ఆ ఏడేళ్ళ కథతో  స్పై థ్రిల్లర్ , టైటిల్, డిటేల్స్!
x

ఆ ఏడేళ్ళ కథతో 'స్పై థ్రిల్లర్' , టైటిల్, డిటేల్స్!

పాక్ లో గూఢచారిగా అజిత్ దోవల్‌

దేశ భద్రత అంటే మాటలకోసం కాదు – ప్రాణాల పణంగా పెట్టి చేసే సేవ. అలాంటి అజేయ స్ఫూర్తికి నిలువెత్తు రూపం అజిత్ దోవల్. దేశం కోసం ముప్పెన్నాళ్లు శత్రుదేశాల్లో అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేసిన ఈ అసాధారణ మేధావి జీవితమే ఇప్పుడు వెండితెరపైకి రానుందని సమాచారం. RAW, IB, సర్జికల్ స్ట్రైక్స్ – ఇవన్నీ వినిపించేది వార్తల రూపంలో మాత్రమే. కానీ అవి జరిగేలా చేసే వ్యక్తుల జీవితాలు నిజమైన థ్రిల్లర్‌లకు మించినవి. అలాంటి గొప్ప జీవితమే ‘దురంధర్’ చిత్రానికి ఆధారంగా మారబోతోంది. ‘దురంధర్’ – అజిత్ దోవల్ గూఢచారి గాథ ఆధారంగా? ఇండస్ట్రీలో హై వోల్టేజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

"A spy rarely seeks the spotlight... but his shadow can change history."

ఈ కోటేషన్ ఒక్కటే సరిపోతుంది అజిత్ దోవల్ వంటి గూఢచారి జీవితం వర్ణించేందుకు. ఆయన జీవితం వెండితెరపైకి వస్తుందంటే... అది కేవలం ఒక సినిమా కాదు. అది దేశభక్తికి, మౌనంగా జరిగిన యుద్ధాన్ని చూపించే ఒక విశేష సందర్భం.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ (Uri: The Surgical Strike ఫేమ్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పై థ్రిల్లర్ ‘దురంధర్’ ఇప్పుడు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అంతేగాక, ఈ చిత్రం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితంలోని కొన్ని అసాధారణ సంఘటనల ఆధారంగా రూపొందుతోందని సమాచారం.

World Cinemaలో స్పై థ్రిల్లర్స్ ప్రాముఖ్యత :

స్పై థ్రిల్లర్ అంటే తక్షణమే మనకు గుర్తుకు వచ్చే సినిమాలు –

Tinker Tailor Soldier Spy

Argo

Zero Dark Thirty

Bridge of Spies

The Lives of Others

The Spy Who Came in from the Cold

ఈ చిత్రాలు అన్ని ఒకే అంశాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అదే “స్వతంత్రంగా జీవించాలంటే కొంత మంది మౌనంగా, చీకటిలో పని చేయాల్సిందే.”

ఇవి వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కడం వల్లే, ప్రేక్షకులపై మనసు కదిలించే భావోద్వేగ ప్రభావం చూపగలిగాయి. అలాగే, ఈ జానర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా బలమైన box office pull ఉంది. "Truth is more cinematic than fiction" అన్నట్టు, ఇది అన్ని దేశాల సినిమా మార్కెట్లకు వర్తించే నిజం.

హై ఇంటెలిజెన్స్ థ్రిల్లర్ :

వరల్డ్ సినిమా నేపథ్యంలో ‘దురంధర్’ చాలా ప్రత్యేకమవుతుంది. ఎందుకంటే ఇది కేవలం గూఢచారిత్వం గురించిన కథ కాదు – ఇది భారత రియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌కి రూపకల్పన చేసిన ఒక వ్యక్తి, అజిత్ దోవల్ గురించి.

పాకిస్తాన్‌లో ఏడేళ్ల పాటు అండర్ కవర్ మిషన్లు

ఉగ్రవాద స్థావరాల్లోకి చొరబడి రహస్యాల్ని సేకరించడం

స్థానిక ముస్లిం వేషాల్లో శత్రుదేశంలో నివసించడం

పూర్తిగా మౌనంగా, ఆపరేషన్ విజయానికి మాత్రమే జీవించడం

ఇవన్నీ ఆయన జీవితం... కానీ, ఇప్పటివరకు చాలామంది ఊహించలేనివి. ఇప్పుడు ‘దురంధర్’ వాటిని తెరపై రిప్రజెంట్ చేయబోతోంది.

‘దురంధర్’ థీమ్ :

1970-80ల కాలంలో పాకిస్తాన్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనలు

భారత ఇంటెలిజెన్స్ how it worked beyond borders

గూఢచారుల మానసిక స్థితి, దేశం కోసం చేసిన త్యాగాలు

ఒక మానవుడి భయంతో పాటు ధైర్యం కూడా ఎలా కలిసి వస్తాయో చూపించే కథ

అజిత్ దోవల్ – ఒక మనిషి. కానీ ఒక ఇంటెలిజెన్స్ శక్తిగా దేశానికి ప్రత్యక్ష అస్త్రం. ఇప్పుడు ఆ శక్తి... తెరపై ‘దురంధర్’ అవుతుంది!

“A soldier fights at the border... a spy lives beyond it.”

ఈ కాన్సెప్టే.... సినిమాకు వెన్నెముకగా ఉండబోతోంది. అలాగే ఈ సినిమాకు ప్లస్ లు ...రణవీర్ సింగ్ నటనలో తిప్పలేని intensity, ఆదిత్య ధర్ visionary filmmaking (Uri: The Surgical Strike ఫేమ్), మిలిటరీ, RAW, IB, పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థల మధ్య ఇంటెలిజెన్స్ వార్, సైలెంట్ ఎమోషనల్ డ్రామా, హై స్టేక్స్ యాక్షన్, రియలిస్టిక్ టెన్షన్

అంతేకాదు, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి బలమైన నటులు కూడా ఈ మిషన్‌లో భాగం కావడం సినిమాకు అంతర్జాతీయ appeal ఇస్తోంది.

బాక్స్ ఆఫీస్ & బిజినెస్ :

“In cinema, war films bring numbers, but spy thrillers build brands.”. ప్రపంచవ్యాప్తంగా స్పై థ్రిల్లర్స్‌కు ఉండే డిమాండ్‌ తెలుపుతోంది – Netflix, Amazon Prime, HBO Max వంటి వేదికలు ఇప్పటికే స్పై dramasపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి.

హిందీతో పాటు, దక్షిణ భాషలలో మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లలో రిలీజ్ కావాలనే ‘దురంధర్’ టార్గెట్. జూలై 6న (రణవీర్ బర్త్‌డే) స్పెషల్ టీజర్ ద్వారా గ్లోబల్ ప్రచారం ప్రారంభం. సెప్టెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి, నవంబర్–డిసెంబర్లో థియేట్రికల్ రిలీజ్ లేదా 2026 ప్రారంభంలో OTT తో పాటు స్ట్రాటజిక్ థియేట్రికల్ మిక్స్ చేసి విడుదల చేసే ఛాన్స్.

ఫైనల్ గా ... :

ఈ సినిమా గురించి బాలీవుడ్ ఒకటే మాట అంటోంది. “దురంధర్… పక్కా జాతీయభక్తి కాదు, కానీ గుండెను గజగజలాడించే గూఢచారి గాథ!”

“Where silence screams and shadows bleed... there begins ‘Durandhar’.”

రియల్ హీరోల్ని వెండితెరపై చూడటానికి... సిద్ధమవండి!

Read More
Next Story