‘కల్కి 2898 AD’ రేట్లు తగ్గింపు కలిసొచ్చిందా?, వీకెండ్ పరిస్దితి ఏమిటి
x

‘కల్కి 2898 AD’ రేట్లు తగ్గింపు కలిసొచ్చిందా?, వీకెండ్ పరిస్దితి ఏమిటి

ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)రేట్లు పెంచారు. చాలా విమర్శలు వచ్చినా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఓపినింగ్స్ బాగా వచ్చాయి.

ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)రేట్లు పెంచారు. చాలా విమర్శలు వచ్చినా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఓపినింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత సినిమా కు బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో అంచనాలు మించి థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఎంతలా అంటే చిత్రం విడుద‌లై నెల రోజులు దాటినా ఇంకా దాని ప్ర‌భావం మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రతీ వారం కొత్త సినిమాలు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సరైన సినిమా ఏదీ లేకపోవటంతో ఎదురే లేకుండా పోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1100కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ మూవీ అనేక రికార్టుల‌ను నెల‌కొల్పుతోంది.

ఈ నేపధ్యంలో సినిమా విడుద‌లై 7వ వారంలోకి అడుగుపెట్టాక ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర యూనిట్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సినీ అభిమానుల కోసం ఓ ఆఫర్ ఇప్పింది. క‌ల్కి సినిమా ప్ర‌ద‌ర్శిత‌మవుతున్న అన్ని థియేట‌ర్ల‌లో టికెట్ల రేట్ల‌ను కుదించింది. రూ. 100కే మూవీని చూడొచ్చంటూ త‌న సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా ప్ర‌క‌టించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ తగ్గింపు ధ‌ర‌లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. కాకుంటే కొన్ని ష‌ర‌తులు ఉంటాయ‌ని పేర్కొంది.

ఈ రేట్లు తగ్గింపు ఏ మేరకు కల్కి సినిమాకు కలిసొచ్చింది. అంటే వీకెండ్ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అవటానికి తోర్పడిందనే చెప్పాలి. ఆగస్ట్ 4 ఆదివారం హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలకు తగ్గించి టిక్కెట్లు ఇచ్చారు. దాంతో అప్పటిదాకా చూడని ఫ్యామిలీలు తరలి వచ్చాయి. ఓటిటి కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కూడా థియేటర్ ఎక్సపీరియన్స్ కోసం రావటం జరిగింది.

AMB, PVR, Prasads లో కల్కి హంగామా వీకెండ్ లో కనపడింది. చాలా మంది రెండో సారి ,మూడో సారి చూడటానికి రావటానికి ఈ టిక్కెట్ రేటు పనికొచ్చిందని అంటోంది ట్రేడ్. అలాగే ఫ్యాన్స్ కూడా రేట్లు తక్కువ కావటంతో తమవంతుగా ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంటే ఇలాంటి పెద్ద సినిమాలకు రేట్లు తగ్గిస్తే కలిసొస్తుందని అర్దమైంది.

అయితే అదే సమయంలో అల్లు శిరీష్ బడ్డీ సినిమాకు ఈ రేట్లు తగ్గింపు కలిసి రాలేదు. అంటే కంటెంట్ బాగుంటేనే రేట్లు తగ్గింపు అనేది వర్కవుట్ అవుతుందని ప్రూవ్ అయ్యింది. అలాగే మినిమం రేట్లు లేకపోతే చాలా సినిమాలు మిడిల్ క్లాస్ చూడటానికి థైర్యం చేయటం లేదు. ఫ్యామిలీలతో వచ్చి సినిమా చూడాలంటే మూడు వేలు దాటుతోందని వాపోతున్నారు. కాబట్టి సినిమాని బట్టి, కంటెంట్ ని బట్టి రేట్లు తగ్గింపు అనేది వర్కవుట్ అవుతుందని అర్దమవుతోంది.

ఇక కల్కి టీమ్ ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రయూనిట్‌. దాంతో సినిమాను ఎప్పుడు థియేటర్లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దామా? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉందని చెప్పొచ్చు. ఊహించినట్టే విజువల్‌ వండర్‌గా సినిమా ఉండటం కలిసొచ్చింది.

మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్ గానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది. ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది.

ఏదైమైనా డిమాండ్ బేసెడ్ ప్రైసింగ్ అనేది సినిమాలకు కలిసొచ్చే అంశం. టిక్కెట్ రేటు పెంచటం విషయంలో అయినా తగ్గింపులో అయినా. కంటెంట్ స్ట్రాంగ్ గా లేనప్పుడు ఎన్ని రేట్లు తగ్గించినా వర్కవుట్ కాదు. అలాగే ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఇంకొంత మందిని రీచ్ అవ్వాలంటే నాలుగైదు వారాల తర్వాత ఇలా రేట్లు తగ్గించటం అనేది వర్కవుట్ అయ్యే ఆలోచన అని ప్రూవ్ అయ్యింది. అయితే ప్రతీ పెద్ద సినిమాకు ఇదే స్ట్రాటజీ పనికి రాకపోవచ్చు. కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి అనుకున్నప్పుడు రెండో వారంలో కూడా ఇలా రేట్లు తగ్గిస్తే జనం ఓటిటిలో కన్నా థియేటర్ లో చూసే అవకాసం ఉంటుంది. ఆక్యుపెన్సీ పెరుగుతుంది.

Read More
Next Story