‘OG’ కెనడా కలెక్షన్స్ క్రాష్‌కు రీజన్ ఇదే?
x

‘OG’ కెనడా కలెక్షన్స్ క్రాష్‌కు రీజన్ ఇదే?

ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్


గత కొద్ది రోజులుగా అమలాపురం నుంచి అమెరికా వరకు సినీ ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ ఫీవర్‌తో ఊగిపోయింది. ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా అమెరికా బాక్సాఫీస్‌లో దాదాపు రన్ పూర్తిచేసుకుంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం $5.5 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినా, కెనడా బాక్సాఫీస్‌లో మాత్రం కలెక్షన్స్ బలహీనంగా నిలిచాయి. కారణం — డిస్ట్రిబ్యూటర్‌ కి, కెనడాలోని ప్రధాన థియేటర్‌ చైన్‌ York Cinemas మధ్య తలెత్తిన వివాదం.

యార్క్ సినిమాస్ వర్గాలు “బాక్సాఫీస్ మానిప్యులేషన్ జరుగుతోంది” అంటూ సినిమా రిలీజ్ చేయడానికి నిరాకరించాయి. దానికి డిస్ట్రిబ్యూటర్‌ “యార్క్ సినిమాస్ మాఫియా లా ప్రవర్తిస్తోంది, బ్లాక్‌మెయిల్ చేస్తోంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ వివాదం పెరిగి పెద్దదై.. York Cinemas సంస్థ తమ థియేటర్లలో ఓజీ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని ప్రకటించింది. ‘ఓజీ’కి సంబంధించి అన్ని షోలను క్యాన్సిల్ చేస్తున్నామని, అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నవారికి డబ్బులు రిఫండ్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు సుదీర్ఘ నోట్‌ని రిలీజ్ చేసింది.

అందులో ‘ఓజీకి సంబంధించి అన్ని షోలను రద్దు చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. నార్త్ అమెరికాలో సినిమా డిస్ట్రిబ్యూషన్‌తో ముడిపడి ఉన్న వివిధ కల్చరర్, పొలిటికల్ శక్తుల వల్ల ప్రేక్షకుల భద్రతకు హాని కలిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నాం. అందువల్ల ప్రేక్షకులకి కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. అడ్వాన్స బుకింగ్స్ చేసుకున్న వారికి సొమ్మ మొత్తాన్ని రిఫండ్ చేస్తాం. మా కస్టమర్లు, ఉద్యోగులు భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత.

నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకి వచ్చే కలెక్షన్స్ పెంచి చెప్పాలని, అలా అయితేనే ఆ తర్వాత రిలీజయ్యే పెద్ద సినిమాలకు వాల్యూ పెంచుకోవడానికి అవకాశముంటుందని డిస్ట్రిబ్యూషన్ తరపు వ్యక్తుల నుంచి రిక్వెస్టులు వచ్చాయి. నార్త్ అమెరికాలో సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

సామాజిక స్టాయి, రాజకీయ అనుబంధాల ఆధారంగా సౌత్ ఏషియన్ వర్గాల్లో కల్చర్ పరంగా విభేధాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యార్క్ సినిమాస్ ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతుల్ని ప్రోత్సహించదని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాం’ అని యార్క్ సినిమాస్ సుదీర్ఘ నోట్ రిలీజ్ చేసింది. ఈ నోట్ సహజంగానే పవన్ అభిమానులకు కోపం తెప్పించింది.

అయితే ఇప్పుడు ‘ఓజీ’ రన్ ముగిసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ “అన్ని ఇష్యూలు సాల్వ్ అయ్యాయి, ఇప్పుడు యార్క్ సినిమాస్‌లో మా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి” అని ప్రకటించడం ఫ్యాన్స్‌ను మరింత కోపానికి గురిచేసింది.

అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ –

“రన్ అయిపోయాక ఇప్పుడు రిలీజ్ అంటే ఏమిటి?

బిజినెస్ కోసం వీళ్ళ మాటలు, స్టాండ్స్ మారిపోతుంటాయి!” అని మండిపడుతున్నారు.

ఏదైమైనా ‘ఓజీ’ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కోల్పోయిందనేది నిజం. యార్క్ సినిమాస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య నిజంగా ఏమైందో?

సినీ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

Read More
Next Story