ప్యాన్ ఇండియా స్టార్ అంటే అర్దం ...
x

ప్యాన్ ఇండియా స్టార్ అంటే అర్దం ...

బిజినెస్ డీల్స్‌ ప్రభాస్ తో లింక్, షాకింగ్ కండిషన్ ?


ప్యాన్ ఇండియా స్టార్ అంటే అర్దం ...ఆ హీరో పేరు చెప్పగానే దేశం మొత్తం గుర్తుపట్టాలి,మారు మాట్లాడకుండా బిజినెస్ జరిగిపోవాలి. ఆ స్టేటస్ ఈ జనరేషన్ లో ప్రభాస్‌కే దక్కింది. ‘బాహుబలి’ తరువాత ప్యాన్ ఇండియా అనే పదానికి రూపం ఇచ్చిన వ్యక్తి ప్రభాస్. అమితాబ్, షారుఖ్ లాంటి లెజెండ్స్‌తో పాటు సౌత్ నుంచి ఒకరిని మాత్రమే చెప్పాలంటే, ఇప్పుడు నార్త్ ఇండియా, ఓటీటీ మార్కెట్, సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్… అన్నింటికీ కలిపే ‘కరెన్సీ’ ప్రభాస్.

అందుకే... ప్రభాస్ కనిపించిన సినిమా అంటే, అది మిగిలినవాటితో పోల్చే బిజినెస్ కాదు. ఆయన చేసిన పాత్ర 10 నిమిషాలైనా సరే, ఆ సినిమాకు డిమాండ్ డబ్బులు కాదు – డౌన్ పేమెంట్ లెవల్ బిజినెస్. ఇప్పుడు అదే ప్రభాస్ ‘కన్నప్ప’లో కనిపిస్తున్నాడు. కథ పాతదైనా, ఫార్ములా క్లాసికైనా… ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా వైపు దృష్టి పెట్టడానికి ఏకైక కారణం ప్రభాసే. ఆ విషయం మంచు విష్ణుకు స్పష్టంగా తెలుసు. అయితే అదే మంచు విష్ణుకి ప్రభాస్ విషయం ఓ పెద్ద సమస్య కత్తిలా వేళ్లాడుతోంది.

వాస్తవానికి ‘కన్నప్ప’ అనే టైటిల్‌కి ఓ మైథలాజికల్ గ్రావిటీ ఉండొచ్చు... కానీ క్లాసును మాస్‌లోకి మార్చే శక్తి మాత్రం ఒక్క ప్రభాస్‌దే. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన తారాగణంతో తెరకెక్కుతోంది. అయినా ప్రేక్షకుల దృష్టిని థియేటర్ దాకా లాగగల ఒకే ఒక్క క్రేజ్ ఏమిటంటే – ప్రభాస్ పాత్రే!

మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌లో నమ్మకం ఉన్న మంచు విష్ణు, ఇప్పుడు ప్రమోషన్‌ల స్టేజ్‌కు వచ్చేసిన ‘కన్నప్ప’ కోసం తన ఫుల్ ఫోకస్‌ను ప్రభాస్ చుట్టూ తిప్పుతున్నాడు. ట్రైలర్‌లో ప్రభాస్‌కు ఎక్కువ స్పేస్ ఇచ్చేలా ఎడిటింగ్… ఇంటర్వ్యూలలో ఆయన పాత్ర గురించి పదేపదే చెప్పడం… ఇవన్నీ స్ట్రాటజీ గానే చూస్తున్నారు.

కానీ అసలు సమస్య:

“ఈ సినిమా theatrical rights అడుగుతున్న డిస్ట్రిబ్యూటర్ల ఫస్ట్ డిమాండ్ — ప్రభాస్ ప్రమోషన్ ఈవెంట్స్ కు వస్తున్నారా లేదా?’ That’s the deal breaker

అయితే ఈవెంట్లకు దూరంగా ఉన్న ప్రభాస్… ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌కి వస్తాడా?

ఇటీవలి కాలంలో ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకే దూరంగా ఉన్నాడు. తన సొంత ప్రాజెక్ట్‌ ‘రాజాసాబ్’ టీజర్ లాంచ్‌కే కూడా రాలేదు. అలాంటప్పుడు ‘కన్నప్ప’కు వస్తాడా? అన్నది పెద్ద అనుమానం. కానీ ఒక ఆశ మాత్రం మిగిలి ఉంది – ప్రభాస్, మోహన్ బాబు మధ్య వ్యక్తిగత సెంటిమెంట్.

మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలికినట్టు సమాచారం. ఆ సెంటిమెంట్ బలంగా పని చేస్తుందనేది టీం ఆశ.

“Without Prabhas, ‘Kannappa’ is just another mytho-drama. With him — it’s a PAN-India product.”

— ముంబైకు చెందిన ఓటిటి ఏంజెంట్ చెప్తున్న మాట

బిజినెస్ లెక్కలు:

సినిమా బడ్జెట్: ₹120+ కోట్లు

ప్రభాస్ పాత్ర: 30-40 mins (ఏకధాటిగా యాక్షన్ + divine presence)

ఓపినింగ్స్, ప్రారంభ రన్ డిపెండెన్స్: 70% ప్రభాస్ ఫ్యాన్ బేస్ మీదే

OTT, Satellite Buyers: ప్రభాస్ ప్రెజెన్స్ ని బట్టే డీల్స్

ట్రేడ్ చెప్పేది ఒకటే మాట... ప్రభాస్ సినిమాలో లేకుంటే… ‘కన్నప్ప’ ఎవరి రాడార్‌లోకూ రాదు!

ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నా, బాక్సాఫీస్ పుల్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్ బేస్‌తోనే లింక్ అయి ఉంది.

అందుకే...

"కన్నప్ప ఎంత గొప్ప కథైనా, మార్కెట్‌లో ప్రభాస్ లేకుండా అది శబ్దమవ్వదు!" "ఈవెంట్‌కి ప్రభాస్ వస్తే, అది సినిమాకే కాదు… బిజినెస్‌కి జెట్ స్పీడ్!"

శనివారం తేలుతుంది:

ఈ శనివారం హైదరాబాద్‌లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ వస్తాడా? అనేది బిజినెస్ వర్గాలు, ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న విషయం. ప్రభాస్ కనుక వస్తే, సినిమా మీద విపరీతమైన స్పాట్‌లైట్ పడుతుంది. One speech. One appearance. And it’s a blockbuster waitlist.

ప్రభాస్ కనుక రాలేకపోతే... మిగతా టీం ఒంటరిగా బరువును మోయాల్సిందే.

Read More
Next Story