‘ఇన్‌స్పెక్టర్ ఝండే’ మూవీ రివ్యూ
x

‘ఇన్‌స్పెక్టర్ ఝండే’ మూవీ రివ్యూ

రెట్రో స్టైల్ బాగుంది కానీ రైటింగ్ దెబ్బకొట్టింది

1986లో ప్రసిద్ధ “బికినీ కిల్లర్” చార్లెస్ శోభరాజ్ (జిమ్ సర్బ్) తిహార్ జైలు నుంచి డ్రామాటిక్‌గా తప్పించుకున్నాడు. తన పుట్టినరోజునే మొత్తం జైలును మత్తు మందు కలిపిన మిఠాయిలతో మత్తెక్కించి… తలుపులు తెరిచి బయటకు నడిచేశాడు.

ఈలోగా, బోంబేలోని ఒక వీధిలో — పాలు కోసం క్యూలో నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ మధుకర్ ఝండే (మనోజ్ బాజ్ పాయ్) చెవిలో రేడియో వార్త పడుతుంది: “చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి తప్పించుకున్నాడు…”

క్యూలో ఉన్నవాళ్లు ఇంకా అతని వైపు తిరిగేలోపే, ఝండే అదృశ్యమైపోతాడు — మధ్యతరగతి సూపర్‌హీరోలా, ఫోన్‌ రిసీవ్ చేసుకోవటం కోసం పరుగెత్తే సూపర్‌మాన్‌లా! అతనికి తెలుసు… ఏ క్షణంలోనైనా ఫోన్ మోగుతుంది. ఎందుకంటే ఈ ప్రాణాంతక క్రిమినల్‌ను ఒకప్పుడు పట్టుకున్న కొద్దిమంది అధికారుల్లో ఝండే ఒకడే!

శోభరాజ్ మామూలు వాడు కాదు... 1970 నుంచి అతను వేర్వేరు దేశాలకు చెందిన జైళ్ల నుంచి ఐదు సార్లు తప్పించుకుంటాడు. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ ను ముప్పతిప్పలు పెట్టిన ఖైదీ అతను. అలాంటి నేరస్థుడు మరోసారి తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఝండే ఊహించినట్లుగానే అలాంటి శోభ రాజ్ ను పట్టుకోవడం కోసం డీజీపీ 'పురంధర్' (సచిన్ ఖేడేకర్) అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఝండేకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఝండే తన టీమ్ తో కలిసి రంగంలోకి దూకుతాడు. శోభ రాజ్ 'గోవా'కి పారిపోయినట్టుగా అతని తెలుస్తుంది. దాంతో అతను తన టీమ్ తో కలిసి అక్కడికి బయిలుదేరతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఝండే టీమ్ కి ఎలాంటి ఛాలెంజ్ ఎదురవుతాయి? అనేది కథ.

ఇప్పుడు “ఇన్స్పెక్టర్ ఝండే vs బికినీ కిల్లర్”… హంట్ మళ్లీ మొదలవుతోంది!

అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. అదేమిటంటే సినిమాలో చార్లెస్ శోభరాజ్ అనే పేరు వాడు. లుక్ అలాగే ఉంటుంది. అక్కడ పేరు భోజ్ రాజ్.

ఎనాలసిస్

హంట్ అనగానే ఏదోదో సీరియస్ గా ఊహించుకోవద్దు. ఈ సినిమా కాస్త కామెడీ టచ్ తో నడుస్తుంది. అంతా కూల్ గా, అక్కడక్కడా చిన్న చిన్న జోక్స్ తో నడుస్తూంటుంది. డైరక్టర్...సీరియస్ ఇన్వెస్టిగేషన్ కి కామెడీ టచ్ తో అంటే క్రైమ్ థ్రిల్లర్‌లా కాకుండా క్రైమ్ కేపర్ కామెడీగా మలిచాడు. సీరియస్ కథని సరదా జానర్‌గా మార్చేశాడు. ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్ — కానీ అంత స్మూత్‌గా వర్కవుట్ కాలేదు.

క్రైమ్-కామెడీ అనేది ఇలాంటి కథనానికి ఓ కొత్త యాంగిల్ అయినా, సీరియస్ సబ్జెక్ట్ (కిల్లర్ ఎస్కేప్) మీద లైట్ టోన్ వేసేయడం వల్ల స్టేక్స్ తగ్గిపోయాయి. కొన్ని సన్నివేశాలు బాగా ఫన్నీ, కొన్ని మాత్రం బలవంతంగా హాస్యం కోసం పెట్టినట్టే కనిపిస్తాయి. ఫలితం .. టోన్ అసమానంగా ఉంటుంది.

విలన్ ట్రాక్ వీక్

చార్లెస్ శోభరాజ్ గా జిమ్ సర్బ్ లుక్ & ప్రెజెన్స్ పర్ఫెక్ట్ అయినా, స్క్రిప్ట్ అతనిని కేవలం ఫిజికల్ కాపీలా వాడుకుంది. గతంలో రణదీప్ హుడా, సిద్ధాంత్ గుప్తా లాంటి వారు శోభరాజ్ పర్సోనాకు లేయర్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ శోభరాజ్ వీక్ విలన్ గా కనపడతాడు. దాంతో విలన్‌పై ఫోకస్ తగ్గడం వల్ల కథలోని సస్పెన్స్, డేంజర్ అన్నీ తగ్గిపోయి నీరసంగా తయారైంది.

స్టైల్ vs సబ్‌స్టెన్స్

70ల బాలీవుడ్ రిఫరెన్స్‌లు, బచ్చన్–దేవ్ ఆనంద్–రాజేష్ ఖన్నా నేమ్‌డ్రాప్‌లు, నోస్టాల్జిక్ మ్యూజిక్, రెట్రో షాట్లు—ఇవి బాగా వాడేశారు. అసలు రైటింగ్ & ప్రొడక్షన్ లోపాన్ని దాచడానికే ఈ “పీరియడ్ స్టైల్” వాడినట్టుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది కానీ కన్విక్షన్ లేదు

కొన్ని గ్యాగ్స్ (టోయ్ సైకిల్ మీటింగ్, వెడ్డింగ్ ఫైట్-డాన్స్) బాగానే వర్కవుట్ అయ్యాయి. కానీ చాలా సీన్స్ హాస్యంగా కాకుండా పేలవంగా మిగిలిపోయాయి. సినిమా మొత్తం మీద “ఇది ఒక ఫన్ ఎక్స్‌పెరిమెంట్” అని అనిపించినా, లోపలి సోల్ మాత్రం కనిపించదు.

చూడచ్చా

ఇన్‌స్పెక్టర్ ఝండే పూర్తి థ్రిల్లర్ కాదు. ఇది కామెడీ-క్రైమ్ డ్రామాగా చూస్తే బాగానే ఉంటుంది. కానీ, నిజమైన థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకున్న వారికి మాత్రం నిరాశ కలిగిస్తుంది.

ఫైనల్ థాట్

ఇన్‌స్పెక్టర్ ఝండే కథలో అసలు కిక్కు ఏంటంటే – ఇది ఒక పోలీస్ vs క్రిమినల్ రన్ మాత్రమే కాదు… సిస్టమ్ vs స్మార్ట్‌నెస్ పోరాటం కూడా. భోజ్ రాజ్ లాంటి నేరస్థులు చట్టం కన్నా ఎప్పుడూ ముందే ఉన్నారని చూపిస్తే, ఝండే లాంటి పోలీస్ ఆఫీసర్స్ తమ పరిమితుల మధ్య కూడా అసాధ్యాన్ని సాధ్యం చేస్తారని గుర్తు చేస్తుంది. నిజమైన థ్రిల్లర్‌గా కాకపోయినా, ఇది పోలీస్ ఫన్ డ్రామాగా, సిస్టమ్‌లోని గ్యాప్‌లను కామెడీగా చూపించే ప్రయత్నంగా గుర్తుండిపోతుంది.

ఎక్కడ చూడచ్చు

నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగులో ఉంది

Read More
Next Story