగవంశీ కూడా తెలుసు — ఇది గొప్ప డేట్ కాదు అని. అయితే మరి ఎందుకిలా ప్రాజెక్టుని కిల్ చేస్తున్నారు అంటే...

ఓటీటీ ఒత్తిడితో రిలీజ్?

అసలు నిజం ఏమిటంటే… ఈ డేట్‌ను ఓటీటీ వాళ్ళు ఫిక్స్ చేశారు. వాళ్ల ప్లాన్‌కి తగ్గట్టుగా ఇప్పుడు సినిమా బలవంతంగా విడుదలవుతోందని తెలుస్తోంది. ఇది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్ గా చెప్పుకుంటున్నారు.

బాహుబలి షోలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు?

తెలిసిందే. ‘బాహుబలి ఎపిక్’ రీ–రిలీజ్ కి అభిమానుల క్రేజ్ పీక్‌లో ఉంది. ఈ టైంలొ మాస్ జాతర రావడమే పెద్ద రిస్క్. అయితే మళ్లీ అదే సమాధానం. “OTT కంపెనీ అల్టిమేటం.” ఒక వెబ్ ప్లాట్‌ఫామ్ ఈ డేట్‌లాక్ చేసి వెళ్లిందని స్ట్రాంగ్ టాక్. అంటే? ...సినిమా బయటికి రావడం మార్కెట్ కోసం కాదు… ఎగ్రిమెంట్ కోసం.

ఆంధ్రా,తెలంగాణా వాతావరణం = థియేటర్‌కి శత్రువు

తుపాను, వరదలు, రోడ్లు పాడైపోవడం, ట్రావెల్ మూడ్ లేకపోవడం, జనం ప్రాణం కాపాడుకోవడం చూసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో

“జాతర”కి వెళ్లాలా? అన్నదే పబ్లిక్ ఫీల్.

మాస్ జాతర vs ప్రస్తుత మార్కెట్ రియాలిటీ

ఈరోజు పబ్లిక్ మైండ్‌సెట్: కొత్తదనం కావాలి, పెద్ద హైప్ కావాలి, థియేటర్ కి వెళ్లి చేసేటంత గొప్పగా అనిపించాలి. మాస్ అంటే వన్-లైనర్ కాదు… ఎమోషన్ + ఎట్లా చూపిస్తున్నావనే విషయం. అయితే మాస్ జాతర వీటిన్నటికీ సమాధానం చెప్తుందా అంటే? ప్రస్తుతం ఇండస్ట్రీ మాట — అవకాశముంది… కానీ గ్యారంటీ కాదు.

నిర్మాత సైలెంట్ ఎందుకు?

నిర్మాత నాగవంశి చాలా కాలుక్యులేటెడ్ గా సైలెంట్ గా ఉన్నారు. అవసరమైతే తప్ప నోరు విప్పటం లేదు. ట్విట్టర్ జోలికి పోవటం లేదు. స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు. ఈయన ఎప్పుడూ హైప్ క్రియేట్ చేసి, వర్డ్ ఆఫ్ మౌత్ బిల్డ్ చేసేవాడు. కానీ ఇప్పుడు? చాలా క్యాలిక్యులేటెడ్‌గా, సైలెంట్‌గా ప్రవర్తిస్తున్నాడు. ఈ సైలెన్స్‌కే గాసిప్ స్టార్ట్ అయింది: "కంటెంట్ మీద టీమ్ 100% కాన్ఫిడెంట్ అయితే ఇంత సైలెన్స్ ఉండదు" అని అని ఓ వర్గం అంటోంది.

నాగవంశీ ప్లాన్ క్లియర్ — “ప్రీమియర్ టాక్ బాగుంటే ఓపెనింగ్ డే ఏదో ఒక మంచి ఫిగర్ వస్తుంది” అనే హోప్. కాబట్టి ‘మాస్ జాతర’కి టాక్ మేకర్ ప్రీమియర్లు — ఇదే సేఫ్ గేమ్.

జరగకపోతే?

రవితేజకి మరో షాక్

శ్రీలీల క్రేజ్ ఫుల్ స్టాప్

నాగవంశీకి ఇంకో కౌంటర్

సింపుల్‌గా చెప్పాలంటే —

“మాస్ జాతర”కి ఇది రిలీజ్ కాదు…రిప్యూటేషన్ ట్రయల్.

Read More
Next Story