186 కోట్లు వచ్చాయని  నమ్మాము కానీ ..ఇప్పుడు ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి
x

186 కోట్లు వచ్చాయని నమ్మాము కానీ ..ఇప్పుడు ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి

పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో కలెక్షన్స్ ని అఫీషియల్ గా నిర్మాతలు ప్రకటిస్తూ వస్తూండటం ఆనవాయితీగా మారింది.

పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో కలెక్షన్స్ ని అఫీషియల్ గా నిర్మాతలు ప్రకటిస్తూ వస్తూండటం ఆనవాయితీగా మారింది. అయితే ఆ ప్రకటించే కలెక్షన్స్ లో కొంతే నిజం ఉంటుందని, ఎంతో కొంత పెంచి వేస్తారు అనేది ఇండస్ట్రీ లోపల వాళ్లకి, బయట వాళ్లకి అందరికీ తెలిసిన సంగతి తెలిసిందే. అయితే అది కొంతవరకే. మరీ జనాలకు అనుమానం కలిగే రేంజిలో అయితే కలెక్షన్స్ పెంచి ప్రకటించారు. అలా చేసిన ప్రతీసారీ దొరికిపోతూంటారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూంటారు. ఇప్పుడు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ కు అదే జరుగుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ ని అఫీషియల్ గా నిర్మాతలు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

నిన్న ఉదయం గేమ్ ఛేంజర్ సినిమా రిలీజైన అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు శంకర్ మీద దారుణమైన విమర్శలు వస్తున్నాయి. శంకర్ తీసిన కొన్ని సీన్లు, రామ్ చరణ్ లుక్స్, యాక్టింగ్ మీద ట్రోలింగ్ జరుగుతూ వస్తోంది. సినిమాలో పాటల మీద పెట్టిన శ్రద్ద కథ, స్క్రీన్ ప్లే మీద పెడితే బాగుండేదని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా శంకర్ అవుట్ డేటెడ్ అయ్యిపోయాడని.. ఇంకా అక్కడే ఆగిపోయాడని ఈ మూవీని ఓ పది,పదిహేనేళ్ల క్రితం తీసి ఉంటే జనాలకు నచ్చేదేమో అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.

గేమ్ ఛేంజర్ సినిమాకు మొదటి రోజు 186 కోట్ల వసూళ్లు వచ్చాయని చెప్పుకొచ్చింది టీమ్. దాంతో ఎన్టీఆర్ దేవర ఓపెనింగ్‌ను బీట్ చేసినట్టు అయ్యింది. అయితే గేమ్ ఛేంజర్‌కు నిజంగానే అంత వచ్చిందా? ఇదంతా ఫేక్ అంటున్నారు ఓ వర్గం. అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. ఎవరైనా పది కోట్లు పెంచుతారు, ఇరవై కోట్లు పెంచుతారు...నువ్వేంటయ్యా ఏకంగా రూ. 100 కోట్లు పెంచేసావు అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరికొందరు వెటకారంగా కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్‌ ప్రకటించండి మహా ప్రభో అంటున్నారు. అయినా ఎలాగో వేసారు కదా...ఇంకో 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్‌ బద్దలు అయిపోయిందని పోస్టర్‌ రిలీజ్‌ చేసి ఉంటే అదిరిపోయేది కదా అని మరికొందరు అంటున్నారు.

ఎందుకీ భాక్సాఫీస్ లెక్కలు

నిజానికి నిర్మాతకు సైతం కరెక్ట్ గా ఎంత కలెక్ట్ అయ్యిందనేది మొదటి రోజే లెక్క తేలదు. కొంచెం అటూ ఇటూ గా ఉంటాయి. కొన్ని అంచనాలను కలుపుతారు. వాటిని అన్నిటినీ కలిపి నిర్మాణ సంస్దలు తమ సినిమా కలెక్షన్స్ ప్రకటిస్తాయి. ఎందుకు ఈ కలెక్షన్స్ ప్రకటన అంటే కేవలం అభిమానులు కోసమే అని చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర చిత్రం కన్నా ఎక్కువ వచ్చిందనేది వారికి కావాలి. ఈ విషయం నిర్మాణ సంస్దలకు తెలుసు. అందుకే ఇలా దిల్‌ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్‌ ఛేంజర్‌ లెక్కల వివరాలను ప్రకటించింది.

దేవర ని దాటామని చెప్పటానికేనా?

ఎన్టీఆర్ దేవర చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ పోస్టర్ 172 కోట్లు అని వేశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు 186 కోట్లు అని ప్రకటించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పోటీ RRR నుంచి మొదలైంది. అది ఇప్పుడు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ బాగా పెంచి వేయటంతో బాగా బయటకు వచ్చినట్లైంది. దేవర రిలీజ్ టైమ్ లోనూ కలెక్షన్స్ పెంచి వేశారనే విమర్శలు వచ్చాయి. అయితే మరీ ఇంతలా కాదు. అ

ఏదమైనా ఈ ప్రకటన తో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్‌ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్‌ ఛేంజర్‌ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.

సిని ప్రముఖులు ఈ కలెక్షన్స్ పోస్టర్స్ పై ఏమంటారంటే...

సినిమా వాళ్లకు ఈ కలెక్షన్స్ చెప్తూ నిర్మాతలు వదిలే పోస్టర్స్ అంటే కామెడీగా ఉంటుంది. గతంలో దగ్గుబాటి రానా అయితే మరీ దారుణంగా ఈ పోస్టర్ల మీద కామెంట్ చేశాడు. ఆ పోస్టర్లన్నీ కూడా సరదాకే వేస్తామని అన్నారు. నిర్మాత నాగవంశీ అయితే మా నిర్మాతలు ఎవ్వరైనా సరే.. మా వ్యాపారాన్ని మేం రోడ్డున పెట్టుకుంటామా? ఎంత వచ్చిందో మీకు ఎందుకు చెప్తాం.. చెప్పేదంతా నిజం కాదు అని అన్నాడు.

Read More
Next Story